Tuesday, 21 March 2017

శివవందన స్తుతి

శివవందన స్తుతి -108

 1.  ఓం నమో శంకర శివ వందన                          
 2. . త్రిజన్మ పాప వినాశన 
 3. దాక్షాయణి ప్రియ వదన 
 4. అర్త రక్షణ 
 5.  జగదో ధారణ 
 6. సర్వసంకట హరణ 
 7. ఆదిభిక్షువు పాప ప్రక్షాళన 
 8. వేదాంత వెద్యయన 
 9. సోమ సూర్యాగ్నిలోచన 
 10. త్రిలోకసంచారణ 
 11.  అధినాయక సర్వ భూత గణ 
 12. శంభో వృషభ వాహన 

వందనమిదే శరణాగత రక్షణ 


 1. నటన సూత్ర ధారణ 
 2. జగత్ లయ కరణ 
 3. శివ కేశవాది వేక రూపిత త్రిలోకార్చన 
 4. లలాట లిఖిత బ్రహ్మ జ్ఞాన నేత్రణ 
 5. సతి దక్ష యజ్ఞ హుతి శివ దూషణ 
 6. విశ్వ ప్రళయ విజృంభణ 
 7. ప్రళయాగ్ని ప్రభంజన 
 8. జటా జ్యూటోద్భవ   వీర భద్ర ఆగమన 
 9. దక్ష యజ్ఞ వినాశన 
 10. సతి ఆదిశేక్తి అంసోనత  అష్టాదశ శేక్తి పిటోద్భవ కారణ    
 11. ధరణి దారిద్య దుఃఖ దహన 
 12. అఖిలాత్మజ సర్వసంక్షోభిత శోక నివారణ 

 వందనమిదే శరణాగత రక్షణ 


 1.  యోమాకేశ భష్మా భూషణ 
 2. పులిచర్మ వస్త్ర జటా మకుట  ధారణ 
 3. రుద్రాక్ష హరాయ ఫణి భూషణాయ 
 4. గంగోదక జట్టజూట ధారణ 
 5. గరళ కంట జటిలత్ త్రినేత్రణ
 6. సిగలో చంద్ర దరణ 
 7. పాశాంకుశ ఢమరుక సింహగర్జన 
 8. కాపాలి త్రిశుల ధారణ  
 9. స్మశాన వాసిని భవ భయ దుక్క హరణ 
 10. దిన బందో అనాధ నిధన 
 11. వేదాంత వెద్యయన 
 12. కఠోర దీక్ష తపోనిది యోగాసనా

వందనమిదే శరణాగత రక్షణ 1 హిమాసుత బిష్టిత సుందర వందన 

2 మదనాగ్ని భస్మిత అగ్ని నయన 
3 రతి శోక నివారిత భక్త వత్సల  నామ ధారణ 
4 పార్వతి పరిణయ లోకోద్ధరణ 
5 తాండవకేళి విలసిత ప్రణయ శృంగార లోచన 
6 కుమార గజ ముఖ నందన 
7 జగత్ మాతాపిత అర్ధ నారీరమణ 
8 హరి బ్రహ్మాహేంద్ర సన్నుత సద్గుణ 
9 సురా సురామూని గణ పూజిత శుభచరణ 
10 దేవ ముని ప్రవరార్చన 
11 తుంబుర నారదాది గానాలాపన 
12 శనకాది ముని వర వందిత శ్రీ చరన 
వందనమిదే శరణాగత రక్షణ


 1. సాధు పాలలోచన 
 2. అనసూయత్రి లాలన 
 3. పశుపతాస్త్ర అనుగ్రహణ 
 4. సకల జీవ కోటి జీవనోధారణ 
 5. సర్వసముద్భవకారణ 
 6. మృకండవరపూజిత గౌరి రమణ 
 7. అకాలమృతు హరణ 
     8 కాల యమ శాసన 
    9 మార్కండేయ ప్రాణ రక్షణ 
   10 చిరంజీవి సిరియాలు పునర్జీవన 
   11 అభిష్ట వరద అక్షయ వరప్రదాయన 
   12  గణగణ భవ్య కలాపోషిత నిత్య నర్తన వందనమిదే శరణాగత రక్షణ 

 1. మృగువర శాపోనాథ ఇల లింగరూప ధారణాయ 
 2. లోక కల్యాణ గుణ గణ 
 3. కోటిలింగార్చిత రావణా పూజర్పణ 
 4. అభిషేక ప్రియ విబూది అలంకరణ 
 5. మారేడు బిల్వ పత్రార్చన 
 6. పారిజాత వృక్షస్య మూలాధారణ 
 7. సుమ సుగంధ మంధర కుసుమ ప్రియా రమణ 
 8. కోటిసూర్య సమప్రభ దివ్య తేజో ధారణ 
 9. ఆత్రత్రణ పరాయణ 
 10.  నిత్య జన శివ పంచాక్షరీ నామోచ్చారణ 
 11. సర్వభూతహిత ప్రధ బహురూప ధారణ 
 12. అక్షయ లింగా  అనంతనయన 

         వందనమిదే శరణాగత రక్షణ

 1. బస్మహస్తది భస్మిత ప్రియ మోహిని సన్ మోహన 
 2. దివ్య తేజోమయ అయ్యప్ప జన్మ కరణ 
 3. అఖండ జోతిష్ స్వరూప అర్త రక్షణ 
 4. గ్రహపీడ నివారణ 
 5. అసుర కార్య విధ్వంసని నాశన 
 6. త్రిపురాంతకం దైత్య దమన 
 7. సకల విపత్ నివారణ 
 8. కామితార్ద ప్రదాయన 
 9. పురాణ పురుష పరమ పవన 
 10. కాలాత్మక  పంచభూత విలక్షణ 
 11. మనోవాంఛితఫలప్రదాయన 
 12. మరకత లింగ రూప ధారణ  

వందనమిదే శరణాగత రక్షణ

 1. పంచలింగ సమన్విత పంచారామ క్షేత్రజ్ఞ 
 2. కోటిలింగేశ్వర నామధారణ 
 3. స్వాయంభువ భక్త పాలనా 
 4. ప్రమథ గణాధి నిత్య రాధన 
 5. మహా యజ్ఞ ఫలార్పణ 
 6. చిదంబరేష చింతనాశన 
 7. కల్ప కోటి యుగధరణ 
 8. కామ క్రోధాగ్ని దహన 
 9. ముర్క కన్నప్ప జ్జ్ఞానో ధారణ 
 10. నాదప్రియ గానగంధర్వాది నిత్య స్వరార్చన 
 11. ద్వాదశ జోతిర్లింగ నిత్య నిరంజన 
 12. ఆదిత్యాది గ్రహరూపణ 

వందనమిదే శరణాగత రక్షణ

 1. మల్లికార్జున మహా లింగోద్భవ మోక్ష శిఖర దర్శన 
 2. వాయు లింగ సర్ప దోష నివారణ 
 3. వైద్య నాధాయ భావ రోగ  హరణ 
 4. మహాకాలేశ చిత భస్మ లోచన 
 5. యస్సావి అమరలింగేశ్వరధారణ 
 6. కేదారేశ్వర మహాశేక్తి చైతన్య కీర్తివర్ధన 
 7. సైకతలింగ విమోచిత శ్రీరామలింగ ప్రతిష్టాపన 
 8. ఆత్మ మోక్ష ప్రధ కాశివిశ్వేశ్వర నామధారణ 
 9. ఆత్మ లింగ ఇల గణపతి స్థాపన 
 10. త్రయంబకేశ పాతకనాశన 
 11. అనంత లింగ ఆవిర్బవన 
 12. విష్వాత్మక విఠలాక్ష విశ్వరూప ధారణ 
వందనమిదే శరణాగత రక్షణ
శివ అష్టోత్తర శత వందన సమర్పయామి 
రచన 
చెర్లో  హైమావతి గారు