Monday 22 May 2017

శివలింగస్వరూపం

శివలింగస్వరూపం 
జలధారలతో మిల మిల మెరిసే ని లింగం 
కర్పూర హారతితో తళుకు మనిపించు ని లింగం 
విబూది ధారణతో నిగ నిగ లాడు ని లింగం 
బిల్వ పత్రముతో వరాలనొసగు ని లింగం 
కుంకుమ ధారణతో కళ కళ లాడు ని లింగం 
నాగాభరణముతో నయనానందకరంగా ని లింగం 
పూల అలంకారంతో పరిమళించు ని లింగం
యంత చుసిన తనివితీరని ఆ లింగం  
పానవట్టము పై ప్రకాశించు ఆ పరమ పురుషుని స్వరూపమే ఆ శివ లింగం 
ఓం నమః శివాయ నమః 

యంత మధురం ని దివ్య నామం

 యంత మధురం ని దివ్య నామం 
ఎనెన్ని  నామాలు యంత మధురం నినామాలు 
కవులు పొగిడేడి నామాలు కనువిందు చేయు నామాలు 
కాళహస్త్రిలో నినామం కాశీలో నినామం 
కమనీయ నామం కరుణజూపెడి నామం 
దేవగణములు  ఆరాధ్య నామం సకల దేవతలు ధ్యానించు నామం 
అధి గురువు ఆరాధించిన నామం సర్వేశ్వరుని సర్వ మంగళ నామం 
అంతట నిలయమై ఉన్న నామం అందరి ఆరాధ్య నామం 
ఓం నమః శివాయ అను ని నామం 

Sunday 21 May 2017

శ్రీ రామ దూతం శిరసా నమామి

శ్రీ రామ దూతం శిరసా నమామి 
అణువణువునా అద్వైతం 
ఆకు పూజ నీకు ప్రియం 
అరచేత సంజీవిని పర్వతం 
యుగయుగాల దైవం 
అందరి ఆరాధ్య దైవం 
ని దర్శనం తో సకల శుభం 


నిత్య చిరంజీవి

నిత్య చిరంజీవి 
నిత్య చిరంజీవి వి  శ్రీ రామ పాద దాస 
నవయవన మూర్తివి శ్రీ రామ పాద దాస 
సర్వ శుభకరుడవు శ్రీ రామ పాద దాస 
సకల వేద నిధివి శ్రీ రామ పాద దాస 
సచ్చిదానంద రూపుడవు శ్రీ రామ పాద దాస 
సీతామాత సేవిత శ్రీ రామ పాద దాస 
లక్ష్మణ ప్రాణదాత శ్రీ రామ పాద దాస 
లంకాదహన కారక శ్రీ రామ పాద దాస 
అనుక్షణము శ్రీ రామ నామం జపించు శ్రీ రామ పాద దాస 
వందనాలు నీకు శత కోటి వందనాలు శ్రీ రామ పాద దాస 

Saturday 20 May 2017

పరమ శివుని పుత్రుడా పళని దేవుడా


పరమ శివుని పుత్రుడా పళని దేవుడా 
ముజగములేలు దైవం
అందరి ఆరాధ్య దైవం
ఆరు ముఖముల దైవం
ఋగ్మతులను తొలగించు దైవం
పళని కొండపై ప్రకాశించు దైవం
పాల కావిడి ఎంతో ప్రియమైన దైవం
గండాలను గజ గజ లాడించు దైవం
నెమలి వాహన రూపుడైన దైవం
ఓం శ్రీ వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి అందరికి   దైవం