Sunday 17 January 2021

త్రిశక్తి అష్టోత్తర స్తోత్ర రత్నములు

 


                        త్రిశక్తి  అష్టోత్తరస్తోత్రరత్నములు 

1. సర్వసముద్బవకారిణి, శతకోటి సహస్రనామిని సకల గుణాత్మికి సుచ్చరితే ,సర్వసంక్షోభిత శోకనివారిణి, శతత హస్తాభిష్టిత ఫలప్రదాయని కాత్యాయిని గౌరి కామాక్షి , కారణమూర్తివి శివకామిని , తాండవ కేలికవే, భయకంపిత రూపిణి బాహుబలశ్యాలిని   సింహపువాహినివె  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని 

2. కేధరీశ్వరిఅలంపురి శ్రీ రాజరాజేశ్వరీ , మోక్ష సాగరి ప్రయాగే కాశీపురి, మంగళ గౌరిమాత అన్నపూర్ణేశ్వరి భార్గవి భవ్య భవనానంద దీపాంకురి , బ్రహ్మాండ బాండోదరి నవయవని శుభకరీ చాముండేశ్వరి వైష్ణవి వాసవి కన్యకపరమేశ్వరి , జ్ఞానప్రసూనాంబికేశ్వరి త్రయంబకి కౌమారి , అంబాబగళ  జ్వాలాముఖి భైరవి ఉమామహేశ్వరి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని 

3. బ్రంహి బ్రాహ్మణి బ్రహ్మతమికి విధాత్రి విశ్వనేత్రిని , సుష్టిస్థితిలయకారిణి సదాభూతేషు సహా ధర్మచారిణి , విశ్వవందేవింధ్య వాసిని, ఓంకారేశ్వరి హిరణ్యేలలితా భవాని యశశ్వి విశ్వేశ్వరి విశ్వరూపిణి సర్వాలంకృత నవరత్న భరణి , శోబాంకిత సర్వమంగళకారిణి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని

4. మృడాణి మహాచంద ప్రచండి హుంకరిణి , త్రిపురాంతకి మహాకాళి రౌద్రరూపిణి , రుద్రాణి , పరాశెక్తి ప్రళయాగ్నిహోతి అగ్నిపుత్రి లోకపావని నిఖిలేశ్వరి సర్వభూతాని , యోగీశ్వరీ యోగమాయి కేశవగ్రజధారిణి , రసఙ్ఞాననాధలోచిత వేదవేదాoగాది వేదజనని త్రికాలే బ్రహ్మజ్ఞాన నేత్రిణి సకల కళసరళి   తగుణగణి , వ్యాస వాల్మీకాది మదిపద లావణ్య జ్ఞానతరంగిణి , వాగ్ధయని శ్రీవాణి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని

5.  కారుణ్య లహరి శివకామేశ్వరి కళ్యాణి, భువనత్రయమణికుండల మండితమధుస్యలిని , ఇంద్రకీలాద్రిని దుర్గాభవాని కత్రితేజోవతి మనస్వికలశస్థాపిత స్వరూపిణి , మాణిక్యంబిక త్రిపురసుందరి  త్రిశేక్తి మూలకారిణి , పంచాక్షరీబ్రామరీకైవల్య ఫలప్రదాయని సహస్రక్షి బహుముఖకరచరణాయుధాది అభయహస్తిని , ఆశ్రితకల్పకోటి యుగదాయని కరుణాతరంగిణి , దివ్యతేజో విరాజితానందదీప్తిని విశుద్ధచక్రంనివాసిని  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని

  6.  సతీదక్షయఙ్ఞహుతి హిమసుతి శివ అర్ధనారి , అగ్రపూజాంకితసుత సౌభాగ్య ఫలప్రద ఆర్తరక్షని , నిష్కళంకిత సత్యవాణి నిత్యపారాయణిదారిద్య దుఃఖదాహాని అష్టాదశ శెక్తిరూపిణీ నిత్యానంద సందాయని , వేదమయి యజ్ఞప్రియ మహామంత్రమూర్తిణి , ఓంకారబీజాక్షరీ మహాశేక్తి ఛైతన్యకీర్తివర్దిని కోటిసూర్యసమప్రభావిత స్వయం ప్రకాశిని , లోకోత్తర గర్విణి విశ్వమోహిని , పంచభూత విలక్షణి దైత్యహంత్రీ విజయేశ్వరి మహిషాశురమర్ధిని  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని

7.  ఓం , ఐం ,హ్రీ0, శ్రీ0 , మహామంత్రాక్షరి ఆద్యంతరహితేత్రిమాతృకి , త్రికూటే తీపురేశ్వరి మాతజగజననీ శివాని , త్రైలోక్య కుటుంబిని త్రిలోచని మహసాంబ్రాజదాయని నిగమాంత సంచారిణి హరిబ్రహ్మేంద్ర వందిత శ్రీ నారాయణి , సురాసుర దేవగణాధి సేవిత అఖిలాండేశ్వరి కరుణాపూరిణి , లోకానుగ్రహకారిణి మాధవేశ్వరి మీనాక్షి గిరిజాఓడ్వాణి విశ్వతోముఖీపరంజో

తి  పంచముఖ గాయత్రి వరదాభయికౌముది ,జ్ఞానవికాశిత వేదాత్మికి జాహ్నవి  శత్రువినాశిని శ్యాంబవి భద్రకాళి మహోగ్రరూపిణి దైత్యదమని,  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని 

8.  కర్మాకర్మ వివర్ధితే ఆత్మ మోక్షాకరీ వారణాసి జలవైభవి , సర్వార్ధసంధార్తి విశాలాక్షి సర్వవ్యాపి మహావిభవి, భవద్ భవ్య భూతగనాదిపతే స్కందసుతే సర్వోన్నత సనుతి యుగేయుగే , మహత్హృష్టాను గ్రహకారిణి గురుమండలవాసిణి కామిని కామదాహాని భవ బంధవిమోచని , వజ్రేశ్వరి వారాహి వైజయంతి ప్రజున్మే శేక్తి పిటెం  పురుహితి కావేకవీరే సకలచరాచర జగత్ జగత్ స్థితి  శాంకరి సుమనోహారి బక్తగ్రేశ్వరి , చంద్రమౌళి భానుమండలవాసిని లోకశోక నివారిణి , బ్రహ్మాండ రూపిణి విశ్వజనని ప్రణతోష్మీమాత శ్రీ చరణి  భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని 

పలస్తుతి 

కుంకుమ శోభిత వాచలితే వారసుబితిని బాపుగదే 
సతిపతి క్షేమము కోరుగదే , జీవిత నావను నడుపుదువే 
జయజయహే శివశంకరి మగువ మనోగ్నివి మంగళగౌరి జయదుర్గే 
నమస్తే    నమస్తే రామనాథ సమేత శ్రీ పర్వతవర్దిని నమోస్తుతే 


అందించిన వారు ,
ఆదిదంపతులు 

రచన 
చెర్లో హైమావతి