Tuesday 7 September 2021

గురుబోధ


 'ఆ'శ ,వ్యామోహం ను అంతము చేయు వారు గురువులు,

'ఇం'ద్రియములను జయించే శేక్తి నిచ్చు వారు గురువులు,

'ఉ'పదేశముతో ఉచ్చస్థితిని అనుగ్రహించు వారు గురువులు,

'ఏ'క కాలమున తనువు మనసు ఏక మయి శేక్తిని అనుగ్రహించు వారు గురువులు,

'ఓ'ర్పు సహనమును అనుగ్రహించు వారు గురువులు,

'కా'మ, క్రోధ, మద , మాచర్యలను మట్టుపెటు వారు గురువులు,

'గ'ర్వమును గెలిచే శేక్తిని ఇచ్చు వారు గురువులు,

'జ'ప తప నియమాలను అనుగ్రహించు వారు గురువులు,

'చ'రా చర జగత్తు గమనమునకు ములం అయిన వారు గురువులు,

అంతటి గురు దేవునకు నిత్యము,అనుక్షణము  వారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారములు 

నా గురుదేవులు అయిన స్వామికి మనసా ,వాచా , కర్మాణ నా శిరశు వంచి నమస్కరించు  మీ దాసుడను

Monday 6 September 2021

కాశి విశ్వం


 శివమ్ కాశి , కాశి శివమ్ , నమః కాశి , కాశి నమః ,

జపం కాశి, కాశి జపం , తపం కాశి, కాశి తపం ,
స్వరం కాశి, కాశి స్వరం, జగమ్ కాశి, కాశి జగమ్,
అంతయు నీవు అంతిమ న అక్కున చేర్చు అనంత లోకం కాశి క  పురాధీశుడవు నీవు కాశి నువు 

ఓం నమశ్శివాయ శివాయనమః

 

- నలుదిక్కుల నిండి నిబిడీకృతమైన లింగం  ఆకాశలింగం ,

                - మన్వంతరాల నుండి మానవ మనుగడ నీవైఉన్నలింగం  భూలింగం, 

శి - శిఖరమై శిఖరాగ్రం నీవై వెలుగునిచ్చు లింగం   అగ్నిలింగం,

                వా - వానవై , వరదవై , వాగువై విశ్వ మంతా నిండివున్న లింగం  జలలింగం ,

            - ఎనిమిది దిక్కులు నీవై యావత్తు నీవై   నిండివున్న లింగం  వాయులింగం , 

'న ' కార , 'మ' కార , 'శి ' కార , 'వ ' కార , 'య ' కార  సర్వకార సర్వేశ్వరుడవు సమస్తము నీవే సకలకార నిర్వికార స్వరూపుడవు నీవే ఓం నమశ్శివాయ శివాయనమః