Wednesday 25 September 2019

ఓం నమశ్శివాయ


ఓం నమశ్శివాయ 
ముణులు మోక్షము కై పలికెడి మంత్రం 
ముజగములను పాలించు మంత్రం
ముకోటి దేవతలు అనుక్షణం అనుకొనేడి మంత్రం
మన్మధుడు మనసారా పలికిన మంత్రం
మంచు కొండల నడుమ మారుమోగే మంత్రం
మకర జ్యోతి స్వరూపుడి మనసు లోని మంత్రం
యందరో నయనార్లను అనుగ్రహించిన మంత్రం
యక్ష కీనేరలు ఎల్లపుడు పలికెడి మంత్రం
యమ , కుబేరులను ఎలేడి మంత్రం
పదునాలుగు భువనాలను పరిపాలించు మంత్రం
పంచ భూతేశ్వరుని మంత్రం
సద్ గురువులు ఉపదేశించేడి  ముల మంత్రం
సచ్చిదానంద స్వరూపుని మంత్రం
మనకు మోక్ష మార్గము ఈ మంత్రం
ఓం నమశ్శివాయ  అను మంత్రం



Saturday 14 September 2019


శివ తాండవం 
హిమగిరి శిఖరం పై ,
అరుదైన మంచు మంధిరం ,
ఆ మంధిరం లో అద్భుత మైన  సింహాసనం ,
ఆ సింహాసనం పై సచ్చిదానంద  స్వరూపం ,
ఆ స్వరూపం నింగి ,నేల ,నిరు , నిఫు , గాలి మయమైన స్వరూపం ,
నందీశ్వరుడు నాధం పాడగా ,
కాలభైరవుడు కదం తొక్కగా ,
ప్రమథ గణములు పల్లవి పాడగా ,
శివ గణములు చిందులు వేయగా ,
అష్ట దిక్పాలకులు జై జై ద్వానాలు పలుకగా ,
సర్వ దేవతలు ఆహా ఓహొ నాధలతో  ,
సచ్చిదానంద స్వరూపుని నాట్యం అవధులు లేని ఆనందం ,
ఓం  శివాయ నమ ఓం 





Thursday 12 September 2019



పంచ భూత లింగస్వరూపం

నీల వర్ణం నీవు నీరు నీవు ( జంబుకేశ్వర లింగం )
ఉచ్స్వాశ నిశ్వాస నొసగు నీవు శ్వాసవు నీవు ( కాళహస్త్రి లింగం )
అగ్నినేత్రం కలవాడవు అగ్ని వి నీవు ( అరుణాచల లింగం )
అంతులేని స్వరూపం నీవు ఆకాశం నీవు ( చిధంబర లింగం )
పుడమిని పాలించు ప్రభుడవు నీవు పుడమి నీవు ( ఏకాంబర లింగం )
పరమ పురుష నమో నమః