Tuesday 7 September 2021

గురుబోధ


 'ఆ'శ ,వ్యామోహం ను అంతము చేయు వారు గురువులు,

'ఇం'ద్రియములను జయించే శేక్తి నిచ్చు వారు గురువులు,

'ఉ'పదేశముతో ఉచ్చస్థితిని అనుగ్రహించు వారు గురువులు,

'ఏ'క కాలమున తనువు మనసు ఏక మయి శేక్తిని అనుగ్రహించు వారు గురువులు,

'ఓ'ర్పు సహనమును అనుగ్రహించు వారు గురువులు,

'కా'మ, క్రోధ, మద , మాచర్యలను మట్టుపెటు వారు గురువులు,

'గ'ర్వమును గెలిచే శేక్తిని ఇచ్చు వారు గురువులు,

'జ'ప తప నియమాలను అనుగ్రహించు వారు గురువులు,

'చ'రా చర జగత్తు గమనమునకు ములం అయిన వారు గురువులు,

అంతటి గురు దేవునకు నిత్యము,అనుక్షణము  వారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారములు 

నా గురుదేవులు అయిన స్వామికి మనసా ,వాచా , కర్మాణ నా శిరశు వంచి నమస్కరించు  మీ దాసుడను

Monday 6 September 2021

కాశి విశ్వం


 శివమ్ కాశి , కాశి శివమ్ , నమః కాశి , కాశి నమః ,

జపం కాశి, కాశి జపం , తపం కాశి, కాశి తపం ,
స్వరం కాశి, కాశి స్వరం, జగమ్ కాశి, కాశి జగమ్,
అంతయు నీవు అంతిమ న అక్కున చేర్చు అనంత లోకం కాశి క  పురాధీశుడవు నీవు కాశి నువు 

ఓం నమశ్శివాయ శివాయనమః

 

- నలుదిక్కుల నిండి నిబిడీకృతమైన లింగం  ఆకాశలింగం ,

                - మన్వంతరాల నుండి మానవ మనుగడ నీవైఉన్నలింగం  భూలింగం, 

శి - శిఖరమై శిఖరాగ్రం నీవై వెలుగునిచ్చు లింగం   అగ్నిలింగం,

                వా - వానవై , వరదవై , వాగువై విశ్వ మంతా నిండివున్న లింగం  జలలింగం ,

            - ఎనిమిది దిక్కులు నీవై యావత్తు నీవై   నిండివున్న లింగం  వాయులింగం , 

'న ' కార , 'మ' కార , 'శి ' కార , 'వ ' కార , 'య ' కార  సర్వకార సర్వేశ్వరుడవు సమస్తము నీవే సకలకార నిర్వికార స్వరూపుడవు నీవే ఓం నమశ్శివాయ శివాయనమః   

Saturday 21 August 2021

ముక్తి మార్గం

 


ఆత్మ పరిశీలన అణునిత్యము ఆచరణలోకి ఉంచిన నాడు ఆ పరమాత్మ గోచరమగును,

అరిషద్ వర్గములు అంతరించి న నాడు ఆత్మ ఆ పరమాత్మకు చేరువగు చున్నది ,
అండము లో పిండము వలే ఆత్మ బ్రహ్మాండము లో  అంతయు అవరించును,
అది అంతము తానై అజేయుడవు నీవై ఆ చంద్ర తరర్ధము నిలిచెదవు
అది గురువులు నడిచిన దారి ,
మనందరికి ముక్తికి దారి ,


Monday 19 July 2021

గురుదీవెన


 నిర్మల మై నిశ్చల స్థితి లో నిలచిన  నాడు నిగూడ మై న సత్యము దొరుకును
 ఈ సమస్తమునకు ములము దొరుకును నిలకంఠుని నిలయము నెరిగెదము 
అటి సత్యము ను చూడవలె నన్న గురు కటాక్షము పొంద వలెను గురు పాదములను సేవించ వలెను ....గురు దీవెన ఉన్న శిశునకు సమస్తము మంగళము గురు పాదములను చరను వెడిన మరుజన్మ మోక్షం మోక్షం

Tuesday 20 April 2021

శ్రీ రామ భక్త ఆంజనేయ చేరితాంభృత అష్టోత్తర శత స్తోత్ర రత్నావళి

 


శ్రీ రామ భక్త ఆంజనేయ చేరితాంభృత అష్టోత్తర శత స్తోత్ర రత్నావళి 

నమామి శ్రీ రామ భక్త హనుమధీశ్వరం


 నమామి శ్రీ  రామ భక్త హనుమధీశ్వరం 


స్థితి ఖంఠంశజ అజేయం , దైత్యంతక మహావీరమ్ జగత్ కల్యాణ కారకం 
సౌమిత్రి ప్రాణ దాతం , సీత శోకనివారిత యశస్వి శ్రీరామ వరణనం 
దుష్కర్మ నివారిత మారుతీ నామాంభృత తుల్యం , సంజీవిని ఆయువర్ధనం 
సింధూర తిలకాంకిత నాగవల్లి పత్రర్చితం , అబేష్టిత అక్షయ వరప్రదం 
భజేహం , భజేహం , శ్రీ  రామ భక్త హనుమధీశ్వరం నమామి ప్రణమామ్యహం 


రచన  
చెర్లో  హైమావతి 

Monday 12 April 2021

గురు పాదం

 

అది అంతము లేని అది దేవత పాదం,

'ఆ' కార ' ఉ'  కార 'మ' కార ఓం కార మునకు మూలం ఈ పాదం, 

వేద పురాణ ములకు ముల మైన ముక్తి పాదం,

సద్ గురువులు సమస్తము నివని వేడుకను సచ్చిధానంద పాదం,

గుడి లో ఉంది గుండె గుండె లో కొలువైన పంచ బుతాత్మకుని భవ్య పాదం,

నాయనర్లు నమిన నవ యవ్వన పాదం,

నిర్వి కార సర్వ కార సమస్తము నీవై నిండి నిబిడికృతమై న నిలకంఠుని పాదం, 

ఓం నమశివయ హర హర సద్ గురవేన మహా

Sunday 17 January 2021

త్రిశక్తి అష్టోత్తర స్తోత్ర రత్నములు

 


                        త్రిశక్తి  అష్టోత్తరస్తోత్రరత్నములు 

1. సర్వసముద్బవకారిణి, శతకోటి సహస్రనామిని సకల గుణాత్మికి సుచ్చరితే ,సర్వసంక్షోభిత శోకనివారిణి, శతత హస్తాభిష్టిత ఫలప్రదాయని కాత్యాయిని గౌరి కామాక్షి , కారణమూర్తివి శివకామిని , తాండవ కేలికవే, భయకంపిత రూపిణి బాహుబలశ్యాలిని   సింహపువాహినివె  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని 

2. కేధరీశ్వరిఅలంపురి శ్రీ రాజరాజేశ్వరీ , మోక్ష సాగరి ప్రయాగే కాశీపురి, మంగళ గౌరిమాత అన్నపూర్ణేశ్వరి భార్గవి భవ్య భవనానంద దీపాంకురి , బ్రహ్మాండ బాండోదరి నవయవని శుభకరీ చాముండేశ్వరి వైష్ణవి వాసవి కన్యకపరమేశ్వరి , జ్ఞానప్రసూనాంబికేశ్వరి త్రయంబకి కౌమారి , అంబాబగళ  జ్వాలాముఖి భైరవి ఉమామహేశ్వరి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని 

3. బ్రంహి బ్రాహ్మణి బ్రహ్మతమికి విధాత్రి విశ్వనేత్రిని , సుష్టిస్థితిలయకారిణి సదాభూతేషు సహా ధర్మచారిణి , విశ్వవందేవింధ్య వాసిని, ఓంకారేశ్వరి హిరణ్యేలలితా భవాని యశశ్వి విశ్వేశ్వరి విశ్వరూపిణి సర్వాలంకృత నవరత్న భరణి , శోబాంకిత సర్వమంగళకారిణి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని

4. మృడాణి మహాచంద ప్రచండి హుంకరిణి , త్రిపురాంతకి మహాకాళి రౌద్రరూపిణి , రుద్రాణి , పరాశెక్తి ప్రళయాగ్నిహోతి అగ్నిపుత్రి లోకపావని నిఖిలేశ్వరి సర్వభూతాని , యోగీశ్వరీ యోగమాయి కేశవగ్రజధారిణి , రసఙ్ఞాననాధలోచిత వేదవేదాoగాది వేదజనని త్రికాలే బ్రహ్మజ్ఞాన నేత్రిణి సకల కళసరళి   తగుణగణి , వ్యాస వాల్మీకాది మదిపద లావణ్య జ్ఞానతరంగిణి , వాగ్ధయని శ్రీవాణి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని

5.  కారుణ్య లహరి శివకామేశ్వరి కళ్యాణి, భువనత్రయమణికుండల మండితమధుస్యలిని , ఇంద్రకీలాద్రిని దుర్గాభవాని కత్రితేజోవతి మనస్వికలశస్థాపిత స్వరూపిణి , మాణిక్యంబిక త్రిపురసుందరి  త్రిశేక్తి మూలకారిణి , పంచాక్షరీబ్రామరీకైవల్య ఫలప్రదాయని సహస్రక్షి బహుముఖకరచరణాయుధాది అభయహస్తిని , ఆశ్రితకల్పకోటి యుగదాయని కరుణాతరంగిణి , దివ్యతేజో విరాజితానందదీప్తిని విశుద్ధచక్రంనివాసిని  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని

  6.  సతీదక్షయఙ్ఞహుతి హిమసుతి శివ అర్ధనారి , అగ్రపూజాంకితసుత సౌభాగ్య ఫలప్రద ఆర్తరక్షని , నిష్కళంకిత సత్యవాణి నిత్యపారాయణిదారిద్య దుఃఖదాహాని అష్టాదశ శెక్తిరూపిణీ నిత్యానంద సందాయని , వేదమయి యజ్ఞప్రియ మహామంత్రమూర్తిణి , ఓంకారబీజాక్షరీ మహాశేక్తి ఛైతన్యకీర్తివర్దిని కోటిసూర్యసమప్రభావిత స్వయం ప్రకాశిని , లోకోత్తర గర్విణి విశ్వమోహిని , పంచభూత విలక్షణి దైత్యహంత్రీ విజయేశ్వరి మహిషాశురమర్ధిని  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని

7.  ఓం , ఐం ,హ్రీ0, శ్రీ0 , మహామంత్రాక్షరి ఆద్యంతరహితేత్రిమాతృకి , త్రికూటే తీపురేశ్వరి మాతజగజననీ శివాని , త్రైలోక్య కుటుంబిని త్రిలోచని మహసాంబ్రాజదాయని నిగమాంత సంచారిణి హరిబ్రహ్మేంద్ర వందిత శ్రీ నారాయణి , సురాసుర దేవగణాధి సేవిత అఖిలాండేశ్వరి కరుణాపూరిణి , లోకానుగ్రహకారిణి మాధవేశ్వరి మీనాక్షి గిరిజాఓడ్వాణి విశ్వతోముఖీపరంజో

తి  పంచముఖ గాయత్రి వరదాభయికౌముది ,జ్ఞానవికాశిత వేదాత్మికి జాహ్నవి  శత్రువినాశిని శ్యాంబవి భద్రకాళి మహోగ్రరూపిణి దైత్యదమని,  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని 

8.  కర్మాకర్మ వివర్ధితే ఆత్మ మోక్షాకరీ వారణాసి జలవైభవి , సర్వార్ధసంధార్తి విశాలాక్షి సర్వవ్యాపి మహావిభవి, భవద్ భవ్య భూతగనాదిపతే స్కందసుతే సర్వోన్నత సనుతి యుగేయుగే , మహత్హృష్టాను గ్రహకారిణి గురుమండలవాసిణి కామిని కామదాహాని భవ బంధవిమోచని , వజ్రేశ్వరి వారాహి వైజయంతి ప్రజున్మే శేక్తి పిటెం  పురుహితి కావేకవీరే సకలచరాచర జగత్ జగత్ స్థితి  శాంకరి సుమనోహారి బక్తగ్రేశ్వరి , చంద్రమౌళి భానుమండలవాసిని లోకశోక నివారిణి , బ్రహ్మాండ రూపిణి విశ్వజనని ప్రణతోష్మీమాత శ్రీ చరణి  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని 

పలస్తుతి 

కుంకుమ శోభిత వాచలితే వారసుబితిని బాపుగదే 
సతిపతి క్షేమము కోరుగదే , జీవిత నావను నడుపుదువే 
జయజయహే శివశంకరి మగువ మనోగ్నివి మంగళగౌరి జయదుర్గే 
నమస్తే    నమస్తే రామనాథ సమేత శ్రీ పర్వతవర్దిని నమోస్తుతే 


అందించిన వారు ,
ఆదిదంపతులు 

రచన 
చెర్లో హైమావతి