Friday 20 November 2020

శివ పాధాష్టకమ్


 శివ పాధాష్టకమ్

జన్మజదుఖనివారిత పాదం   

1) త్రిమూర్తత్మకమహా పాదం , అధి భిక్షువుని అనంత పాదం

    ముజ్జగములనేలెడిముక్కంటుని పాదం , ఆహారహామెలిగేడిదినకర పాదం

    ధరణిదారిద్యదుఖ;నివారిత పాదం  ,   ఘనాఘనుడిదివ్య పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

2) రౌద్రరూపితరుద్రపాదం   ,   వీరభద్రునిపాదం

    కాలాత్మకపాదం   ,     సకలవిపత్ నివారితపాదం

    పంచభూతేసునిపవిత్ర పాదం , అజ్యంతరహితునిఅద్భుత పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

3) మోహినీసమొహితపాదం , అసురభస్మాంతకపాదం

    నిష్కళంకితనిత్యసత్యపాదం , పురాణపురుషునిపుణ్యపాదం

   అన్నపూర్ణేషునిఅపూర్వపాదం , బష్మభూషితభాగ్యపాదం

   శరణాశ్రీతసంరక్షిత పాదం

4) గరళకంఠునిఅమృత పాదం , అర్ధనారీశునిఅభయ పాదం

    మహాశేక్తిఛైతన్య పాదం , సర్వసముద్బవసంజీవిని పాదం

    కన్నప్పనేలినఅమోఘ పాదం , భక్తవత్సలునిభవబయహర పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

5) మృత్యంజయేశునిజయవిజయపాదం,ఆర్తినిబాపేడుత్రినేత్రునిఅక్షయ పాదం

    మరణశ్యాసనమెదిరించిన పాదం , పునర్ జీవమొనరించిన పాదం
    పాప ప్రక్షాళన గావించేడి  పాదం , త్రిపురాంతక పాదం

   శరణాశ్రీతసంరక్షిత పాదం

6) శానికాదిమునిముక్తులవందిత పాదం , సాధుజనసంరక్షిత పాదం

    దేవముని ప్రవరార్చిత పాదం, గాండీవికి విజయాస్త్రమొసగిన పాదం

    అసురకులాంతక హనుమత్ పాదం , రతీ శోకనివారిత పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

7) నవ్య నాట్య నటశేఖర పాదం , శేశిదరేశుని కాంతి పాదం

    విశ్వజనకుడి సహస్రాక్షునినిర్మల పాదం , జన్మకడతేర్చుధర్మ పాదం

    విశ్వనాధునివిలక్షణ పాదం , మోక్షమోసెగెడి ముక్తి పాదం

    శరణాశ్రీతసంరక్షిత పాదం

8) త్రివిష్టశునివిశిష్ట పాదం , పుణ్యజలేషునిదుష్ కర్మనివారిత పాదం

    పరాశరేశుని పావన పాదం , ధన్వంతరేశుని ధన్య పాదం

    శేక్తి పాదం శివ మూర్తి పాదం , కైవల్య మొసగెడి భవుని పాదం

   శరణాశ్రీతసంరక్షిత పాదం

పలస్థుతి 

శివపాదయుగళార్చిత పటేనీత్యం 

పరమ్ త్ కృష్టానుగ్రహిత వరప్రద శ్రీ చరణారవిందం 

జగత్ పీతం , శివోహం , శివోహం , శంభో ఉమాపతిo

రచన 
చెర్లో హైమావతి