Tuesday 4 April 2017

అంత యింత కాదు అద్భుతమైనది శ్రీ రామ నామం



అంత ఇంత కాదు అద్భుతమైనది శ్రీ రామ నామం 
 హనుమంతుడు అనుక్షణము స్మరియించు శ్రీ రామ నామం
రావణ బ్రహ్మను రణరంగమున ఎదిరించిన నామం  శ్రీ రామ నామం
భద్ర గిరి పై వెలసిన బలే మంచి నామం శ్రీ రామ నామం
శబరి ఎంగిలి పండ్లు తినిన ఆ సర్వేశ్వరుని నామము శ్రీ రామ నామం
ఒకే మాట ,ఒకే భార్య ,ఒకే బాణం అన్న మహనీయుని నామం శ్రీ రామ నామం
సూర్య వంశ తేజోరూపుడైన వాని నామం శ్రీ రామ నామం
మహిమాన్విత నామం శ్రీ రామ నామం

Sunday 2 April 2017

సదాశివ ని మహిమ


సదాశివుని మహిమ 
 నీ సిగనుండి గంగమ్మను ఈ భువికి నొసగిన నీ  మహిమ 
హర హర అన్న వానికి అభయమిచ్చు నీ మహిమ 
హలాహలమును గరళములో దాచి జగత్తును కాచిన నీ మహిమ 
మార్కండేయునికి ముక్తి నొసగిన నీ మహిమ 
గణనాయకునికి గజముఖమును ధరింపజేసిన నీ మహిమ 
ఎందరో ముని జనులకు ముక్తి నొసగిన నీ మహిమ 
జగదాంబను నీలొ సగభాగము ఇచ్చి అర్ధనారీశ్వరునిగా చూపిన నీ మహిమ 
అఖిల లోకములను పాలించు నీ దివ్య మహిమ 
సకల భూత గణములు సేవించెడి నీ మహిమ 
ఎంత పొగిడిన చాలదు నీ దివ్య మహిమ  
ఓం నమః శివాయ అను నామమే ఎంతో మహిమ 

Saturday 1 April 2017

త్రిసంధ్య గాయత్రి ఆవాహన మంత్రం


త్రిసంధ్య గాయత్రి ఆవాహన మంత్రం 
అయతు ,వరదాదేవి !
అక్షరమ్ బ్రహ్మ సమ్మితమ్ !
గాయత్రిం చంధసాం !
మతే !ఇదం బ్రహ్మ జుషస్వ మే !
యత్ అహ్నాత్ కురుతే పాపం ,
తత్ అహ్నాత్ ప్రతిముచ్యతే !
యత్ రాత్రియత్ కురుతే పాపం ,
తత్ రాత్రియత్ ప్రతిముచ్యతే !
సర్వవర్ణే !మహదేవి ! సంధ్యా విధ్యే !సరస్వతి !
భావము :- ఓం అను అక్షరం పరబ్రహ్మ స్వరూపిణివగు శ్రీ గాయత్రి దేవి !సర్వ సిద్ధి ప్రదాత అయినదానవు . నీకు 
సుస్వాగతము, నిచ్చిత జ్ఞానము ప్రసాదించు దానవు నిను చెంబోబాధమగు గాయత్రి మంత్రము ద్వారా ఉపాసించుతున్నాము సద్గురువువై బ్రహ్మ తత్వము యొక్క సువిదితము కొరకు నిన్ను అనుష్ఠిచుతున్నాము నివు తలివి ,తలికి తప్పే కనిపించదు బ్రహ్మ తత్వము యెరుగుటకు నాయొక్క దోషములు అడ్డు వస్తు ఉండవచ్చుగాక , అయితే జనని వగు నిన్ను ఆశ్రయించి ఉపాసించడము ఒక ఔషధము ఏ రాత్రి పగలు దోషములు రాత్రియే ని అనుష్ఠానముచే తొలగిపోవునుగాక , అమ్మ !నిన్ను నేను ఉపాసిస్తు ఉన్నపుడు సర్వదేవత వర్ణనలు అంతర్లీనమై ఉన్నాయి 

మహిమలున్న దేవుడు

మహిమలున్న దేవుడు 
త్రినామాల స్వరూపము 
త్రినేత్ర రూపము 
త్రిలోక పూజ్యము 
త్రికాల సంచారము 
త్రిశక్తి స్వరూపము 
త్రియంబక నివాసము 
త్రిమూర్తి స్వరూపము 
త్రిగుణాత్మక రూపము 
త్రిశూలము నికు ఆయుధము 
త్రిబిళ్వ పూజితము 
త్రిలోకములకు దైవము 
ఆ మహిమానితునికి మనసా వాచా కర్మణః శిరస్సు  వంచి పాదాభి వందనాలు  

ఆ ముకంటి వాని స్వరుపం

ఆ ముకంటి వాని స్వరూపం 
అద్వైత స్వరూపం 
అధి నాయకుని స్వరూపం 
అద్భుత స్వరూపం 
అనిర్వచమైన స్వరూపం 
అఖిలాండ బ్రహ్మాండ స్వరూపం 
నిత్య పుజా స్వరూపం 
నిల వర్ణ స్వరూపం 
ఉచ్శ్వాస నిశ్వాస నొసగు స్వరూపం 
ఉరుముల కన్న మేలిమైన స్వరూపం 
విశ్వమైయున్న స్వరూపం 
శత కోటి కాంతి మయమైన  స్వరూపం 
కరుణాత్మజుని స్వరూపం 
కళాత్మకమైన స్వరూపం 
నయనానందకరమైన స్వరూపం 
నాట్య స్వరూపం 
జలధార నొసగు స్వరూపం 
జగత్ కారక మి స్వరూపం 
జగదాంబ నిలయమై ఉన్న స్వరూపం 
పంచభూత మయమైన స్వరూపం 

ని దివ్య స్వరూపం

ఓం నమశ్శివాయ నమః 




శ్రీరామ దూత శిరసా నమామి

శ్రీరామ దూత శిరసా నమామి 
  1. ఓం శ్రీ ఆంజనేయాయ నమః 
  2. ఓం రుద్రంశజ ఆంజనేయాయ  నమః 
  3. ఓం అంజనిసుతాయ నమః 
  4. ఓం కారణజన్మయ నమః 
  5. ఓం జగత్ కల్యాణ కారకాయ నమః 
  6. ఓం గగనగమ్యాయ నమః 
  7. ఓం సూర్య తేజహ ఫలాపేక్షరహిత నమః 
  8. ఓం సద్గురు ఆదిత్య వర్ధనాయ నమః 
  9. ఓం సకల విద్య సంపత్కరాయ నమః 
  10. ఓం అస్త్ర ప్రస్థన్విత సురవర ప్రధాయ నమః 
  11. ఓం మహ శెక్తి చెతన్య మూర్తి భావాయ నమః 
  12. ఓం మారుతి నామధేయాయ నమః
  13. ఓం దివ్య మంగళ స్వరూపాయ నమః 
  14. ఓం దివ్య పురుషాయ నమః 
  15. ఓం నవ్యకృతి భవ్య రూపాయ నమః 
  16. ఓం కేసరి నందనాయ నమః 
  17. ఓం బహు బల పరాక్రమయ నమః 
  18. ఓం వాలగది గదాధరాయ నమః 
  19. ఓం పంచనామ మూర్తిభవాయ నమః 
  20. ఓం హయగ్రీవాయ నమః 
  21. ఓం నారసింహాయ నమః 
  22. ఓం వరాహయ నమః 
  23. ఓం గరుడాయ నమః 
  24. ఓం వానర ముఖేశ్వరాయ నమః 
  25. ఓం భవద్ భవ్యయ నమః 
  26. ఓం వజ్ర దేహయా నమః 
  27. ఓం మహా కాయాయ నమః 
  28. ఓం మహ వీరాయ నమః 
  29. ఓం మహ సురాయ నమః 
  30. ఓం మహ మణిహార సుశోభితాయ నమః 
  31. ఓం మహ సౌర్యాయ నమః 
  32. ఓం మహ శ్రేష్ఠాయ నమః 
  33. ఓం మహ రౌద్రాయ నమః 
  34. ఓం  మహ తపస్వినెన్న నమః 
  35. ఓం మహాత్ కంఠాయ  నమః 
  36. ఓం మహొధర బీమగ్రజాయ నమః 
  37. ఓం గంబీర వదనాయ నమః 
  38. ఓం స్వయం ప్రకాశితాయ నమః 
  39. ఓం తత్వజ్ఞావికాసితాయ నమః 
  40. ఓం వానర కుల అగ్ర గణ్యాయ నమః 
  41. ఓం కౌo డిన్య గోత్రోద్బావ దిపికాయ నమః 
  42. ఓం శ్రీరామానుగ్రహ హనుమత్ నామధేయాయ నమః 
  43. ఓం సీతా  అన్వేషిత రామ సుగ్రీవాది మైత్రేయ నమః 
  44. ఓం శ్రీరామాంగుళీయ కాది అనుగ్రహితాయ నమః 
  45. ఓం సీతా  అన్వేషిత లంకాపురేయ నమః 
  46. ఓం లంకిణి బంజనాయా నమః 
  47. ఓం అశోక వన శోక వనజాక్షి సీత వీక్షిత్రేయ  నమః
  48. ఓం సూక్ష్మ రూపిత రామదూతాంజనేయ నమః 
  49. ఓం ముద్ర ప్రధాయకాయ  నమః 
  50. ఓం రామదూత వానరధమ హస్యబంధనయా నమః 
  51. ఓం దైత్య కార్య విఘంతకాయ  నమః 
  52. ఓం లంకాదహనాయ నమః 
  53. ఓం విబిషణాది  మైత్రేయ నమః 
  54. ఓం చూడామణి అనుగ్రహిత మాత సీతయ నమః 
  55. ఓం కార్య సాధకాయ నమః 
  56. ఓం దృఢ సంకల్పిత చూడామణి ప్రధయకాయ  నమః 
  57. ఓం వారధి బంధనాయ నమః 
  58. ఓం రణరంగ ప్రముఖయ నమః 
  59. ఓం సౌమిత్రి ప్రాణదాతయ నమః 
  60. ఓం సంజీవిని ఆయువర్ధనాయ నమః 
  61. ఓం అసుర రావణాంతక కారణాయ నమః 
  62. ఓం సీత శోకనివారకాయ  నమః 
  63. ఓం యశస్వి చిరంజీవ శ్రీరామ వరణనాయ  నమః 
  64. ఓం సచ్చిదానంద  సదాత్మజ రామ భక్తాయ నమః 
  65. ఓం రామ నామ నిత్య జప ప్రియాయ నమః 
  66. ఓం జ్ఞాన త్రయాయ నమః 
  67. ఓం వేదాంత వేద్యాయ నమః 
  68. ఓం కుమార బ్రహ్మ చారాయ నమః 
  69. ఓం సుచేరితా కపివరాయ నమః 
  70. ఓం పురాణపురుషాయ నమః 
  71. ఓం కరుణ సాగరాయా నమః 
  72. ఓం సర్వ దుఃఖ హరణాయ నమః 
  73. ఓం అబీష్ట వరదాయ నమః 
  74. ఓం అనంతాయ నమః 
  75. ఓం అర్త రక్షిత అక్షయ వరప్రదాయ నమః 
  76. ఓం సర్వ య్యపినేయ  నమః 
  77. ఓం సర్వ జ్ఞానయ నమః 
  78. ఓం మహ ప్ర్రజ్ఞాయ  నమః 
  79. ఓం సింధూర ప్రియాయ నమః 
  80. ఓం సర్వ మంగళకరాయ నమః 
  81. ఓం నాగవల్లి పత్ర పూజితాయ నమః 
  82. ఓం త్రిమూర్త మేత్రి గుణాత్మకయ నమః 
  83. ఓం మహ మంత్ర నిలయాయ నమః 
  84. ఓం మహ మంత్ర నిక్షిప్త నిగుణాయ నమః 
  85. ఓం మహ శెక్తి తాత్మికాయ నమః 
  86. ఓం భూత ప్రేతంతకాయ నమః 
  87. ఓం దుష్టగ్రహ దోష నివారణాయ నమః 
  88. ఓం సర్వ సంకట హరయా నమః 
  89. ఓం భక్తి శెక్తి పరిరక్షితాయా నమః 
  90. ఓం యైమ్యాతి ప్రాణరక్షిత అపన శ్రీతాయ నమః 
  91. ఓం రామవైరి దుక్కి సాగరాయ నమః 
  92. ఓం శ్రీరామ చరణాధితాయ నమః 
  93. ఓం నిష్కాలంకిత  సత్య ధర్మాయ నమః 
  94. ఓం రామాస్త్ర నియంత్రిత రామనామద్యా  ముద్రంకితాయ  నమః
  95. ఓం  విశ్వ ప్రళయాయ నమః
  96. ఓం రామ నామ శబ్దతరంగ త్రిలోక శ్రవణాయ నమః
  97. ఓం సురాసుర మునిజన వందిత శ్రీమన్ నారాయణాయ నమః
  98. ఓం కరివరధా భక్త అభిష్ట వరధాయ నమః
  99. ఓం బ్రహ్మ రుద్రాది సన్నుత ప్రసనాత్మజ శ్రీరామ చంద్రాయ నమః
  100. ఓం బ్రహ్మాస్త్ర నివారిత యైయ్యాతి   ప్రాణభిక్షయ నమః
  101. ఓం సుర సుమవర్షిత వరప్రదాజేనేయ నమః
  102. ఓం భవ పునీత భక్తి రత్నయ నమః
  103. ఓం అచుతాసనాది అమరత్య కీర్తి వర్ధనాయ నమః
  104. ఓం జయ పతాక కీర్తి వర్ధనాయ నమః
  105. ఓం సర్వ సంక్షోభిత శోక నివారణాయ నమః
  106. ఓం తపస్ సంపనిత పండితాయ  నమః
  107. ఓం రామ నామాంబృత గరిమయ నమః
  108. ఓం సర్వోత్తమ యుగే యుగే సర్వోన్నత సన్నుతాయ  నమః 
  విశ్వ రాజ్య పూజిత రామభక్త హనుమ శిరసా నమామి