Friday 20 November 2020

శివ పాధాష్టకమ్


 శివ పాధాష్టకమ్

జన్మజదుఖనివారిత పాదం   

1) త్రిమూర్తత్మకమహా పాదం , అధి భిక్షువుని అనంత పాదం

    ముజ్జగములనేలెడిముక్కంటుని పాదం , ఆహారహామెలిగేడిదినకర పాదం

    ధరణిదారిద్యదుఖ;నివారిత పాదం  ,   ఘనాఘనుడిదివ్య పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

2) రౌద్రరూపితరుద్రపాదం   ,   వీరభద్రునిపాదం

    కాలాత్మకపాదం   ,     సకలవిపత్ నివారితపాదం

    పంచభూతేసునిపవిత్ర పాదం , అజ్యంతరహితునిఅద్భుత పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

3) మోహినీసమొహితపాదం , అసురభస్మాంతకపాదం

    నిష్కళంకితనిత్యసత్యపాదం , పురాణపురుషునిపుణ్యపాదం

   అన్నపూర్ణేషునిఅపూర్వపాదం , బష్మభూషితభాగ్యపాదం

   శరణాశ్రీతసంరక్షిత పాదం

4) గరళకంఠునిఅమృత పాదం , అర్ధనారీశునిఅభయ పాదం

    మహాశేక్తిఛైతన్య పాదం , సర్వసముద్బవసంజీవిని పాదం

    కన్నప్పనేలినఅమోఘ పాదం , భక్తవత్సలునిభవబయహర పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

5) మృత్యంజయేశునిజయవిజయపాదం,ఆర్తినిబాపేడుత్రినేత్రునిఅక్షయ పాదం

    మరణశ్యాసనమెదిరించిన పాదం , పునర్ జీవమొనరించిన పాదం
    పాప ప్రక్షాళన గావించేడి  పాదం , త్రిపురాంతక పాదం

   శరణాశ్రీతసంరక్షిత పాదం

6) శానికాదిమునిముక్తులవందిత పాదం , సాధుజనసంరక్షిత పాదం

    దేవముని ప్రవరార్చిత పాదం, గాండీవికి విజయాస్త్రమొసగిన పాదం

    అసురకులాంతక హనుమత్ పాదం , రతీ శోకనివారిత పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

7) నవ్య నాట్య నటశేఖర పాదం , శేశిదరేశుని కాంతి పాదం

    విశ్వజనకుడి సహస్రాక్షునినిర్మల పాదం , జన్మకడతేర్చుధర్మ పాదం

    విశ్వనాధునివిలక్షణ పాదం , మోక్షమోసెగెడి ముక్తి పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

8) త్రివిష్టశునివిశిష్ట పాదం , పుణ్యజలేషునిదుష్ కర్మనివారిత పాదం

    పరాశరేశుని పావన పాదం , ధన్వంతరేశుని ధన్య పాదం

    శేక్తి పాదం శివ మూర్తి పాదం , కైవల్య మొసగెడి భవుని పాదం

   శరణాశ్రీతసంరక్షిత పాదం

పలస్థుతి 

శివపాదయుగళార్చిత పటేనీత్యం 

పరమ్ త్ కృష్టానుగ్రహిత వరప్రద శ్రీ చరణారవిందం 

జగత్ పీతం , శివోహం , శివోహం , శంభో ఉమాపతిo

రచన 
చెర్లో హైమావతి 




Thursday 10 September 2020

సూళ్లురుపేట చెంగాళమ్మ సృష్టి అంతటా ని మాయే కద్దమ్మ

 

సూళ్లురుపేట చెంగాళమ్మ సృష్టి అంతటా ని మాయే కద్దమ్మ 

సుభగిరి పట్టణంలో శుభములనొసగు సృష్టికారిణివి నీవు ,
నిత్య మై సత్యమై నిలువెత్తు నిదర్శనం నీవు , 
కాళింగి నదీతీరాన కోటి కాంతులతో కదిలాడు దైవం నీవు ,
సకల శక్తుల  సమ్మెలనమైన చాంగాలమ్మవు నీవు ,
సుడిమాను చుట్టు తిరగంగా సృష్టిని యేలేవు సూళ్లూరు చెంగవ్వ వు  నీవు , 
కనులార చుచిన చాలు కనువిప్పు గావించు కలియుగ దైవం నీవు ,
ముడుపు కట్టిన చాలు ముందుండి నడిపించు దైవం నీవు ,
మృచివు నీవు మోక్షమార్గము నీవు ముగ్గురమ్మల మూలము నీవు ,
ధరణి నేలగ దక్షణ ముఖముతో దరిశన మిచ్చు దక్షణ కాళికవు నీవు , 
అష్ట శెక్తులతో అష్ట భుజములతో అష్ట దశ పీఠముల స్వరూపము నీవు ,
పులివాహనం పై పుడమినేలు పురుషోత్తముని పట్టపు రాణివి నీవు ,
సకల దేవతల సమ్మెళనం ఐ  సూళూరుపేటలో వెలసిన  చంగాలమ్మవి నీవు ,
నిమ్మ దండలు వేయంగా నిజరూప దర్శన మిచ్చే వు మాయమ్మ వి నీవు ,
దినా  జనులను పాలించగ వెలసిన దివ్య తేజో స్వరూపిణి వి నీవు ,
జగ జనని శ్రీ శ్రీ శ్రీ  చెంగాళ పరమేశ్వరి మాత 
రక్షమాం  రక్షమాం  రక్షమాం 



Sunday 6 September 2020

అగస్య ముణి గుటక నుంచి జాలువారిన ఘటిక సిద్దేశ్వర లింగం

అగస్య ముణి  గుటక నుంచి జాలువారిన  ఘటిక సిద్దేశ్వర లింగం .  

 పుట్టుకలేని పురుషోత్తముడు పుడమిపై వెలసిన పుణ్య క్షేత్రం ,

పున్నమి వెన్నెలలో పురివిప్పు  నాగమ్మ పూజలందుకొను వాని క్షేత్రం,

అరణ్యము  లో ఆధి దంపతులు అంతట నిండి నిబిడీ  కృతమైవున్న క్షేత్రం,

ఉదయగిరి కొండల నడుమ కోటికాంతులతో కొలువైవున్న క్షేత్రం,

పదునాలుగు భువన బాండములను పాలించెడి వాని క్షేత్రం,

త్రిమూర్తులు తిష్టవేసుకొని తీరని కోరికలు తీర్చు క్షేత్రం,

ముజ్జగములకు మూలకారకుడు వెలసిన క్షేత్రం,

అమ్మ  ఇష్టకామేశ్వరి గా  ఇల వెలసిన క్షేత్రం,

అగస్యముని అహోరాత్రులు ఆరాధించిన అద్భుత క్షేత్రం,

అను నిత్యము ఆకలి దప్పికలు తీర్చు ఆదిదంపతులు అవతరించిన క్షేత్రం,

అవధూతలకు ఆలవాలమైన క్షేత్రం,

అలుపెరుగని జలధారలతో నంది వాహనుడు వెలసిన క్షేత్రం,

వీరభోగ వసంతరాయులు విరాజిల్లు క్షేత్రం,

సిద్ధపురుషులు సిద్దులు పొందిన సిద్ధేశ్వరుని క్షేత్రం,

కొండ కొనలలో కోటి సూర్య కాంతులతో కొలువైన క్షేత్రం, 

                              

      ఈ  క్షేత్రం ఘటిక సిద్ధేశ్వరుని క్షేత్రం,

       ఓం  నమః శివాయ 

 

Thursday 12 March 2020

గురువులకు గురువు జగత్ గురువు


గురువులకు గురువు జగత్ గురువు 
1. నారాయణ సూక్తముతో నలుదిక్కుల నడిచిన గురువు 
2.అద్వైత స్థాపన తో అందరి ఆరాధ్య గురువు 
3.శారదా మాత చరణ కమలముల ఫై సేద తీరిన గురువు 
4. నలుదిక్కుల , నాలుగు వేదములను నాలుగుపీఠములుగా  నిలిపిన గురువు 
5. కనకధారతో కనకమును కురిపించిన గురువు 
6. చరాచర జగత్తుకు చిరకాలము చిరు దీపమై వెలుగు నిచ్చు  గురువు 
7. పదవరవడితో పరమాత్మను పరవశింప జేసిన గురువు 
8. నాటి నుండి నేటి కి నరులను నుద్ధరింపగ నిలచిన గురువు  
9. కాషాయ వస్త్రములతో కలియుగ కమనీయ గురువు 
10. మంత్ర శాస్త్రములో మిక్కిలి మేలిమైన గురువు 
11. నాస్తికులను ఆస్థికులుగా నడిపించిన గురువు 
12. సకల దేవతల నిలయమైన శ్రీ చక్రమును నిలిపిన గురువు 
13. ఉపాసనలకు ఊపిరిగా నిలిచిన గురువు 
అధి గురువు ,అనాది గురువు, 

శ్రీ శ్రీ శ్రీ అది శంకరా చార్యులు మన గురువు

Monday 24 February 2020

నమశివాయ నీవే శివం


నమశివాయ నీవే శివం 
ఓం   శివం  ఓంకారం   శివం
            'న '  శివం   నకారం    శివం
            'మ'  శివం   మకారం  శివం
             'శి'   శివం   శికారం    శివం
             'వ'   శివం   వకారం    శివం
             'య'  శివం  యకారం  శివం      
        'న' కార , 'మ ' కార ,  'శి' కార ,
                 'వ' కార , 'య' కార
          సర్వకార సర్వేశ్వరుడవు సమస్తము నీవు సకల ఆకర నిర్వికార స్వారూపుడవు నీవు