Tuesday, 29 January 2019'న'  'మ' 'శి' 'వా' 'య' నినామము మధురం 
"న"మక చమక నర్తన నటరాజ 
"మ"0చు కొండలనడుమ మహాదేవా 
"శి"రమున ఎగిసె చల్లని గంగమ్మ 
"వా"యి ప్రధాతవు వాయు లింగ 
"య"గ యుగాల దైవం నివు విశ్వేశ 
ఓం నమశ్శివాయ   

Wednesday, 23 January 2019


శ్రీ రామ భక్త ఆంజనేయ చేరితామృత అష్టోత్తర శత స్తోత్ర రత్నావళి

(ధర్మోరక్షితి రక్షతః )

 1. రుద్రవీర్య సముద్భవాయైనమః 
 2. అంజనీసుత ఆంజనేయాయైనమః
 3. దివ్య తేజో విరాజితాయైనమః
 4. స్వయంప్రకాశితాయైనమః
 5. నవ్యకృతి భవ్యయైనమః
 6. వాలగాదిగదధారయైనమః 
 7. వజ్రదేహయైనమః
 8. మహాకాయాయైనమః
 9. మహ వీరాయైనమః
 10. మహా సూరాయైనమః
 11. వాయు రాకాశగమనాయైనమః 
 12. సూర్యతేజహపలాపేక్షరహితాయైనమః 
 13. కాల స్తంబితాయైనమః
 14. విధాస్త్ర  ప్రయోగిత మూర్చితయైనమః
 15. వాయుదిగ్బంధిత విశ్వ ప్రళయాయైనమః
 16. త్రిమూర్తి శ్రీతఇందాయైనమః
 17. సకల విపత్ నివారిత అభయప్రధయైనమః
 18. స్థితి కంఠంశజఅజేయయైనమః 
 19. జగత్ కల్యాణ కారణాయైనమః
 20. సత్పురుషా భవద్ భవ్యయైనమః
 21. తపస్ సంపన్నిత పండితాయైనమః  
 22. వాయు సుత నామధేయాయైనమః
 23. హరి భక్తాగ్రేశ్వర హనుమత్ నామ బిరుదాంకితాయయైనమః
 24. అస్త్ర శ్యాస్త్ర మణిహారాన్విత వరప్రదత్రిమూర్తయైనమః
 25. సద్గురు ఆదిత్య వర్ధనాయైనమః
 26. మహా బల పరాక్రమశెక్తి చైతన్య రుపాయైనమః
 27. పంచనామ మూర్తి భవాయైనమః
 28. హయగ్రీవా యైనమః
 29. వరాహ యైనమః
 30. నారసింహ యైనమః
 31. గరుడా యైనమః
 32. వానర ముఖేశ్వరాయైనమః
 33. మహా దరబీమాగ్రజాయైనమః
 34. మహాత్ ఠయైనమః
 35. తత్వజ్ఞ్యాన  వికాసితాయైనమః
 36. వానరకుల అగ్రగణ్యాయైనమః
 37. కౌడిన్యస గోత్రోద్భవ దీపికాయైనమః
 38. సుగ్రీవాది సమస్థితః కేసరినందనాయైనమః
 39. సీతా అన్వేషిత శ్రీరామసుగ్రీవాదిమైత్రేయైనమః
 40. హనుమత్ నామ బిరుదాంకిత శ్రీరామచంధ్రాయైనమః
 41. సచ్చిదానంద సదాత్మజ ప్రభో శ్రీరామచంద్రయైనమః
 42. హరి ఆగమనాది వుతుంగ తరంగిత ఆనంద భరితాయైనమః
 43. శ్రీరామనామాభృతమహామంత్ర జపప్రియాయైనమః 
 44. సీతా అన్వేషిత రామకార్య సంస్థతాయైనమః
 45. రామంగుళికాధి  అనుగ్రహిత లంకాయైనమః
 46. లంకిణి బంజనాయైనమః
 47. అశోకవన శోకవనజాక్షి సీతా వీక్షితాయైనమః
 48. సూక్ష రూపిత శ్రీరామ దూతాంజనేయయైనమః
 49. శ్రీరామా గమనాది ముద్ర ప్రదాయకాయైనమః 
 50. చూడామణి అనుగ్రహిత సీతామాతాయైనమః 
 51. అశోక వన విద్వాంస్యయైనమః 
 52. రామదూత వానరాధామా హస్య బంధనాయైనమః
 53. దైత్యకార్య విఘంతక యైనమః
 54. శ్రీరామ నామ శబ్ధతరంగిత భయకంపిత అసురగణయైనమః   
 55. లంకా దహనాయైనమః
 56. విభీషణాదిమైత్రే యైనమః
 57. దృఢసంకల్పిత రామకార్య సాధకాయైనమః 
 58. చూడామణి శ్రీరామ ప్రధాయకాయైనమః 
 59. వారధి బంధనా యైనమః
 60. రణరంగ ప్రముఖా యైనమః
 61. సౌమిత్రి ప్రాణదాతయైనమః
 62. సంజీవిని ఆయువర్ధనాయైనమః
 63. అసుర రావణాంతక కారణాయైనమః
 64. సీతా శోక నివారకా యైనమః
 65. చిరంజీవ యశస్వి శ్రీరామ వరాననా  యైనమః
 66. శ్రీ రామనామ కోటి మహిమాన్విత చరిత యైనమః
 67. పురాణ పురుషా యైనమః
 68. జ్ఞన త్రయా యైనమః
 69. గుణాధీశ్యాయైనమః
 70. వేద వెద్యా యైనమః
 71. సంకటహరణా  యైనమః
 72. సర్వజ్ఞ మహాప్రజ్ఞ యైనమః
 73. సర్వ వ్యాపితాయ యైనమః
 74. సింధూర తిలకాంకితా యైనమః
 75. నాగవల్లి పత్ర పూజిత ప్రియంకరా యైనమః
 76. అబిష్టిత అక్షయ వరప్రదాయకా యైనమః
 77. మహామంత్రాయైనమః
 78. మహా యంత్ర  నిక్షిప్త నిగుణా యైనమః
 79. భూత ప్రేతాతకా యైనమః
 80. రౌద్ర రూపిత రుద్రాయైనమః
 81. దుష్ట గ్రహ దోష నివారణ యైనమః
 82. భవభయ దుఃఖ హరణా యైనమః
 83. ఆశ్రీత వత్సలాయ యైనమః
 84. యయాతి ప్రాణ రక్షిత అపన్నాశ్రీతాయైనమః
 85. రామవైరి దుఖ సాగరా యైనమః
 86. శ్రీరామ చరణార్ధిత యైనమః
 87. నిష్కళకిత సత్యధర్మ యైనమః
 88. యయాతి శిరక్షేధిత రామాస్త్రప్రయోగిత  సంసిద్ధతా యైనమః
 89. రామనామాస్త్ర సంసిద్ధత కరమోడ్చిశ్రీఆంజనేయాయైనమః
 90. రామాంజనేయ యుద్ధ సంసిద్దతా యైనమః
 91. విశ్వ ప్రళయ విజృంభణ యైనమః
 92. రామస్త్ర నియంత్రిత రామనామ ధ్యానముద్రాకితా యైనమః
 93. రామనామ శబ్ధతరంగిత త్రిలోక శ్రవణ యైనమః
 94. సురాసుర మునిగణ వందిత శ్రీమన్నారాయణా యైనమః
 95. కరివరదా భక్తవత్సలా యైనమః
 96. భక్తి శెక్తి పరిరక్షితా యైనమః
 97. బ్రహ్మ రుద్రాది సన్నుతా యైనమః
 98. ప్రసనాత్మజ శ్రీరామ చంద్రా యైనమః
 99. యయాతి ప్రాణ బిక్ష యైనమః
 100. సుమవర్షిత సుర అభయ ప్రధాంజనేయ యైనమః
 101. భవ పునిత భక్తిరత్నా యైనమః
 102. అనంత అచ్చుతాసనా యైనమః
 103. విజయ పతాక కీర్తి వర్ధనా యైనమః
 104. దుష్కర్మ నివారిత హనుమత్ నామోచ్చారణా యైనమః
 105. శుభ సౌభాగ్య ఫలప్రదాయకా యైనమః
 106. సర్వదా ప్రణమోర్చి అర్త రక్షణా యైనమః
 107. సర్వోత్తమ యుగే యుగే  సర్వన్నత సన్నుతాయైనమః
108.యుగాంత రారాజ్యా పూజిత శ్రీరామ భక్త ఆంజనేయా యైనమః  

అచ్చు తప్పులు ఏమైనా ఉన్నచో  మనిచమని ప్రార్ధన 
జై శ్రీ రామ్ 
జై శ్రీ రామ్ 
జై శ్రీ రామ్ 

Friday, 28 July 2017

మహిమాన్విత శివ లింగాలు


మహిమాన్విత శివ లింగాలు

ఓం లింగాయ నమః 
ఓం శివ లింగాయ నమః 
ఓం శీలా లింగాయ నమః 
ఓం శివ కామేశ్వర లింగాయ నమః 
ఓం గంగేశ్వర లింగాయ నమః 
ఓం గణపతేశ్వర లింగాయ నమః 
ఓం శరవణ లింగాయ నమః 
ఓం శరభ లింగాయ నమః 
ఓం శంబు లింగాయ నమః 
ఓం శూలేశ్వర లింగాయ నమః 
ఓం శోనేశ్వర లింగాయ నమః 
ఓం శృంగేశ్వర లింగాయ నమః 
ఓం సోమేశ్వర లింగాయ నమః 
ఓం సోమనాథేశ్వర లింగాయ నమః 
ఓం సాలగ్రామేశ్వర లింగాయ నమః 
ఓం సైకత లింగాయ నమః 
ఓం స్పటిక లింగాయ నమః 
ఓం సత్య దేవీశ్వర లింగాయ నమః 
ఓం సంగమేశ్వర లింగాయ నమః 
ఓం సువర్ణ లింగాయ నమః 
ఓం సుందరేశ్వర లింగాయ నమః 
ఓం సిద్దేశ్వర లింగాయ నమః 
ఓం పంచముఖ లింగాయ నమః 
ఓం పృద్వి లింగాయ నమః 
ఓం పంచభూతేశ్వర లింగాయ నమః 
ఓం పగడ లింగాయ నమః 
ఓం ప్రణవ లింగాయ నమః 
ఓం పశుపతి లింగాయ నమః 
ఓం పీత మణిమయ లింగాయ నమః 
ఓం పరబ్రహ్మేంద్ర లింగాయ నమః 
ఓం ప్రమోగేశ్వర లింగాయ నమః 
ఓం పద్మరాగ లింగాయ నమః 
ఓం పాండుకేశ్వర లింగాయ నమః 
ఓం పార్ధమేశ్వర లింగాయ నమః 
ఓం పాతాళేశ్వర లింగాయ నమః 
ఓం పరసువేదిశ్వర లింగాయ నమః 
ఓం గురు లింగాయ నమః 
ఓం గోమేధిక లింగాయ నమః 
ఓం గోకర్ణేశ్వర లింగాయ నమః 
ఓం గృష్వేశ్వర లింగాయ నమః 
ఓం వృద్ధ లింగాయ నమః 
ఓం వృష్వేశ్వర లింగాయ నమః 
ఓం విశ్వతోముఖ లింగాయ నమః 
ఓం విరుపాకేశ్వర లింగాయ నమః 
ఓం విఠలాక్షేశ్వర లింగాయ నమః 
ఓం వీరభద్రేశ్వర లింగాయ నమః 
ఓం విజయేశ్వర లింగాయ నమః 
ఓం విచ్చుకంటేశ్వర లింగాయ నమః 
ఓం వజ్రేశ్వర లింగాయ నమః 
ఓం వైడుర్య లింగాయ నమః 
ఓం వైదీశ్వర లింగాయ నమః 
ఓం వైద్య నాదేశ్వర లింగాయ నమః 
ఓం వాయు లింగాయ నమః 
ఓం ఏకాంబరేశ్వర లింగాయ నమః 
ఓం ఇష్ట కాంతీశ్వర లింగాయ నమః 
ఓం ఈశాన్య లింగాయ నమః 
ఓం అంబికేశ్వర లింగాయ నమః 
ఓం అనంత లింగాయ నమః 
ఓం ఆత్మ లింగాయ నమః 
ఓం అక్షయ లింగాయ నమః 
ఓం అమరేశ్వర లింగాయ నమః 
ఓం అమరనాదేశ్వర లింగాయ నమః 
ఓం అగస్తేశ్వర లింగాయ నమః 
ఓం అచలేశ్వర లింగాయ నమః 
ఓం అరుణాచలేశ్వర లింగాయ నమః 
ఓం అర్ధనారీశ్వర లింగాయ నమః 
ఓం అంబరేశ్వర లింగాయ నమః 
ఓం అఖిల లింగాయ నమః 
ఓం అనన్య లింగాయ నమః 
ఓం అగోరార్చిత లింగాయ నమః 
ఓం ఆంభృతేశ్వర లింగాయ నమః 
ఓం అభయ లింగాయ నమః 
ఓం ఆనందేశ్వర లింగాయ నమః 
ఓం మహ రుద్ర లింగాయ నమః 
ఓం మహానందీశ్వర లింగాయ నమః 
ఓం మల్లికార్జున లింగాయ నమః 
ఓం మల్లీశ్వర లింగాయ నమః 
ఓం ముల మల్లీశ్వర లింగాయ నమః 
ఓం మంజునాథేశ్వర లింగాయ నమః 
ఓం మరకత లింగాయ నమః 
ఓం మండవేశ్వర లింగాయ నమః 
ఓం మాడినేశ్వర లింగాయ నమః 
ఓం మాన్యేశ్వర లింగాయ నమః 
ఓం మార్కండేయ లింగాయ నమః 
ఓం ముత్య లింగాయ నమః 
ఓం మణి కందరేశ్వర లింగాయ నమః 
ఓం ముక్తేశ్వర లింగాయ నమః 
ఓం మృతుంజేయ లింగాయ నమః 
ఓం మహ కాళేశ్వర లింగాయ నమః 
ఓం కేదారేశ్వర లింగాయ నమః 
ఓం కుంభేశ్వర లింగాయ నమః 
ఓం కుమారరామ లింగాయ నమః 
ఓం క్షిరరామ బిమేశ్వర లింగాయ నమః 
ఓం కుక్కుటేశ్వర లింగాయ నమః 
ఓం కపిలేశ్వర లింగాయ నమః 
ఓం కపిల మలేశ్వర లింగాయ నమః 
ఓం కాడు మలేశ్వర లింగాయ నమః 
ఓం కోణీశ్వర లింగాయ నమః 
ఓం కోటేశ్వర లింగాయ నమః 
ఓం కుబేర లింగాయ నమః 
ఓం కపర్డేశ్వర లింగాయ నమః 
ఓం కాంచీపురేశ్వర లింగాయ నమః 
ఓం కృపేశ్వర లింగాయ నమః 
ఓం కపాలేశ్వర లింగాయ నమః 
ఓం కాలాత్మక లింగాయ నమః 
ఓం కైలాసనాదేశ్వర లింగాయ నమః 
ఓం కళాత్మక లింగాయ నమః  
 
 


Tuesday, 6 June 2017

కమణియం శ్రీ కామాక్షి తాయి రూపం

కమణియం శ్రీ కామాక్షి తాయి రూపం 
జీవన గమన మునకు ఆధారం నివు 
జీవుల శ్రేయసు కోరు జగదాంబవు నివు 
జగత్ గురువు స్థాపించిన జగన్మాతవు నివు 
జొన్నవాడలో వెలసిన శ్రీ కామాక్షి తాయివి నివు 

Monday, 22 May 2017

శివలింగస్వరూపం

శివలింగస్వరూపం 
జలధారలతో మిల మిల మెరిసే ని లింగం 
కర్పూర హారతితో తళుకు మనిపించు ని లింగం 
విబూది ధారణతో నిగ నిగ లాడు ని లింగం 
బిల్వ పత్రముతో వరాలనొసగు ని లింగం 
కుంకుమ ధారణతో కళ కళ లాడు ని లింగం 
నాగాభరణముతో నయనానందకరంగా ని లింగం 
పూల అలంకారంతో పరిమళించు ని లింగం
యంత చుసిన తనివితీరని ఆ లింగం  
పానవట్టము పై ప్రకాశించు ఆ పరమ పురుషుని స్వరూపమే ఆ శివ లింగం 
ఓం నమః శివాయ నమః 

యంత మధురం ని దివ్య నామం

 యంత మధురం ని దివ్య నామం 
ఎనెన్ని  నామాలు యంత మధురం నినామాలు 
కవులు పొగిడేడి నామాలు కనువిందు చేయు నామాలు 
కాళహస్త్రిలో నినామం కాశీలో నినామం 
కమనీయ నామం కరుణజూపెడి నామం 
దేవగణములు  ఆరాధ్య నామం సకల దేవతలు ధ్యానించు నామం 
అధి గురువు ఆరాధించిన నామం సర్వేశ్వరుని సర్వ మంగళ నామం 
అంతట నిలయమై ఉన్న నామం అందరి ఆరాధ్య నామం 
ఓం నమః శివాయ అను ని నామం 

Sunday, 21 May 2017

శ్రీ రామ దూతం శిరసా నమామి

శ్రీ రామ దూతం శిరసా నమామి 
అణువణువునా అద్వైతం 
ఆకు పూజ నీకు ప్రియం 
అరచేత సంజీవిని పర్వతం 
యుగయుగాల దైవం 
అందరి ఆరాధ్య దైవం 
ని దర్శనం తో సకల శుభం 


నిత్య చిరంజీవి

నిత్య చిరంజీవి 
నిత్య చిరంజీవి వి  శ్రీ రామ పాద దాస 
నవయవన మూర్తివి శ్రీ రామ పాద దాస 
సర్వ శుభకరుడవు శ్రీ రామ పాద దాస 
సకల వేద నిధివి శ్రీ రామ పాద దాస 
సచ్చిదానంద రూపుడవు శ్రీ రామ పాద దాస 
సీతామాత సేవిత శ్రీ రామ పాద దాస 
లక్ష్మణ ప్రాణదాత శ్రీ రామ పాద దాస 
లంకాదహన కారక శ్రీ రామ పాద దాస 
అనుక్షణము శ్రీ రామ నామం జపించు శ్రీ రామ పాద దాస 
వందనాలు నీకు శత కోటి వందనాలు శ్రీ రామ పాద దాస 

Saturday, 20 May 2017

పరమ శివుని పుత్రుడా పళని దేవుడా


పరమ శివుని పుత్రుడా పళని దేవుడా 
ముజగములేలు దైవం
అందరి ఆరాధ్య దైవం
ఆరు ముఖముల దైవం
ఋగ్మతులను తొలగించు దైవం
పళని కొండపై ప్రకాశించు దైవం
పాల కావిడి ఎంతో ప్రియమైన దైవం
గండాలను గజ గజ లాడించు దైవం
నెమలి వాహన రూపుడైన దైవం
ఓం శ్రీ వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి అందరికి   దైవం 

Tuesday, 4 April 2017

అంత యింత కాదు అద్భుతమైనది శ్రీ రామ నామంఅంత ఇంత కాదు అద్భుతమైనది శ్రీ రామ నామం 
 హనుమంతుడు అనుక్షణము స్మరియించు శ్రీ రామ నామం
రావణ బ్రహ్మను రణరంగమున ఎదిరించిన నామం  శ్రీ రామ నామం
భద్ర గిరి పై వెలసిన బలే మంచి నామం శ్రీ రామ నామం
శబరి ఎంగిలి పండ్లు తినిన ఆ సర్వేశ్వరుని నామము శ్రీ రామ నామం
ఒకే మాట ,ఒకే భార్య ,ఒకే బాణం అన్న మహనీయుని నామం శ్రీ రామ నామం
సూర్య వంశ తేజోరూపుడైన వాని నామం శ్రీ రామ నామం
మహిమాన్విత నామం శ్రీ రామ నామం

Sunday, 2 April 2017

సదాశివ ని మహిమ


సదాశివుని మహిమ 
 నీ సిగనుండి గంగమ్మను ఈ భువికి నొసగిన నీ  మహిమ 
హర హర అన్న వానికి అభయమిచ్చు నీ మహిమ 
హలాహలమును గరళములో దాచి జగత్తును కాచిన నీ మహిమ 
మార్కండేయునికి ముక్తి నొసగిన నీ మహిమ 
గణనాయకునికి గజముఖమును ధరింపజేసిన నీ మహిమ 
ఎందరో ముని జనులకు ముక్తి నొసగిన నీ మహిమ 
జగదాంబను నీలొ సగభాగము ఇచ్చి అర్ధనారీశ్వరునిగా చూపిన నీ మహిమ 
అఖిల లోకములను పాలించు నీ దివ్య మహిమ 
సకల భూత గణములు సేవించెడి నీ మహిమ 
ఎంత పొగిడిన చాలదు నీ దివ్య మహిమ  
ఓం నమః శివాయ అను నామమే ఎంతో మహిమ 

Saturday, 1 April 2017

త్రిసంధ్య గాయత్రి ఆవాహన మంత్రం


త్రిసంధ్య గాయత్రి ఆవాహన మంత్రం 
అయతు ,వరదాదేవి !
అక్షరమ్ బ్రహ్మ సమ్మితమ్ !
గాయత్రిం చంధసాం !
మతే !ఇదం బ్రహ్మ జుషస్వ మే !
యత్ అహ్నాత్ కురుతే పాపం ,
తత్ అహ్నాత్ ప్రతిముచ్యతే !
యత్ రాత్రియత్ కురుతే పాపం ,
తత్ రాత్రియత్ ప్రతిముచ్యతే !
సర్వవర్ణే !మహదేవి ! సంధ్యా విధ్యే !సరస్వతి !
భావము :- ఓం అను అక్షరం పరబ్రహ్మ స్వరూపిణివగు శ్రీ గాయత్రి దేవి !సర్వ సిద్ధి ప్రదాత అయినదానవు . నీకు 
సుస్వాగతము, నిచ్చిత జ్ఞానము ప్రసాదించు దానవు నిను చెంబోబాధమగు గాయత్రి మంత్రము ద్వారా ఉపాసించుతున్నాము సద్గురువువై బ్రహ్మ తత్వము యొక్క సువిదితము కొరకు నిన్ను అనుష్ఠిచుతున్నాము నివు తలివి ,తలికి తప్పే కనిపించదు బ్రహ్మ తత్వము యెరుగుటకు నాయొక్క దోషములు అడ్డు వస్తు ఉండవచ్చుగాక , అయితే జనని వగు నిన్ను ఆశ్రయించి ఉపాసించడము ఒక ఔషధము ఏ రాత్రి పగలు దోషములు రాత్రియే ని అనుష్ఠానముచే తొలగిపోవునుగాక , అమ్మ !నిన్ను నేను ఉపాసిస్తు ఉన్నపుడు సర్వదేవత వర్ణనలు అంతర్లీనమై ఉన్నాయి 

మహిమలున్న దేవుడు

మహిమలున్న దేవుడు 
త్రినామాల స్వరూపము 
త్రినేత్ర రూపము 
త్రిలోక పూజ్యము 
త్రికాల సంచారము 
త్రిశక్తి స్వరూపము 
త్రియంబక నివాసము 
త్రిమూర్తి స్వరూపము 
త్రిగుణాత్మక రూపము 
త్రిశూలము నికు ఆయుధము 
త్రిబిళ్వ పూజితము 
త్రిలోకములకు దైవము 
ఆ మహిమానితునికి మనసా వాచా కర్మణః శిరస్సు  వంచి పాదాభి వందనాలు  

ఆ ముకంటి వాని స్వరుపం

ఆ ముకంటి వాని స్వరూపం 
అద్వైత స్వరూపం 
అధి నాయకుని స్వరూపం 
అద్భుత స్వరూపం 
అనిర్వచమైన స్వరూపం 
అఖిలాండ బ్రహ్మాండ స్వరూపం 
నిత్య పుజా స్వరూపం 
నిల వర్ణ స్వరూపం 
ఉచ్శ్వాస నిశ్వాస నొసగు స్వరూపం 
ఉరుముల కన్న మేలిమైన స్వరూపం 
విశ్వమైయున్న స్వరూపం 
శత కోటి కాంతి మయమైన  స్వరూపం 
కరుణాత్మజుని స్వరూపం 
కళాత్మకమైన స్వరూపం 
నయనానందకరమైన స్వరూపం 
నాట్య స్వరూపం 
జలధార నొసగు స్వరూపం 
జగత్ కారక మి స్వరూపం 
జగదాంబ నిలయమై ఉన్న స్వరూపం 
పంచభూత మయమైన స్వరూపం 

ని దివ్య స్వరూపం

ఓం నమశ్శివాయ నమః 
శ్రీరామ దూత శిరసా నమామి

శ్రీరామ దూత శిరసా నమామి 
 1. ఓం శ్రీ ఆంజనేయాయ నమః 
 2. ఓం రుద్రంశజ ఆంజనేయాయ  నమః 
 3. ఓం అంజనిసుతాయ నమః 
 4. ఓం కారణజన్మయ నమః 
 5. ఓం జగత్ కల్యాణ కారకాయ నమః 
 6. ఓం గగనగమ్యాయ నమః 
 7. ఓం సూర్య తేజహ ఫలాపేక్షరహిత నమః 
 8. ఓం సద్గురు ఆదిత్య వర్ధనాయ నమః 
 9. ఓం సకల విద్య సంపత్కరాయ నమః 
 10. ఓం అస్త్ర ప్రస్థన్విత సురవర ప్రధాయ నమః 
 11. ఓం మహ శెక్తి చెతన్య మూర్తి భావాయ నమః 
 12. ఓం మారుతి నామధేయాయ నమః
 13. ఓం దివ్య మంగళ స్వరూపాయ నమః 
 14. ఓం దివ్య పురుషాయ నమః 
 15. ఓం నవ్యకృతి భవ్య రూపాయ నమః 
 16. ఓం కేసరి నందనాయ నమః 
 17. ఓం బహు బల పరాక్రమయ నమః 
 18. ఓం వాలగది గదాధరాయ నమః 
 19. ఓం పంచనామ మూర్తిభవాయ నమః 
 20. ఓం హయగ్రీవాయ నమః 
 21. ఓం నారసింహాయ నమః 
 22. ఓం వరాహయ నమః 
 23. ఓం గరుడాయ నమః 
 24. ఓం వానర ముఖేశ్వరాయ నమః 
 25. ఓం భవద్ భవ్యయ నమః 
 26. ఓం వజ్ర దేహయా నమః 
 27. ఓం మహా కాయాయ నమః 
 28. ఓం మహ వీరాయ నమః 
 29. ఓం మహ సురాయ నమః 
 30. ఓం మహ మణిహార సుశోభితాయ నమః 
 31. ఓం మహ సౌర్యాయ నమః 
 32. ఓం మహ శ్రేష్ఠాయ నమః 
 33. ఓం మహ రౌద్రాయ నమః 
 34. ఓం  మహ తపస్వినెన్న నమః 
 35. ఓం మహాత్ కంఠాయ  నమః 
 36. ఓం మహొధర బీమగ్రజాయ నమః 
 37. ఓం గంబీర వదనాయ నమః 
 38. ఓం స్వయం ప్రకాశితాయ నమః 
 39. ఓం తత్వజ్ఞావికాసితాయ నమః 
 40. ఓం వానర కుల అగ్ర గణ్యాయ నమః 
 41. ఓం కౌo డిన్య గోత్రోద్బావ దిపికాయ నమః 
 42. ఓం శ్రీరామానుగ్రహ హనుమత్ నామధేయాయ నమః 
 43. ఓం సీతా  అన్వేషిత రామ సుగ్రీవాది మైత్రేయ నమః 
 44. ఓం శ్రీరామాంగుళీయ కాది అనుగ్రహితాయ నమః 
 45. ఓం సీతా  అన్వేషిత లంకాపురేయ నమః 
 46. ఓం లంకిణి బంజనాయా నమః 
 47. ఓం అశోక వన శోక వనజాక్షి సీత వీక్షిత్రేయ  నమః
 48. ఓం సూక్ష్మ రూపిత రామదూతాంజనేయ నమః 
 49. ఓం ముద్ర ప్రధాయకాయ  నమః 
 50. ఓం రామదూత వానరధమ హస్యబంధనయా నమః 
 51. ఓం దైత్య కార్య విఘంతకాయ  నమః 
 52. ఓం లంకాదహనాయ నమః 
 53. ఓం విబిషణాది  మైత్రేయ నమః 
 54. ఓం చూడామణి అనుగ్రహిత మాత సీతయ నమః 
 55. ఓం కార్య సాధకాయ నమః 
 56. ఓం దృఢ సంకల్పిత చూడామణి ప్రధయకాయ  నమః 
 57. ఓం వారధి బంధనాయ నమః 
 58. ఓం రణరంగ ప్రముఖయ నమః 
 59. ఓం సౌమిత్రి ప్రాణదాతయ నమః 
 60. ఓం సంజీవిని ఆయువర్ధనాయ నమః 
 61. ఓం అసుర రావణాంతక కారణాయ నమః 
 62. ఓం సీత శోకనివారకాయ  నమః 
 63. ఓం యశస్వి చిరంజీవ శ్రీరామ వరణనాయ  నమః 
 64. ఓం సచ్చిదానంద  సదాత్మజ రామ భక్తాయ నమః 
 65. ఓం రామ నామ నిత్య జప ప్రియాయ నమః 
 66. ఓం జ్ఞాన త్రయాయ నమః 
 67. ఓం వేదాంత వేద్యాయ నమః 
 68. ఓం కుమార బ్రహ్మ చారాయ నమః 
 69. ఓం సుచేరితా కపివరాయ నమః 
 70. ఓం పురాణపురుషాయ నమః 
 71. ఓం కరుణ సాగరాయా నమః 
 72. ఓం సర్వ దుఃఖ హరణాయ నమః 
 73. ఓం అబీష్ట వరదాయ నమః 
 74. ఓం అనంతాయ నమః 
 75. ఓం అర్త రక్షిత అక్షయ వరప్రదాయ నమః 
 76. ఓం సర్వ య్యపినేయ  నమః 
 77. ఓం సర్వ జ్ఞానయ నమః 
 78. ఓం మహ ప్ర్రజ్ఞాయ  నమః 
 79. ఓం సింధూర ప్రియాయ నమః 
 80. ఓం సర్వ మంగళకరాయ నమః 
 81. ఓం నాగవల్లి పత్ర పూజితాయ నమః 
 82. ఓం త్రిమూర్త మేత్రి గుణాత్మకయ నమః 
 83. ఓం మహ మంత్ర నిలయాయ నమః 
 84. ఓం మహ మంత్ర నిక్షిప్త నిగుణాయ నమః 
 85. ఓం మహ శెక్తి తాత్మికాయ నమః 
 86. ఓం భూత ప్రేతంతకాయ నమః 
 87. ఓం దుష్టగ్రహ దోష నివారణాయ నమః 
 88. ఓం సర్వ సంకట హరయా నమః 
 89. ఓం భక్తి శెక్తి పరిరక్షితాయా నమః 
 90. ఓం యైమ్యాతి ప్రాణరక్షిత అపన శ్రీతాయ నమః 
 91. ఓం రామవైరి దుక్కి సాగరాయ నమః 
 92. ఓం శ్రీరామ చరణాధితాయ నమః 
 93. ఓం నిష్కాలంకిత  సత్య ధర్మాయ నమః 
 94. ఓం రామాస్త్ర నియంత్రిత రామనామద్యా  ముద్రంకితాయ  నమః
 95. ఓం  విశ్వ ప్రళయాయ నమః
 96. ఓం రామ నామ శబ్దతరంగ త్రిలోక శ్రవణాయ నమః
 97. ఓం సురాసుర మునిజన వందిత శ్రీమన్ నారాయణాయ నమః
 98. ఓం కరివరధా భక్త అభిష్ట వరధాయ నమః
 99. ఓం బ్రహ్మ రుద్రాది సన్నుత ప్రసనాత్మజ శ్రీరామ చంద్రాయ నమః
 100. ఓం బ్రహ్మాస్త్ర నివారిత యైయ్యాతి   ప్రాణభిక్షయ నమః
 101. ఓం సుర సుమవర్షిత వరప్రదాజేనేయ నమః
 102. ఓం భవ పునీత భక్తి రత్నయ నమః
 103. ఓం అచుతాసనాది అమరత్య కీర్తి వర్ధనాయ నమః
 104. ఓం జయ పతాక కీర్తి వర్ధనాయ నమః
 105. ఓం సర్వ సంక్షోభిత శోక నివారణాయ నమః
 106. ఓం తపస్ సంపనిత పండితాయ  నమః
 107. ఓం రామ నామాంబృత గరిమయ నమః
 108. ఓం సర్వోత్తమ యుగే యుగే సర్వోన్నత సన్నుతాయ  నమః 
  విశ్వ రాజ్య పూజిత రామభక్త హనుమ శిరసా నమామి 

Friday, 31 March 2017

వ్యాసమహర్షి తపస్సు

వ్యాసమహర్షి  తపస్సు 
ఆ మహాపురుషుడు, మహా తపస్ సంపన్నుడు, వీరి తపస్సు విధానం చాలా  కఠినంగా చేశారు.  ఆ మహాపురుషుడు అలా క్రమక్రమముగా తపస్సు లో తన మనస్సును ఏకం చేసి బయట అనేక విషయాల పై తిరిగే మనస్సును ఏకాగ్రం చేసి మనస్సును తన మంత్రము పై నిమగ్నము చేసాడు.  ఆహారము మరియు నీరు మానేసాడు, ఉచ్వాస నిశ్వాసలు క్రమంగా బంధించాడు.  దానివల్ల మనసును వశం చేసుకున్నాడు.  ప్రాణము కుడా అన్ని అవయవాలలోంచి వచ్చి హృదయములో బంధించాడు.  ఆలా మనస్సు , బుద్ధి , ఇంద్రియాలు అన్ని ఏకమై మనసులోకి ప్రవేశించాయి అనేక బయట విషయాల పై ఆలోచించే మనసు , మనసులోనే బంధించి మనసుతో ,మనసులోనే ధ్యానించసాగాడు.  క్రమేపి ప్రాణము మనసు ఏకమై అంధకారంలో ఉన్న మనసు విస్తరించి విశ్వాత్మకంగ మారి బయటకు విడుదల అయినది.   శరీరము పరిధిని దాటి మనసు క్రమంగా పంచభూతాలను అతిక్రమించి ఈ భూగోళము పై వ్యాపించింది.  ఆ తరువాత గ్రహ నక్షత్ర మండలాలను దాటి ఈ యావద్ విశ్వము తానై వ్యాపించింది.  క్రమక్రమముగా నేనే ఈ శరీరము ,నేనే ఈ మనసు  అనే భావము పోయి నేనే ఈ ఆకాశము  అనే భావము కలుగ సాగింది.  ఆ మహాపురుషుడు తపస్సు  ఎంత కఠినముగా చేసి విశ్వమే తానైనాడు.  సృష్టి రహస్యాన్ని ఛేదించాడు. 

Monday, 27 March 2017

జర్మజర్మలఫలము

జన్మ జన్మల ఫలము 
ఒక కాళికాదేవి భక్తుడు అమ్మ వారిని ప్రసన్నము చేసుకోడానికి ఒక గురువు దగ్గర తంత్ర విద్యలో మంత్రోపదేశం తీసుకొని దానిని  ఏవిధంగా చేయాలి, ఆ పూజకు కావలిసిన సామాగ్రిని తెలుసుకొని, ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకొని, ఆ పూజ కు కావలసిన సామాగ్రి కోసము తిరుగుతూ ఉన్నాడు.  కొంత కాలము గడిచింది, కాని అతనికి ఆ పూజ కు సంబంధించిన సామాగ్రి దొరకలేదు.  గురువు చెప్పిన సమయములో అది ఒక శవము మిద కుర్చొని  స్మశానంలో చేయాలి.  కాని ఆ భక్తునికి ఆ పూజకు కావలసిన సామాగ్రి దొరకలేదు.  గురువు చెప్పిన సమయము వచ్చినది, అతను బాధతో ఆరోజు స్మశానానికి ఆ పూజ గడియలలో వెళ్ళాడు.  అక్కడ అనుకోకుండా గురువు గారు చెప్పిన పూజకు సంబంధించిన సామాగ్రి మరియు ఒక శవము చూసి ఆనందముతో వెళ్లి కాళికా దేవి ని ప్రసన్నము చేసుకున్నాడు.  అమ్మ ప్రసన్నురాలై ఆ భక్తుడికి దర్శనము ఇచ్చి వెళ్లి పోయే సమయానికి ఆ భక్తుడికి సందేహము వచ్చి, "అమ్మ నాకు గురువుగారు చెపిన పూజ సామాగ్రి దొరకలేదు కాని పూజ చేసే సమయానికి నాకు అవే కన బడాయి ఎలాగమ్మా" అని అడిగాడు నాయనా దూరముగా ఒక శవము ఉంది చూడు అతడే ఇవ్వన్నీ  ఇక్కడ సమకూర్చుకున్నాడు, కాని ఈ జన్మలో అతని కర్మలు ఇంకా ఉండడముచేత అతను చనిపోయాడు.  నువ్వు ఎన్నోజన్మల నుండి నా పూజకోసము ఒకొక్క సామాగ్రిని సమకూర్చుకొని చనిపోయావు ఈ జన్మలో నీ  కర్మములు పోవడంవల్ల నీకు నన్ను  దర్శించే అవకాశము వచ్చినది నాయన
 ఏజన్మకు ఏది ప్రాప్తమో అది మన కర్మలను బట్టి ప్రాప్తమౌతుంది 

Saturday, 25 March 2017

మహిమాన్విత లింగాలు

మహిమాన్విత లింగాలు 

 1. ఓం లింగాయ నమః 
 1. ఓం శివ లింగాయనమః 
 1. ఓం శంబు లింగాయనమః 
 1. ఓం ఆధిగణార్చిత లింగాయనమః 
 1. ఓం అక్షయ లింగాయనమః
 1. ఓం అనంత లింగాయనమః
 1. ఓం ఆత్మ లింగాయనమః
 1. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
 1. ఓం అమర లింగాయనమః
 1. ఓం అగస్థేశ్వర లింగాయనమః
 1. ఓం అచలేశ్వర లింగాయనమః
 1. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
 1. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
 1. ఓం అపూర్వ లింగాయనమః
 1. ఓం అగ్ని లింగాయనమః
 1. ఓం వాయు లింగాయనమః
 1. ఓం జల లింగాయనమః
 1. ఓం గగన లింగాయనమః
 1. ఓం పృథ్వి లింగాయనమః
 1. ఓం పంచభూతేశ్వర లింగాయనమః
 1. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
 1. ఓం ప్రణవ లింగాయనమః
 1. ఓం పగడ లింగాయనమః
 1. ఓం పశుపతి లింగాయనమః
 1. ఓం పీత మణి మయ లింగాయనమః
 1. ఓం పద్మ రాగ లింగాయనమః
 1. ఓం పరమాత్మక లింగాయనమః
 1. ఓం సంగమేశ్వర లింగాయనమః
 1. ఓం స్పటిక లింగాయనమః
 1. ఓం సప్త ముఖేశ్వర  లింగాయనమః
 1. ఓం సువర్ణ లింగాయనమః
 1. ఓం సుందరేశ్వర లింగాయనమః
 1. ఓం శృంగేశ్వర లింగాయనమః
 1. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
 1. ఓం సిధేశ్వర  లింగాయనమః
 1. ఓం కపిలేశ్వర లింగాయనమః
 1. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
 1. ఓం కేదారేశ్వర లింగాయనమః
 1. ఓం కళాత్మక లింగాయనమః
 1. ఓం కుంభేశ్వర లింగాయనమః
 1. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
 1. ఓం కోటేశ్వర లింగాయనమః
 1. ఓం వజ్ర లింగాయనమః
 1. ఓం వైడుర్య లింగాయనమః
 1. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
 1. ఓం వేద లింగాయనమః
 1. ఓం యోగ లింగాయనమః
 1. ఓం వృద్ధ లింగాయనమః
 1. ఓం హిరణ్య లింగాయనమః
 1. ఓం హనుమతీశ్వర లింగాయనమః
 1. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
 1. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
 1. ఓం భాను లింగాయనమః
 1. ఓం భవ్య లింగాయనమః
 1. ఓం భార్గవ లింగాయనమః
 1. ఓం భస్మ లింగాయనమః
 1. ఓం భిందు లింగాయనమః
 1. ఓం బిమేశ్వర లింగాయనమః
 1. ఓం భీమ శంకర లింగాయనమః
 1. ఓం బృహీశ్వర లింగాయనమః
 1. ఓం క్షిరారామ లింగాయనమః
 1. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
 1. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
 1. ఓం మహా రుద్ర లింగాయనమః
 1. ఓం మల్లికార్జున లింగాయనమః
 1. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
 1. ఓం మల్లీశ్వర లింగాయనమః
 1. ఓం మంజునాథ లింగాయనమః
 1. ఓం మరకత లింగాయనమః
 1. ఓం మహేశ్వర లింగాయనమః
 1. ఓం మహా దేవ లింగాయనమః
 1. ఓం మణికంధరేశ్వర  లింగాయనమః
 1. ఓం మార్కండేయ లింగాయనమః
 1. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
 1. ఓం ముక్తేశ్వర లింగాయనమః
 1. ఓం మృతింజేయ లింగాయనమః
 1. ఓం రామేశ్వర లింగాయనమః
 1. ఓం రామనాథేశ్వర లింగాయనమః
 1. ఓం రస లింగాయనమః
 1. ఓం రత్నలింగాయనమః
 1. ఓం రజిత లింగాయనమః 
 1. ఓం రాతి లింగాయనమః
 1. ఓం గోకర్ణాఈశ్వర  లింగాయనమః
 1.  ఓం  గోమేధిక లింగాయనమః
 1. ఓం నాగేశ్వర లింగాయనమః
 1. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
 1. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
 1. ఓం శరవణ  లింగాయనమః
 1. భృగువేశ్వర లింగాయనమః
 1. ఓం నీలకంటేశ్వర లింగాయనమః
 1. ఓం చౌడేశ్వర లింగాయనమః
 1. ఓం ధర్మ లింగాయనమః
 1. ఓం జోతిర్ లింగాయనమః
 1. ఓం సైకత లింగాయనమః
 1. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
 1. ఓం జ్వాలా లింగాయనమః
 1. ఓం ధ్యాన లింగాయనమః
 1. ఓం పుష్యా రాగ లింగాయనమః
 1. ఓం నంది కేశ్వర లింగాయనమః
 1. ఓం అభయ లింగాయనమః
 1. ఓం సహస్ర లింగాయనమః
 1. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
 1. ఓం సాలగ్రామ లింగాయనమః
 1. ఓం శరభ లింగాయనమః
 1. ఓం విశ్వేశ్వర లింగాయనమః
 1. ఓం పథక నాశన లింగాయనమః
 1. ఓం మోక్ష లింగాయనమః
 1. ఓం విశ్వరాధ్య లింగాయనమః 

Thursday, 23 March 2017

శివపురాణం మహిమ


శివ పురాణం మహిమ 
పూర్వ కాలములో దేవ రాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.  కులము బ్రాహ్మణకులమే ఐన ఆచార వేవహారాలలో ఏ ఒకటి పాటించే వాడు కాదు . డబ్బు సంపాదనే అతని మార్గము.  ఎన్నో రకాల మోసాలుచేస్తు చాలా  డబ్బు సంపాదించాడు.   ఇలా కొంత కాలముతరువాత ఒక నాడు నది తీరానికి స్ననము చేయడానికి వెళ్ళాడు.   అక్కడ శోభావతి అనే వేశ్యను చూసి మనసు పడి ఆమె దగ్గర  సహజీవనము సాగిస్తున్నాడు.  అతను సంపాదించిన ధనమంతా ఎలా వచ్చినదో అలానే ఆమెకు ఇచ్చేసాడు. కొంతకాలానికి అతని ధనమంతా అయిపోయింది.  బ్రాహ్మణుడు ఇంట్లో ఉన్న బంగారం  మొత్తమూ,  కన్న తల్లీ దండ్రులను మరియు భార్యను చంపి తీసుకొని పోయి ఇచ్చేసాడు.  ఆ సొమ్ములన్నీ  అయిపోగానే అతనిని వెల్లగొట్టింది.  అతనికి జ్వరం కమ్మింది.  కాలముకూడా చేరువైంది అతనికి దగ్గరగా ఉన్న శివాలయము లో పడుకున్నాడు.  నోట మాట రావటము లేదు.  అదే రోజు ఆ శివాలయములో శివపురాణము పారాయణము చేసారు.  అది వింటూ శివపురాణము అయిపోగానే ఆ బ్రాహ్మణుడు కాలము చేసాడు.  అదే సమయములో యమ భటులు వచ్చి అతని సూక్ష్మ దేహాన్ని తీసుకొని బయలుదేరారు.  ఇంతలో అక్కడికి శివ దూతలు వచ్చి యమదూతలను  వారించి బ్రాహ్మణుడి సూక్ష్మ దేహాన్ని కైలాసానికి తీసుకొని వెళ్లి పోయారు.  యమభటులు అది  గమనించి అక్కడ జరిగినదంతా యమధర్మ రాజు గారికి చెప్పారు.  ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానమేమిటి అని యముడిని అడిగారు.  అప్పుడు ఆ యముడు, ఎన్ని పాపాలు చేసిన అతను శివపురాణము విన్నందు వల్ల సకల పాపాలు పోయి కైలాస ప్రాప్తి కలిగింది.  అని భటులకు చెప్పాడు
శివపురాణము విన్నా ,చదివిన  సకల పాపములు పోయి శివ సాన్నిధ్యమే కలుగును 
ఓం నమశ్శివాయ 

Wednesday, 22 March 2017

గణపతి ఆవిర్భావం


గణపతి ఆవిర్భావం 
ఒక నాడు పార్వతి దేవి స్నానం చేస్తుండగా , శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు. అందువల్ల  అమ్మవారు సిగ్గు పడ్డారు. స్నానాన్ని అర్ధాంతరం గా  ఆపేసి హడావిడిగా  అంతః పురం లోనికి వెళ్లిపోయారు. అనునిత్యం తన చేత  వాంచింపబడే వాడే అయినప్పటికీ  కూడా ఆయన లా హఠాత్తుగా రావడం అమ్మవారికి నచ్చలేదు . ఆ సందర్భాన్ని  పురస్కరించుకొని  అమ్మవారి చెలికత్తెలైన జయ -విజయ లు ఆ తల్లి కి ఒక సలహా ఇచ్చారు.  ఇక్కడ అందరూ శివ ఘనాలే ఉన్నందు వల్ల , మన వ్యక్తి అంటూ  ఒకరు ఉండాలని , ఎవరినైనా నిరోధించగల శక్తి కలవాడై ఉండాలని సలహా ఇచ్చారు.  అప్పుడు అమ్మవారు ఆలోచించి , నా పక్క కూడా ఒక ఘనం ఉండాలని, అది కూడా పురుషాకృతి లో ఉండాలని అనుకున్నది.  తన మెను ను  నలిచినది . ఆ వచ్చిన పదార్ధముతో ఒక పురుషాకృతిని నిర్మించినది . ఆ బొమ్మకు ప్రాణం పోసి, ఆ సర్వాంగ సుందరుణ్ణి ఆశీర్వదించి, తన బిడ్డ గా స్వీకరించి  ఆ సర్వాంగ సుందరుణ్ణి  అమ్మవారి అంతః పుర ద్వారం  దగ్గర నియమించుకుంది.  ఇలా  ఆ భోజ్జ గణపయ్య  ఆవిర్భవించాడు.