Friday 31 March 2017

వ్యాసమహర్షి తపస్సు

వ్యాసమహర్షి  తపస్సు 
ఆ మహాపురుషుడు, మహా తపస్ సంపన్నుడు, వీరి తపస్సు విధానం చాలా  కఠినంగా చేశారు.  ఆ మహాపురుషుడు అలా క్రమక్రమముగా తపస్సు లో తన మనస్సును ఏకం చేసి బయట అనేక విషయాల పై తిరిగే మనస్సును ఏకాగ్రం చేసి మనస్సును తన మంత్రము పై నిమగ్నము చేసాడు.  ఆహారము మరియు నీరు మానేసాడు, ఉచ్వాస నిశ్వాసలు క్రమంగా బంధించాడు.  దానివల్ల మనసును వశం చేసుకున్నాడు.  ప్రాణము కుడా అన్ని అవయవాలలోంచి వచ్చి హృదయములో బంధించాడు.  ఆలా మనస్సు , బుద్ధి , ఇంద్రియాలు అన్ని ఏకమై మనసులోకి ప్రవేశించాయి అనేక బయట విషయాల పై ఆలోచించే మనసు , మనసులోనే బంధించి మనసుతో ,మనసులోనే ధ్యానించసాగాడు.  క్రమేపి ప్రాణము మనసు ఏకమై అంధకారంలో ఉన్న మనసు విస్తరించి విశ్వాత్మకంగ మారి బయటకు విడుదల అయినది.   శరీరము పరిధిని దాటి మనసు క్రమంగా పంచభూతాలను అతిక్రమించి ఈ భూగోళము పై వ్యాపించింది.  ఆ తరువాత గ్రహ నక్షత్ర మండలాలను దాటి ఈ యావద్ విశ్వము తానై వ్యాపించింది.  క్రమక్రమముగా నేనే ఈ శరీరము ,నేనే ఈ మనసు  అనే భావము పోయి నేనే ఈ ఆకాశము  అనే భావము కలుగ సాగింది.  ఆ మహాపురుషుడు తపస్సు  ఎంత కఠినముగా చేసి విశ్వమే తానైనాడు.  సృష్టి రహస్యాన్ని ఛేదించాడు. 

Monday 27 March 2017

జర్మజర్మలఫలము

జన్మ జన్మల ఫలము 
ఒక కాళికాదేవి భక్తుడు అమ్మ వారిని ప్రసన్నము చేసుకోడానికి ఒక గురువు దగ్గర తంత్ర విద్యలో మంత్రోపదేశం తీసుకొని దానిని  ఏవిధంగా చేయాలి, ఆ పూజకు కావలిసిన సామాగ్రిని తెలుసుకొని, ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకొని, ఆ పూజ కు కావలసిన సామాగ్రి కోసము తిరుగుతూ ఉన్నాడు.  కొంత కాలము గడిచింది, కాని అతనికి ఆ పూజ కు సంబంధించిన సామాగ్రి దొరకలేదు.  గురువు చెప్పిన సమయములో అది ఒక శవము మిద కుర్చొని  స్మశానంలో చేయాలి.  కాని ఆ భక్తునికి ఆ పూజకు కావలసిన సామాగ్రి దొరకలేదు.  గురువు చెప్పిన సమయము వచ్చినది, అతను బాధతో ఆరోజు స్మశానానికి ఆ పూజ గడియలలో వెళ్ళాడు.  అక్కడ అనుకోకుండా గురువు గారు చెప్పిన పూజకు సంబంధించిన సామాగ్రి మరియు ఒక శవము చూసి ఆనందముతో వెళ్లి కాళికా దేవి ని ప్రసన్నము చేసుకున్నాడు.  అమ్మ ప్రసన్నురాలై ఆ భక్తుడికి దర్శనము ఇచ్చి వెళ్లి పోయే సమయానికి ఆ భక్తుడికి సందేహము వచ్చి, "అమ్మ నాకు గురువుగారు చెపిన పూజ సామాగ్రి దొరకలేదు కాని పూజ చేసే సమయానికి నాకు అవే కన బడాయి ఎలాగమ్మా" అని అడిగాడు నాయనా దూరముగా ఒక శవము ఉంది చూడు అతడే ఇవ్వన్నీ  ఇక్కడ సమకూర్చుకున్నాడు, కాని ఈ జన్మలో అతని కర్మలు ఇంకా ఉండడముచేత అతను చనిపోయాడు.  నువ్వు ఎన్నోజన్మల నుండి నా పూజకోసము ఒకొక్క సామాగ్రిని సమకూర్చుకొని చనిపోయావు ఈ జన్మలో నీ  కర్మములు పోవడంవల్ల నీకు నన్ను  దర్శించే అవకాశము వచ్చినది నాయన
 ఏజన్మకు ఏది ప్రాప్తమో అది మన కర్మలను బట్టి ప్రాప్తమౌతుంది 

Saturday 25 March 2017

మహిమాన్విత లింగాలు

మహిమాన్విత లింగాలు 

  1. ఓం లింగాయ నమః 
  1. ఓం శివ లింగాయనమః 
  1. ఓం శంబు లింగాయనమః 
  1. ఓం ఆధిగణార్చిత లింగాయనమః 
  1. ఓం అక్షయ లింగాయనమః
  1. ఓం అనంత లింగాయనమః
  1. ఓం ఆత్మ లింగాయనమః
  1. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
  1. ఓం అమర లింగాయనమః
  1. ఓం అగస్థేశ్వర లింగాయనమః
  1. ఓం అచలేశ్వర లింగాయనమః
  1. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
  1. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
  1. ఓం అపూర్వ లింగాయనమః
  1. ఓం అగ్ని లింగాయనమః
  1. ఓం వాయు లింగాయనమః
  1. ఓం జల లింగాయనమః
  1. ఓం గగన లింగాయనమః
  1. ఓం పృథ్వి లింగాయనమః
  1. ఓం పంచభూతేశ్వర లింగాయనమః
  1. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
  1. ఓం ప్రణవ లింగాయనమః
  1. ఓం పగడ లింగాయనమః
  1. ఓం పశుపతి లింగాయనమః
  1. ఓం పీత మణి మయ లింగాయనమః
  1. ఓం పద్మ రాగ లింగాయనమః
  1. ఓం పరమాత్మక లింగాయనమః
  1. ఓం సంగమేశ్వర లింగాయనమః
  1. ఓం స్పటిక లింగాయనమః
  1. ఓం సప్త ముఖేశ్వర  లింగాయనమః
  1. ఓం సువర్ణ లింగాయనమః
  1. ఓం సుందరేశ్వర లింగాయనమః
  1. ఓం శృంగేశ్వర లింగాయనమః
  1. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
  1. ఓం సిధేశ్వర  లింగాయనమః
  1. ఓం కపిలేశ్వర లింగాయనమః
  1. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
  1. ఓం కేదారేశ్వర లింగాయనమః
  1. ఓం కళాత్మక లింగాయనమః
  1. ఓం కుంభేశ్వర లింగాయనమః
  1. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
  1. ఓం కోటేశ్వర లింగాయనమః
  1. ఓం వజ్ర లింగాయనమః
  1. ఓం వైడుర్య లింగాయనమః
  1. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
  1. ఓం వేద లింగాయనమః
  1. ఓం యోగ లింగాయనమః
  1. ఓం వృద్ధ లింగాయనమః
  1. ఓం హిరణ్య లింగాయనమః
  1. ఓం హనుమతీశ్వర లింగాయనమః
  1. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
  1. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
  1. ఓం భాను లింగాయనమః
  1. ఓం భవ్య లింగాయనమః
  1. ఓం భార్గవ లింగాయనమః
  1. ఓం భస్మ లింగాయనమః
  1. ఓం భిందు లింగాయనమః
  1. ఓం బిమేశ్వర లింగాయనమః
  1. ఓం భీమ శంకర లింగాయనమః
  1. ఓం బృహీశ్వర లింగాయనమః
  1. ఓం క్షిరారామ లింగాయనమః
  1. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
  1. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
  1. ఓం మహా రుద్ర లింగాయనమః
  1. ఓం మల్లికార్జున లింగాయనమః
  1. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
  1. ఓం మల్లీశ్వర లింగాయనమః
  1. ఓం మంజునాథ లింగాయనమః
  1. ఓం మరకత లింగాయనమః
  1. ఓం మహేశ్వర లింగాయనమః
  1. ఓం మహా దేవ లింగాయనమః
  1. ఓం మణికంధరేశ్వర  లింగాయనమః
  1. ఓం మార్కండేయ లింగాయనమః
  1. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
  1. ఓం ముక్తేశ్వర లింగాయనమః
  1. ఓం మృతింజేయ లింగాయనమః
  1. ఓం రామేశ్వర లింగాయనమః
  1. ఓం రామనాథేశ్వర లింగాయనమః
  1. ఓం రస లింగాయనమః
  1. ఓం రత్నలింగాయనమః
  1. ఓం రజిత లింగాయనమః 
  1. ఓం రాతి లింగాయనమః
  1. ఓం గోకర్ణాఈశ్వర  లింగాయనమః
  1.  ఓం  గోమేధిక లింగాయనమః
  1. ఓం నాగేశ్వర లింగాయనమః
  1. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
  1. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
  1. ఓం శరవణ  లింగాయనమః
  1. భృగువేశ్వర లింగాయనమః
  1. ఓం నీలకంటేశ్వర లింగాయనమః
  1. ఓం చౌడేశ్వర లింగాయనమః
  1. ఓం ధర్మ లింగాయనమః
  1. ఓం జోతిర్ లింగాయనమః
  1. ఓం సైకత లింగాయనమః
  1. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
  1. ఓం జ్వాలా లింగాయనమః
  1. ఓం ధ్యాన లింగాయనమః
  1. ఓం పుష్యా రాగ లింగాయనమః
  1. ఓం నంది కేశ్వర లింగాయనమః
  1. ఓం అభయ లింగాయనమః
  1. ఓం సహస్ర లింగాయనమః
  1. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
  1. ఓం సాలగ్రామ లింగాయనమః
  1. ఓం శరభ లింగాయనమః
  1. ఓం విశ్వేశ్వర లింగాయనమః
  1. ఓం పథక నాశన లింగాయనమః
  1. ఓం మోక్ష లింగాయనమః
  1. ఓం విశ్వరాధ్య లింగాయనమః 

Thursday 23 March 2017

శివపురాణం మహిమ


శివ పురాణం మహిమ 
పూర్వ కాలములో దేవ రాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.  కులము బ్రాహ్మణకులమే ఐన ఆచార వేవహారాలలో ఏ ఒకటి పాటించే వాడు కాదు . డబ్బు సంపాదనే అతని మార్గము.  ఎన్నో రకాల మోసాలుచేస్తు చాలా  డబ్బు సంపాదించాడు.   ఇలా కొంత కాలముతరువాత ఒక నాడు నది తీరానికి స్ననము చేయడానికి వెళ్ళాడు.   అక్కడ శోభావతి అనే వేశ్యను చూసి మనసు పడి ఆమె దగ్గర  సహజీవనము సాగిస్తున్నాడు.  అతను సంపాదించిన ధనమంతా ఎలా వచ్చినదో అలానే ఆమెకు ఇచ్చేసాడు. కొంతకాలానికి అతని ధనమంతా అయిపోయింది.  బ్రాహ్మణుడు ఇంట్లో ఉన్న బంగారం  మొత్తమూ,  కన్న తల్లీ దండ్రులను మరియు భార్యను చంపి తీసుకొని పోయి ఇచ్చేసాడు.  ఆ సొమ్ములన్నీ  అయిపోగానే అతనిని వెల్లగొట్టింది.  అతనికి జ్వరం కమ్మింది.  కాలముకూడా చేరువైంది అతనికి దగ్గరగా ఉన్న శివాలయము లో పడుకున్నాడు.  నోట మాట రావటము లేదు.  అదే రోజు ఆ శివాలయములో శివపురాణము పారాయణము చేసారు.  అది వింటూ శివపురాణము అయిపోగానే ఆ బ్రాహ్మణుడు కాలము చేసాడు.  అదే సమయములో యమ భటులు వచ్చి అతని సూక్ష్మ దేహాన్ని తీసుకొని బయలుదేరారు.  ఇంతలో అక్కడికి శివ దూతలు వచ్చి యమదూతలను  వారించి బ్రాహ్మణుడి సూక్ష్మ దేహాన్ని కైలాసానికి తీసుకొని వెళ్లి పోయారు.  యమభటులు అది  గమనించి అక్కడ జరిగినదంతా యమధర్మ రాజు గారికి చెప్పారు.  ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానమేమిటి అని యముడిని అడిగారు.  అప్పుడు ఆ యముడు, ఎన్ని పాపాలు చేసిన అతను శివపురాణము విన్నందు వల్ల సకల పాపాలు పోయి కైలాస ప్రాప్తి కలిగింది.  అని భటులకు చెప్పాడు
శివపురాణము విన్నా ,చదివిన  సకల పాపములు పోయి శివ సాన్నిధ్యమే కలుగును 
ఓం నమశ్శివాయ 

Wednesday 22 March 2017

గణపతి ఆవిర్భావం


గణపతి ఆవిర్భావం 
ఒక నాడు పార్వతి దేవి స్నానం చేస్తుండగా , శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు. అందువల్ల  అమ్మవారు సిగ్గు పడ్డారు. స్నానాన్ని అర్ధాంతరం గా  ఆపేసి హడావిడిగా  అంతః పురం లోనికి వెళ్లిపోయారు. అనునిత్యం తన చేత  వాంచింపబడే వాడే అయినప్పటికీ  కూడా ఆయన లా హఠాత్తుగా రావడం అమ్మవారికి నచ్చలేదు . ఆ సందర్భాన్ని  పురస్కరించుకొని  అమ్మవారి చెలికత్తెలైన జయ -విజయ లు ఆ తల్లి కి ఒక సలహా ఇచ్చారు.  ఇక్కడ అందరూ శివ ఘనాలే ఉన్నందు వల్ల , మన వ్యక్తి అంటూ  ఒకరు ఉండాలని , ఎవరినైనా నిరోధించగల శక్తి కలవాడై ఉండాలని సలహా ఇచ్చారు.  అప్పుడు అమ్మవారు ఆలోచించి , నా పక్క కూడా ఒక ఘనం ఉండాలని, అది కూడా పురుషాకృతి లో ఉండాలని అనుకున్నది.  తన మెను ను  నలిచినది . ఆ వచ్చిన పదార్ధముతో ఒక పురుషాకృతిని నిర్మించినది . ఆ బొమ్మకు ప్రాణం పోసి, ఆ సర్వాంగ సుందరుణ్ణి ఆశీర్వదించి, తన బిడ్డ గా స్వీకరించి  ఆ సర్వాంగ సుందరుణ్ణి  అమ్మవారి అంతః పుర ద్వారం  దగ్గర నియమించుకుంది.  ఇలా  ఆ భోజ్జ గణపయ్య  ఆవిర్భవించాడు. 

Tuesday 21 March 2017

శివవందన స్తుతి

శివవందన స్తుతి -108

  1.  ఓం నమో శంకర శివ వందన                          
  2. . త్రిజన్మ పాప వినాశన 
  3. దాక్షాయణి ప్రియ వదన 
  4. అర్త రక్షణ 
  5.  జగదో ధారణ 
  6. సర్వసంకట హరణ 
  7. ఆదిభిక్షువు పాప ప్రక్షాళన 
  8. వేదాంత వెద్యయన 
  9. సోమ సూర్యాగ్నిలోచన 
  10. త్రిలోకసంచారణ 
  11.  అధినాయక సర్వ భూత గణ 
  12. శంభో వృషభ వాహన 

వందనమిదే శరణాగత రక్షణ 


  1. నటన సూత్ర ధారణ 
  2. జగత్ లయ కరణ 
  3. శివ కేశవాది వేక రూపిత త్రిలోకార్చన 
  4. లలాట లిఖిత బ్రహ్మ జ్ఞాన నేత్రణ 
  5. సతి దక్ష యజ్ఞ హుతి శివ దూషణ 
  6. విశ్వ ప్రళయ విజృంభణ 
  7. ప్రళయాగ్ని ప్రభంజన 
  8. జటా జ్యూటోద్భవ   వీర భద్ర ఆగమన 
  9. దక్ష యజ్ఞ వినాశన 
  10. సతి ఆదిశేక్తి అంసోనత  అష్టాదశ శేక్తి పిటోద్భవ కారణ    
  11. ధరణి దారిద్య దుఃఖ దహన 
  12. అఖిలాత్మజ సర్వసంక్షోభిత శోక నివారణ 

 వందనమిదే శరణాగత రక్షణ 


  1.  యోమాకేశ భష్మా భూషణ 
  2. పులిచర్మ వస్త్ర జటా మకుట  ధారణ 
  3. రుద్రాక్ష హరాయ ఫణి భూషణాయ 
  4. గంగోదక జట్టజూట ధారణ 
  5. గరళ కంట జటిలత్ త్రినేత్రణ
  6. సిగలో చంద్ర దరణ 
  7. పాశాంకుశ ఢమరుక సింహగర్జన 
  8. కాపాలి త్రిశుల ధారణ  
  9. స్మశాన వాసిని భవ భయ దుక్క హరణ 
  10. దిన బందో అనాధ నిధన 
  11. వేదాంత వెద్యయన 
  12. కఠోర దీక్ష తపోనిది యోగాసనా

వందనమిదే శరణాగత రక్షణ 



1 హిమాసుత బిష్టిత సుందర వందన 

2 మదనాగ్ని భస్మిత అగ్ని నయన 
3 రతి శోక నివారిత భక్త వత్సల  నామ ధారణ 
4 పార్వతి పరిణయ లోకోద్ధరణ 
5 తాండవకేళి విలసిత ప్రణయ శృంగార లోచన 
6 కుమార గజ ముఖ నందన 
7 జగత్ మాతాపిత అర్ధ నారీరమణ 
8 హరి బ్రహ్మాహేంద్ర సన్నుత సద్గుణ 
9 సురా సురామూని గణ పూజిత శుభచరణ 
10 దేవ ముని ప్రవరార్చన 
11 తుంబుర నారదాది గానాలాపన 
12 శనకాది ముని వర వందిత శ్రీ చరన 
వందనమిదే శరణాగత రక్షణ


  1. సాధు పాలలోచన 
  2. అనసూయత్రి లాలన 
  3. పశుపతాస్త్ర అనుగ్రహణ 
  4. సకల జీవ కోటి జీవనోధారణ 
  5. సర్వసముద్భవకారణ 
  6. మృకండవరపూజిత గౌరి రమణ 
  7. అకాలమృతు హరణ 
     8 కాల యమ శాసన 
    9 మార్కండేయ ప్రాణ రక్షణ 
   10 చిరంజీవి సిరియాలు పునర్జీవన 
   11 అభిష్ట వరద అక్షయ వరప్రదాయన 
   12  గణగణ భవ్య కలాపోషిత నిత్య నర్తన 



వందనమిదే శరణాగత రక్షణ 

  1. మృగువర శాపోనాథ ఇల లింగరూప ధారణాయ 
  2. లోక కల్యాణ గుణ గణ 
  3. కోటిలింగార్చిత రావణా పూజర్పణ 
  4. అభిషేక ప్రియ విబూది అలంకరణ 
  5. మారేడు బిల్వ పత్రార్చన 
  6. పారిజాత వృక్షస్య మూలాధారణ 
  7. సుమ సుగంధ మంధర కుసుమ ప్రియా రమణ 
  8. కోటిసూర్య సమప్రభ దివ్య తేజో ధారణ 
  9. ఆత్రత్రణ పరాయణ 
  10.  నిత్య జన శివ పంచాక్షరీ నామోచ్చారణ 
  11. సర్వభూతహిత ప్రధ బహురూప ధారణ 
  12. అక్షయ లింగా  అనంతనయన 

         వందనమిదే శరణాగత రక్షణ

  1. బస్మహస్తది భస్మిత ప్రియ మోహిని సన్ మోహన 
  2. దివ్య తేజోమయ అయ్యప్ప జన్మ కరణ 
  3. అఖండ జోతిష్ స్వరూప అర్త రక్షణ 
  4. గ్రహపీడ నివారణ 
  5. అసుర కార్య విధ్వంసని నాశన 
  6. త్రిపురాంతకం దైత్య దమన 
  7. సకల విపత్ నివారణ 
  8. కామితార్ద ప్రదాయన 
  9. పురాణ పురుష పరమ పవన 
  10. కాలాత్మక  పంచభూత విలక్షణ 
  11. మనోవాంఛితఫలప్రదాయన 
  12. మరకత లింగ రూప ధారణ  

వందనమిదే శరణాగత రక్షణ

  1. పంచలింగ సమన్విత పంచారామ క్షేత్రజ్ఞ 
  2. కోటిలింగేశ్వర నామధారణ 
  3. స్వాయంభువ భక్త పాలనా 
  4. ప్రమథ గణాధి నిత్య రాధన 
  5. మహా యజ్ఞ ఫలార్పణ 
  6. చిదంబరేష చింతనాశన 
  7. కల్ప కోటి యుగధరణ 
  8. కామ క్రోధాగ్ని దహన 
  9. ముర్క కన్నప్ప జ్జ్ఞానో ధారణ 
  10. నాదప్రియ గానగంధర్వాది నిత్య స్వరార్చన 
  11. ద్వాదశ జోతిర్లింగ నిత్య నిరంజన 
  12. ఆదిత్యాది గ్రహరూపణ 

వందనమిదే శరణాగత రక్షణ

  1. మల్లికార్జున మహా లింగోద్భవ మోక్ష శిఖర దర్శన 
  2. వాయు లింగ సర్ప దోష నివారణ 
  3. వైద్య నాధాయ భావ రోగ  హరణ 
  4. మహాకాలేశ చిత భస్మ లోచన 
  5. యస్సావి అమరలింగేశ్వరధారణ 
  6. కేదారేశ్వర మహాశేక్తి చైతన్య కీర్తివర్ధన 
  7. సైకతలింగ విమోచిత శ్రీరామలింగ ప్రతిష్టాపన 
  8. ఆత్మ మోక్ష ప్రధ కాశివిశ్వేశ్వర నామధారణ 
  9. ఆత్మ లింగ ఇల గణపతి స్థాపన 
  10. త్రయంబకేశ పాతకనాశన 
  11. అనంత లింగ ఆవిర్బవన 
  12. విష్వాత్మక విఠలాక్ష విశ్వరూప ధారణ 
వందనమిదే శరణాగత రక్షణ
శివ అష్టోత్తర శత వందన సమర్పయామి 
రచన 
చెర్లో  హైమావతి గారు 

Monday 20 March 2017

సర్వ లోకాలను యేలు సర్వేశ్వర లింగం

సర్వ లోకాలను యేలు సర్వేశ్వర లింగం 
ఈ సృష్టికి జలము నిచ్చు జల లింగం
వాయువు నిచ్చు వాయు లింగం
అగ్ని నిచ్చు అగ్ని లింగం
పుడమినిచ్చు పృద్వి లింగం
నిగినిచ్చిన ఆకాశ లింగం 

Sunday 19 March 2017

పురుషులలో పుణ్య పురుషుడు

పురుషులలో పుణ్య పురుషుడు 
సకల వేద సారంగీతుడు
భారత ఖండ బ్రహ్మాండ నాయకుడు
కనకధార స్తోత్ర గాన లోలుడు
కనకమును కురిపించిన కఠోర దిక్షుడు
సకల ఆలయ నిర్మితుడు
శ్రీ చక్ర నిర్మితుడు 
కన్న తలికి కన్నయ్యను చుపిన కమనియుడు
కలియుగ జగత్ గురువు
శ్రీ శ్రీ శ్రీ  ఆది శంకరాచార్యులు వారి పాదములకు నిత్యం నమస్కారాలు 


గరబ్బ గుడిలో ని దర్శణం

గరబ్బ గుడిలో ని దర్శణం 
కర్పూర కాంతులతో ని దివ్య స్వరూపం
శఠగోపం  శిరస్సున ఉంచిన  కనిపించు ని స్వరూపం
గంట నాదముతో వినుల విందు చేయు ని నినామం
పానవట్టము పై ప్రకాశించు ని స్వరూపం
విభూది అలంకారంతో విరాజిల్లు ని దివ్య తేజో స్వరూపం
పువ్వుల అలంకారంతో ప్రకాశించు ని స్వరూపం
కనులవిందు చేయు కమనీయ స్వరూపం 

మంచు ముత్యం ఈ లింగం

మంచు ముత్యం ఈ లింగం 
అరుదైన అద్భుత విగ్రహం
మైమరపించు మంచు విగ్రహం
కొండ కొనల మధ్య వెలసిన మంచు విగ్రహం
మహిమ గల మంచు విగ్రహం
ముడు మాసాలు మైమరపించు విగ్రహం
అమర నాధుని అద్భుత లీలా విగ్రహం
కనుల ముందు కనువిందు చేయు విగ్రహం
ఈ యాత్ర లో ని నిజరూప దర్శనం
జోతిర్లింగ స్వరూపం ఆ అమర నాధ లింగం 

అరుణాచల అఖండ జోతి

అరుణాచల అఖండ జోతి 
శిఖరంపై ని దివ్య జోతి
మహిమ గల దివ్య జోతి
కార్తీక మాసం లో కనిపించు జోతి
కటిక చీకట్లను కబళించు జోతి
వెలుగులతో విరాజిల్లు జోతి
ముడు కనుల వాడి మహిమ చుపు జోతి
ఈ జోతి అరుణాచల దేవుని అద్భుత జోతి 

Thursday 16 March 2017

నామమే ముక్తి నొసగు నామం

నామమే ముక్తి నొసగు నామం 
సత్యమునకు నిలువెత్తు నిదర్శనం నీ నామం
సర్వ మంగళ కరమైన నీ నామం

సాక్షి గణపతి కొలిచేది నీ నామం

సప్త లోకములు కొలిచెడి నీ నామం

స  రి  గ  మ  ల  తో పలికేను  నీ నామం

అర్ధ నారీశ్వరుని అపురూప మైనన నామం
అజరామరమైన నీ నామం

నిత్యము తలచుకున్న చాలు నీ నామం

సర్వ శుభములకు ఆధారమైన నీ నామం

పలికిన చాలు మాజన్మ ధన్య మైయే నీ నామం

ఐదక్షరముల అపురూప మైన   నీ నామం

నమశివాయ  అను నీ నామం

ఓం నమశివాయ  నమః 

శివ అక్షరం

శివ అక్షరం 

అముల్యమైన అక్షరం
అద్వైత సారమై ఉన్న అక్షరం
అద్భుత శేక్తిగల అక్షరం
అధి నుండి నేటి వరకు ఆరాధించు అక్షరం
అఘోరాలు ఆరాధించు అక్షరం
మహిమ గల అక్షరం
ఎన్నిసార్లు పలికిన పలకాలి పలకాలి అనిపిస్తుంది ఈ అక్షరం
ఎందరో మహను బావులు పలికిన అక్షరం
ఎంత విన్న వినాలని  పించె అక్షరం
న మనసంతా కొలువైన అక్షరం
సర్వము తానై ఉన్న అక్షరం  

Wednesday 15 March 2017

"ఆ " అక్షరం తో అమ్మల గన్న అమ్మ నామం

"ఆ " అక్షరం తో అమ్మల గన్న అమ్మ నామం 
ఓం అంబికాయ నమః
ఓం అలంకారిణి నమః
ఓం అద్భుత రూపిణి నమః
ఓం ఆలయ విగ్రహ రూపిణి నమః
ఓం అధి దేవ పతి నమః
ఓం అసుర నాశిని నమః
ఓం ఆకాశ ఆవల నిలయాయ నమః
ఓం అర్త జన పోషిణి నమః
ఓం అకాల మృతు నివారిణి నమః
ఓం ఆనంద రుపాయ  నమః
ఓం అవతార రూపిణే నమః
ఓం అశేష జన పూజితాయ నమః
ఓం అంబ జగదంబ య నమః
ఓం ఆత్మ దర్శిని నమః
ఓం ఆది పరాశక్తి ని నమః
సర్వ రూప కారిణి సర్వేశ్వరీ దుర్గమ్మ నమో నమః 


నిరంతరం నిసేవలోనే సద శివ

నిరంతరం నిసేవలోనే సద శివ 

మల్లెల తో నిమహిమను పూజించేను
జాజులతో ఈ జగత్తును పాలించు నిన్ను పూజించేను 
కనకాంబరాలతో నికరుణకై పూజించేను
బంతి పూలతో ని భజన చేస్తు నిన్ను పూజించేను
గులాబీలతో నా గుండె నిండా నిండి ఉన్న నిన్ను పూజించేను
చామంతులతో నన్ను చేరదీసినందుకు పూజించేను
కస్తూరి పూలతో నన్ను కరుణించు దేవుడవని పూజించేను
నంది వర్ధనలతో నర్తన చేయు నాస్వామిని పూజించేను
సన్న జాజులతో నాకు సర్వము నీవని నమ్మి పూజించేను
నూరు వరహాలతో నువ్వు తప్ప మాకు ఎవరు లేరని పూజించేను
మందార పూవులతో మంత్ర స్వరూపుడవని నిన్ను పూజించేను
నాగ పుష్పములతో నయనానందము గా ఉన్న నిన్ను పూజించేను
పారిజాత పూవులతో ని పరమ పదాలను పూజించేను
యంత పూజించిన తనివి తీరని నాస్వామికి శత కోటి పుష్పాలతో పూజించేను
హర హర మహా దేవా ఆనంద స్వరూప అఖిలేశ్వర అమరేశ్వర హరోమ్ హర 

Monday 13 March 2017

సర్వం నీవే లింగ స్వరుప

సర్వం నీవే లింగ స్వరుప 
ఎన్ని సార్లు చుసిన తనివి తీరని ఆ లింగం
ముజగాలను యేలు లింగం
ఆ సర్వేశ్వరుని సన్నిధి చేర్చు లింగం
భక్తునికి భగవంతునికి వారధి ఈ లింగం
సర్వేశ్వరుని స్వరూపం ఈ లింగం
ముగ్గురు మూర్తుల ముల స్వరూపం ఈ లింగం
మణి కాంతులచొ విరాజిలు ఈ లింగం
లింగమై లింగముతో   ఉన్న లింగ స్వరూప నమో నమః 


సర్వ లింగ స్వరుప సర్వేశ్వర

సర్వ లింగ స్వరుప సర్వేశ్వర 

ముక్తి నొసగు  ముక్కంటి లింగ
సృష్టి కారక  సువర్ణ లింగ
జగత్ రక్షక జోతిర్లింగ
రాక్షస సంహార రాతి లింగ
అగ్ని నేత్ర అగ్ని లింగ
వర దాన ప్రియా  వాయు లింగ
గంగాధర గగనలింగ
విశ్వేశ్వర విబూది లింగ
సర్వ జన ప్రియా సర్ప లింగ
పంచాబ్రుత ప్రియా పరమ లింగ
అఘోర సేవిత ఆత్మ లింగ
హిమాలయ నిలయ హిమ లింగ
ఓంకార స్వరూప ఓంకార లింగ
పరమ పురుష పృద్విలింగ
పంచాక్షరీ స్వరూప పంచలింగ
ముక్తి నొసగు ముక్కంటి లింగ
ధైర్యము నొసగు  ధర్మస్థల లింగ
శాంతి నొసగు సకల లింగ
కర్మ బాపు కమణియలింగ
దోషములను బాపు ధరణి నెల లింగ
సుఖసంపదలను ఇచ్చు స్పటిక లింగ 

సౌభాగ్యము నొసగు సైకత లింగ 


మానవ సేవే మాధవ సేవ

మానవ సేవే మాధవ సేవ 

 ఒక చిన్న కుటుంబం ఆ ఇంట్లో తండ్రి ,అమ్మ ఇద్దరు పిల్లలు ఉండేవారు వీరు ఆ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తు ఉండేవారు ఒకనాడు వారి పెరటిలో ఒక గుంట తోవుతు ఉండగా ధగ ధగ మెరుస్తు రెండు బంగారపు లంకి బింద్యలు కనబడాయి వాటిని తీసుకొని ఇంట్లో పెట్టి ఆ దంపతులు వీటిని ఏమి చెయాలి ఆని ఆలోచిస్తు ఇద్దరు నిదర పోయరు ఆ ఇంటి పెద్దకు వారి పితృ దేవతలు సోప్నములో కనబడి నాయన మేము చనిపోయిన ఇంకా భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నాము నువ్వు ఏదైనా మంచి పని చేస్తే మాకు విముక్తి దొరుకు తుంది ఇంతక ముందు నీదగ్గర ధనము లేదు ఇపుడు ఉంది కదా అని చేపి మాయమైనారు పొద్దున ఆ ఇంటి పెద్ద తన భార్యతో జరిగినది చెప్పి ఏమి చేద్దాము అని అలోచించి దానాల లో కల అన్నదానం గొప్పది కథ అని అలోచించి ఆ గ్రామ ప్రజలందరిని పిలిచి అన్నదానం చేయించాడు ఆ రాత్రి ఆ ఇంటి పెద్ద కళ లోకి పితృ దేవతలు వచ్చి నాయన యంతో మందికి అన్నదానం చేసావు కానీ అన్నము తిన్న కొంత మందికి అస్వస్తత కలిగింది అందు వల్ల పాపం పెరిగింది ఇంకేదైనా మంచి పని చేయి నాయన అని చెప్పారు మరల ఆలోచించిన ఆ ఇంటి పెద్ద ఒక దేవాలయాన్ని నిర్మించాలని అలోచించి కొద్ది రోజులోనే ఒక దేవాలయాన్ని నిర్మించాడు కొద్దీ రోజుల తరువాత మరల రాత్రి కలలో పితృ దేవతలు వచ్చి నాయన దేవాలయము ను నిర్మించినావు గాని అందులో పూజ పునస్కారాలు సరిగా జరగనందు వల్ల పాపం పెరిగినది అని మాయమైనారు అప్పటి నుండి ఎనో మంచి పనులు చేస్తు నే ఉన్నాడు కాని వారికీ మోక్షం అవ్వలేదు ఒకనాడు దారిన పోతు ఉండగా ఒక అనాధ శవం పడివుంది దానికి దహన సంస్కారములు చేయించాడు పితృ దేవతలు వచ్చి నాయన  మాకు విముక్తి కలిగినది ఒక అనాధ శవం కు దహన సంస్కారములు చేసి నందు వల్ల అని చేపి స్వర్గానికి వెళ్లి పోయారు ఆ ఇంటి పెద్ద మానవ సేవకు మించిన సేవ లేదు అని తెలుసు కున్నాడు 

Saturday 11 March 2017

ధరణి నెల దుర్గమ్మ

ధరణి నెల దుర్గమ్మ
దివ్య తేజో మయమైన మణులతో మలచిన సింహాసనముతో
వజ్ర వైడుర్య నవరత్నములు పొదిగిన కిరీటము తో
నొదుటన నక్షత్రముల వెలుగు తో కుడిన కుంకుమ తో
సకల అస్త్ర శస్త్ర ములు అష్ట హస్తముల తో
మహిమాన్వితమైన ని దివ్య హస్తము తో
కోటి సూర్యుల తేజో రూపముతో
కొలువైన మాతలి ప్రాంగణం
పరిమళ గంధములు వేగజలు ని నివాస ప్రాంగణం  

Friday 10 March 2017

గగనమున ఉన్న గరిక ప్రియుడు

గగనమున ఉన్న గరిక ప్రియుడు 

గగనమున ఉన్న గణేశ
గరిక చాలు నీకు ప్రియం గణేశ
గంగాధర ముద్దుల తనయ గణేశ
గజముక రుపుడవు  గణేశ
గౌరి నాథ తనయ  గణేశ
గరేలు , వుండ్రాలు నీకు గణేశ
గంధ పుష్పములతో పూజించేము గణేశ
గాన లోలుడవు గౌరి గణేశ 



  

యంత మధురం నినామము దుర్గమ్మ


యంత మధురం నినామము దుర్గమ్మ 
సర్వ శెక్తికి ములం నినామం
సర్వ జగత్తుకు ఆధారం నినామం
సర్వ ప్రాణులకు ములం నినామం
స్వర్గ మార్గమునకు ఆధారం నినామం
సర్వ దోషాలు మాయం నినామం
సర్వ శుభములకు నిలయం నినామం
సర్వ వేదములకు నిలయం నినామం
సర్వ జనులు పలికేటి నినామం
సర్వ శక్తుల రూపం తో కొలువున్న నినామం
సర్వ మై ఉన్న నినామం
నిత్యము తలచి తలచి పలికెము నినామం
ఆ సర్వేశ్వరుని ఇష్ట సఖీ నామం
అమ్మలు గన్న అమ్మ ముగురమ్మల ముల పుటమ్మ మాయమ్మ దుర్గమ్మ నామం 

పసుపు ముద్దతో పుట్టిన పురుషోత్తమ

పసుపు ముద్దతో పుట్టిన పురుషోత్తమ
పార్వతి దేవి పంచ ప్రాణాలను పోసిన పురుషోత్తమ
తల్లీ దండ్రుల ప్రదక్షణముతో ప్రధమ పూజితుడవు పురుషోత్తమ
గజముఖ రూప సర్వ జ్ఞాన స్వరుప
 గణనాయక సుద్ధి బుద్ది వినాయక
ప్రధమ పూజిత పార్వతి తనయ
విజ్ఞములను తొలగించు వేద గణ నాయక
ముషిక వాహన ముని జన సేవిత ప్రియ
కోర్కెలు తీర్చు కాణిపాక కరుణ కర
కమ్మని విందు చాలు కామాక్షి ప్రియ తనయ
ఆదుకొనగ రావయ మా బాల గణపయ్య
ఇహ లోక ముక్తికి నినామమే మాకు దిక్కయ  


అవతార పురుష సమస్త సద్గురు సాయి



అవతార పురుష  సమస్త సద్గురు  సాయి




రచన:
చెర్లో హైమావతి గారు 
గానం :
సురే శ్రీదేవి  గారు  



Thursday 9 March 2017

పుడమినెలు తల్లీ దుర్గమ్మ తల్లీ

పుడమినెలు తల్లీ దుర్గమ్మ తల్లీ 

పులి వాహనమున పుడమినెలు తల్లీ
పృద్వియే పులకించే పులి వాహిని తల్లీ
పురుషోత్తముని ప్రియ పత్ని పులి వాహిని తల్లీ
పండ్లు పూలు ఇస్తే పసుపు కుంకుమ ఇచ్చేవు పులి వాహిని తల్లీ
పరిమళ పుష్పములతో పూజించేము పులి వాహిని తల్లీ
ఇంద్ర కీలాద్రియే ని ఆవాసము పులి వాహిని తల్లీ
ఇంత  అంత కాదు ని మహిమ పులి వాహిని తల్లీ
నవ దుర్గలకు ప్రతి రూపం నివమ్మ పులి వాహిని తల్లీ
ముగురమ్మల ముల శెక్తివి పులి వాహిని తల్లీ 


సాయి మందిరం

సాయి మందిరం 

షిరిడి మందిరం శాంత సుందరం
సాయి మందిరం సర్వమత సమ్మెళనం
సద్గురు నిలయం సమత మమతలకు నిలయం
బాబ నామస్మరణం భక్త జన కోటికి శ్రేయస్కరము
సాయి సన్నిధానం సర్వ దేవతల నిలయం
విబూధి అలంకారం కోటి జన్మల ఫలం
సమాధి నుండి ని దర్శినం నడిపించును ముక్తి మార్గం
సర్వదేవతల రూపం ని దివ్య మంగళ స్వరూపం
సర్వమానవ సమానం ని ఆలయ నిర్మాణం
కుష్ఠు వ్యాధిని రూపుమాపిన కమనీయ హస్తం
కులమే లేదన్న కలియుగ దైవం 

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి  

Wednesday 8 March 2017

గజదొంగ మోక్షం


గజదొంగ మోక్షం

 రాజులు రాజ్యమేలుతున్న కాలం లో   ఒక రాజ్యం లో ఆ రాజ్యానికి రాజు ఉండేవాడు, ఆయనకి ఒక కుమార్తె కలదు. ఆమెను అపురూపంగా చూసుకుంటు  ఉండేవాడు  ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమె ఒక కోరిక కోరింది , తండ్రి గారు నేను ఒక సన్యాసం తీసుకున్న మహానుభావుడని పెళ్లి చేసుకుంటాను. ఆయన కోరిక ప్రకారం సన్యాసం నుండి  సంసారం లోకి వచ్చిన లేక  ననైన సన్యాసం తీసుకోమన్న  సమ్మతమే., అని చెప్పగా ఆ రాజు  తన రాజ్యం లో ఈ విషయాన్ని చాటింపు వేయించాడు . అదే రాజ్యం లో ఒక గజదొంగ ఎన్నో దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతు  ఉండగా , రాజు గారు చాటింపు వేసిన విషయం ఈ గజదొంగ చెవిన పడింది , అది విన్న గజదొంగ దుర్బుర్దితో ఎలాగైనా ఈ రాజ్యానికి రాజుగా ఉండాలన్న కోరిక తో వేష భాషలను మార్చి రాకుమారి కోరిన విధముగా సన్యాసిగా జీవనం సాగిస్తునట్లుగా నటించ సాగాడు. రాజు గారు ఆ రాజ్యం లో పది మంది సన్యాసులను ఎంచుకున్నాడు , వారిలో ఒకరు మన గజ దొంగ  సన్యాసి . ఒకరోజు వీరంతా స్వయంవరానికి రమ్మని ఆహ్వానించాడు , అందరు వొచ్చారు . రాకుమార్తె కొన్ని పరీక్షలు నిండు సభలో పెట్టగా పది మంది సన్యాసులలో గజ దొంగ ఐన సన్యాసి నెగ్గడు . రాకుమార్తె పూలమాలతో అయన  దెగరకు వచ్చిమీరు నాకు నచ్చారు స్వామి , మీరు సన్యాసము నుండి సంసారం లోకి వచ్చిన లేక నన్ను సన్యాసం తీసుకోమనిన మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. అని చెప్పగా దొంగ సన్యాసి పైకి లేచి ప్రభు నేను మీ రాజ్యం లో ఒక గజదొంగని ఈ రాజ్యానికి రాజుగా ఉండాలన్న కోరిక తో ఈ విధంగా నాటకం ఆడాను , నేను ఎప్పుడైతే ఈ కాషాయ వస్త్రాలు ధరించానో ఈ సన్యాసి జీవితం గడప సాగానో  నాకే తెలియని ఒక అనుభూతి కలిగింది . మీరు అనుమతి  ఇస్తే నా శేష జీవితం అరణ్యం లో తపస్సు చేసుకుంటు  నా జీవితాన్ని గడుపుతాను , అని ఆ రాజుని కోరాడు . ఆ రాజు అనుమతి  ఇవ్వటం తో అరణ్యం వెళ్ళి  నిజమైన సన్యాసంతో అతను మోక్షాన్ని  పొందాడు. 


జగన్నాథ అమృత వర్షిణి

జగన్నాథ అమృత వర్షిణి 

రచన
చెర్లో హైమావతి ,
గానం
చెర్లో హైమావతి,


Tuesday 7 March 2017

కలియుగ కమనీయ విగ్రహం

కలియుగ కమనీయ విగ్రహం 

అణువణువు అద్భుతమైవున్న విగ్రహం
తలులిద్దరును తనలో చుపు విగ్రహం
తులసీమాలతో దేదిప్య మానంగా వెలుగు విగ్రహం
కటిక హస్తముతో కరుణ కురుపించు విగ్రహం
ముజగములను యేలు మహిమానిత విగ్రహం
ముని పుంగవులు ముక్తి కై పూజించు విగ్రహం
తిరుమాఢవీధులలో చిరు మందహాసంతో ఊరేగు విగ్రహం
నిత్య కళ్యాణ శోభతో వెలుగు విగ్రహం
ఏడుకొండలపై నుండి యల్ల లోకాలను యేలు విగ్రహం  

సర్వం నినామ స్మరణమే అయ్యప్ప

సర్వం నినామ స్మరణమే అయ్యప్ప 

తిరువాభరణ రూప అభయంకర
త్రికాల పూజిత ప్రియ
త్రిమూర్తి రూప హరి హర పుత్ర
వ్యాఘ్ర వాహన మహిషి మర్దన
మంత్ర జప మహిమానిత రూప
సర్వసుందరం ని నిజరూప దర్శనం
నిత్య నియమం సత్య రూప దర్శనం
నియమ నిష్టలతో ని ఆరాధనం
సకల శుభములకు అధి శ్రీకారం
పదునెనిమిది మెట్ల సోపానం పాప ప్రక్షాళన
ఐదు కొండలలోని అద్భుతం ని దివ్య దర్శన భాగ్యం
నినామ స్మరణం సర్వ జన్మ పాప నాశనం 

Sunday 5 March 2017

శరనమ్ నినామ స్మరణం

శరనమ్ నినామ స్మరణం 

పులి వాహనుడా పుడమినేలు ప్రభువా
ఐదుకొండల వాస అరణ్య వాస
బ్రహ్మ చర్యముతో ని కటోర దీక్ష
బాల రూప బ్రహ్మాండ నాయక
హరి హర పుత్ర ఆనంద నిలయ
నెయ్యబిషేకం నీకు నేత్రానందం మాకు
మెట్ల పూజ నీకు ఆనంద తాండవం మాకు
కర్పూర దీపం నీకు కర్మలు పోవు మాకు
నిత్య పూజలు నీకు నినామమే మాకు
శరణు అన్న చాలు  చేరదీసేవు
ఓం శ్రీ హరి హర సుతన్  ఆనంద చితన్ అయాన్ అయ్యప్ప స్వామియే శరణమయప్ప 

పావన పంపానది


పావన పంపానది 

పరమ శివుని జటాయువు నుంఢి ఇలకు దూకిన ఆ పంబ
పరవశంగ ప్రవహించు ఆ పంబ
శరణు గోషతో గళ గళ పారె ఆ పంబ
శని బాధలు పారదోలు ఆ పంబ
శరణు ప్రియుని దరి చేర్చు ఆ పంబ
కొండకోనల నుండి కరుణించుటకై వచ్చు ఈ  పంబ
పరమ పావని వమ్మ పంబ 


ఆనంద నిలయ అయ్యప్ప

 అయ్యప్ప రూపం 

చిన్ముద్రతో
పట్టబంధముతో
బ్రహ్మచర్యముతో
అడ్డ నామములతో
నిత్యయవ్వనముతో
కంఠ మాలతో
కర్పూర హారతితో
నేయభిషేకముతో
చందన అలంకారంతో
యజుర్వేద మంత్రములతో
చిరు మందహాసముతో
యోగ నిద్రలో
విళ్లు ,బాణములతో
కొలువైన నాసామికి కోటి దండాలు ,శత కోటి శరణాలు
ఓం స్వామియే శరణమయప్ప   


నాగేద్రహారాయ నాగరాజాయ

నాగేద్రహారాయ నాగరాజాయ 

బులోక దైవం
పాతాళ లోక నివాసం
పాలు నీకు ప్రియం
పరమ శివ అలంకారం
పరందాముని శయనం
పాపులకు భయం
ముజగాలకు దైవం
యుగ యుగాల దైవం
పసుపు ,కుంకుమ నీకు ప్రియం
క్షిర మదనమునకు ఆధారం
నాగుల చవితి నీకు ప్రియం
నమిన భక్తులకు గ్రహ దోష నివారణం
నయనానందకరం ని దివ్య రూపం
నమో నాగ రూపం నమస్తే నాగ దైవం  

భగవత్ గీత భగవానుడు


భగవత్ గీత భగవానుడు 

గోకుల బాలుడు
గోవర్ధన ధరుడు
గోమాత రుపుడు
గాన లోలుడు
గీత రుపుడు
సర్వజన మోక్షుడు
చక్ర దారుడు
గొల్ల భామల సేవితుడు
యశోద తనయుడు
వెన్న ముద్దల ప్రియుడు
వేద వేదాంగ ఘనుడు
విశ్వం నోట చుపిన దేవుడు
విష్టను రుపుడు  

Friday 3 March 2017

చక్వ వీణ మహరాజు

చక్వ వీణ మహరాజు 

ఎందరో రారాజులు మన భరత భుమిలో రాజ్యలను పరిపాలించారు వారిలో ఒకరైన ఈ చక్వ వీణ మహరాజు మంచి పరిపాలన మరియు కష్ట జివి ఇతని చేతులతో పండించిన  పంటను మాత్రమే తింటు మిగిలిన సంపదను ప్రజలకు దాన ధర్మాలకు ఉపయోగిస్తు తన రాజ్యాని పరిపాలిస్తు ఉండేవాడు ఇతనికి భార్య ఉంది ఈ రాజ్యము ఎపుడు సిరి సంపదలతో ,పాడి పంటలతో విరాజిలుతు ఉంది ఒకనాడు ఈ రాజ్యం లోని సమంత రాజులను వారి భార్యలను భోజనానికి ఆహ్వానం చేశాడు అందరు పట్టు వస్త్రాలు ,బంగారు నగలు ధరించి వచ్చారు చక్వ వీణ మహరాజు వాని భార్య మాత్రం నార చిరాలు ధరించి ఉండగా సమంత రాజుల భార్యలు వచ్చి మహారాణితో మాటల మధ్యలో ఈ రాజ్యానికి పట్టపు రాణివి కధ నీవు ఈ దుస్తులు ధరించవు ఎందుకు అని అడిగారు విందు కారిక్రమం అయిపొయింధి అందరు వెళిపోయిన తరువాత చక్వ వీణ మహరాజు ని రాణి నను అందరు అవహేళనగా మాట్లాడారు నాకు పట్టు దుస్తులు ,బంగారు ఆభరణాలు ధరించాలి అని ఎంత చేపిన వినకుండా రాజుకు మొరపెట్టుకుంది దానితో చక్వ వీణ మహరాజు సభ ఏర్పాటు చేసి మన చుట్టు పక్కల అందరిలో ఎక్కువగా ఎవరు పాపాలు చేశారో చెప్పండి అని అడుగగా అపుడు ఈ రాజ్యానికి దగ్గరగా ఉన్న లంకా నాధుడు ఐన రావణ బ్రహ్మ పేరు చెప్పారు వెంటనే వారి రాజ్యం లోని దూతను పిలిచి నీవు పోయి రావణ బ్రహ్మ దగ్గర నేను బంగారు మరియు ధనము అడిగి తీసుకొని రా అని ఆ దూతను పంపినాడు ఒకవేళ నేను అడిగినది ఇవ్వక పోతే యుద్ధనికి సిద్ధంగా ఉండమని హెచ్చరించు అని దూతను పంపినాడు ఆ దూత పరమ శివుడు పిలిస్తే పలికే ఆ రావణ బ్రహ్మ నిండు సభలోకి ప్రవేశించాడు అందరి సమక్షంలో చక్వ వీణ మహరాజు చేపిన విధంగా రావణ బ్రహ్మకు చెప్పాడు అది విన రావణుడు పకపక గట్టిగా నవి అష్ట దిక్పాలకులు చక్రవర్తులు , దేవతలు నను ఏమిచేయ లేక నాకు బానిసలుగా ఉంటె నామీద కు యుద్ధనికి వస్తాడా అంటు యెలనగా  మాట్లాడి నువ్వు దూతగా రాకపోతే ని తల నెల మీద పడుండేది అని సభను రేపటికి వాయిదా వేశారు దూతగా వచ్చిన వెక్తి దగ్గరగా ఉన్న సముద్ర వడ్డున పోయి కూర్చున్నాడు సాయంత్రము రాణీవారు రావణాసురుడు కోటపైకి ఎక్కి కూర్చొని ఉండగా సముద్రము వడ్డున కూర్చున దూతను చుచి రావణుని అడిగింది అపుడు రావణుడు సభలో జరిగినది అంత వివరించాడు అపుడు రానివారు ప్రభు నేను చక్వ వీణ మహరాజు గురించి విన్నాను అతనికి అడిగినది ఇచ్చి పంపించండి అని కోరింది రావణుడు కుదరదు అని చెప్పగా రాణి గారి దగ్గరలో ఉన్న బియ్యపు గింజలు తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న పావురాల మధ్యలో కి విసిరి ఈ గింజలమీద అన చక్వ వీణ మహరాజు మీద ఓటు వీటిని తింటే వాటి తల వేయి ముక్కలు అవుతుంది అని చెప్పగా ఆ పావురాలు వాటిని ముట్టలేదు ఒక్క చెవిటి పావురం తినగానే దాని తల వేయి ముక్కలు అయింది మరల గింజలు విసిరి చక్వ వీణ మహరాజు  మీద అన వీటిని తినక పోతే తలలు వేయి ముక్కలు అవుతాయి అనగానే అక్కడ ఉన్న గింజల్ని తేనేస్తాయి మరల గింజలను చలి రావణ బ్రహ్మ మీద అన వీటిని తెంటే మీ తలలు వేయి ముక్కలు అవుతాయి అని చెప్పగా అన్ని పావురాలు అక్కడున్న గింజలను తేనేస్తాయి ఇప్పుడైనా అతను ఎంత గొప్పవాడో చూడు అని చెప్పగా ఐన రావణ నేను వినను అని చెప్పాడు మరుసటి రోజు సభకు ఆ దూతను పిలిచారు ఆ దుతకు నేను ఇవ్వను అని చెప్పడంతో ఆ దూత రాజును ఆ సభలోని వారిని నాతో సముద్రము దగ్గరకు రమని పిలిచాడు అక్కడ రాత్రంతా రావణాసురుడి కోట లాగ ఇసుకతో చిన్నదిగా నిర్మించి ఉన్న దాగరకు అందరిని తీసుకొని పోయాడు అపుడు రావణాసుర ఇస్తావా ఈయవ అని అడిగాడు నేను ఇవ్వను అనగానే చక్వ వీణ మహరాజు మీద అన ఈ గోడ కూలి పోవాలి అని తోయగా అక్కడ కోటాలో ని ఒకగోడ కూలి పోతుంది మరల అడుగుతాడు దూత నేను ఇవ్వను అనగానే మరల చక్వ వీణ మహరాజు  అన అని మరొక గోడను తోయడంతో కోటలోని మరొక గోడ కూలిపోతుంది దానితో రావణుడు ఆ దూతను కోటలోకి ఆహ్వానించి అతను కోరిన సంపదలను ఇచ్చి పంపుతాడు అవని తీసుకొని చక్వ వీణ మహరాజు దగ్గర అప్పగిస్తాడు అపుడు రాణిని పిలిచి దూత రావణ సభలో జరిగినది చేపు అని అంటదు అక్కడ జరిగినది  రాణికి వివరిస్తాడు దానితో నాభర్త ఇంత నిజాయితీ పరుడా అని తెలుసుకొని దూత తెచ్చిన సంపదను తిరిగి ఇచ్చేయమని కోరింది రాజు గారి నిజాయితీ ఎంత గొప్పదో చుడండి 


తిరుమల వాసుని మెటు మెటు కి మోక్షం


మెటు మెటు కి మోక్షం 

 "పాట రాసింది "

చెర్లో హైమావతి గారు ,

"గానం "

సురి శ్రీదేవి గారు ,చలంచర్ల పద్మావతి గారు . 


Wednesday 1 March 2017

యద్ భావం తత్ భవతి


యద్ భావం  తత్ భవతి 

వజ్రాయుధం , వేయి నేత్రాలు కలిగి ఉన్న అమరాధిపతి ఐన అమరేంద్రుడి సభ ప్రాంగణం లో అష్టదిక్పాలకులు ,మహర్షులు ,ఎందరో మహానుభావులు కలరు ఆ సభకు దగ్గరగా అమరేంద్రుడి నందనవనం ఉంది అందులో మహా శెక్తి వంతమైన వృక్షంలు  కలవు పారిజాత వృక్షం, కల్ప వృక్షం ఇంకా ఎనో శేక్తి వంతమైన వృక్షంలు కలవు వీటికి కామరూపం దాల్చే శేక్తి ఉంది  ఆ వృక్షం క్రింద ఉండి  మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇలా కొంత కాలం తరువాత  భూలోకం లో  ఒక అరణ్యములో ఒక బాటసారి ఆకలి , దపిక  మరచి ప్రయాణం సాగిస్తు ఉండగా అతి భయంకరమైన ఆ అరణ్యములో నడవడం కష్టం ఐన ఆ బాటసారి ప్రయాణం సాగిస్తు చాలా దూరం ప్రయాణం చేయగ ఆ అడవిని దాటి ఒక ఎడారిలో ప్రయాణం సాగిస్తు ఉన్నాడు కొంత సమయానికి అతనికి కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది ఎటుచూసినా ఒక్క చెట్టు కుడా కనపడలేదు మరలా కొంత దూరం ప్రయాణం తరువాత ఒక అందమైన ,పెద్దదైన , పచ్చటి ఒక వృక్షం కనపడింది అక్కడకు వెళ్లి ఆ చెట్టుక్రింద కుచున్నాడు కొంతసమయానికి అతనికి ఆకలి వేసింది అపుడు ఆ బాటసారి ఆకలిగా ఉంది మంచి భోజనం దొరికితే బాగుంటుంది అని అనుకోగా అతని ముందు రుచికరమైన భోజనం ప్రత్యక్షము ఐనది అతడు వచ్చినదే తడువుగా దానిని భుజించినాడు తరువాత కొంత సమయానికి హయిగా నిధర పోయేందుకు ఒక తల్పం ఉంటె బాగుండేది అని అనుకున్నాడు అది ప్రత్యక్షము ఐనది అతడు వచ్చినదే తడువుగా దాని మీద పడుకున్నాడు కొంత సమయానికి అతనికి ఆశ్చర్యం వేసి నిదరలోంచి లేచి నేను అనుకున్నది అనుకున్నటుగా నాముందు ఉన్నాయి కదా ఒకవేళ నేను ఉన్న వృక్షం  రాకాసి  వృక్షంమా అనగానే వెంటనే ఆ వృక్షం  రాకాసి రూపం లో కి మారి పోయింది ఒకవేళ నను మింగేస్తుందా అనగానే ఆ వృక్షం  అతనిని మింగేస్తుంది ఆ వృక్షం  మే కల్ప వృక్షం  కామరూపములో అక్కడ ఉంది మనం వృక్షం  క్రిందకు వెళ్లి మనం  కోరిన విధం గా మనకు వరాలను ఇస్తుంది మన బాటసారి ఏవిధంగా అనుకున్నాడో అవి అన్ని నెరవేర్చింది 

సర్వ సుందర చిదంబర

చిగురించు నినర్తనం  ఈ  చిదంబరం
చిరుమందహాస  చిదంబర వాస
చింతను తీర్చు చిదంబరేశ
ఢమరుక నాదముతో ధరణి నేలు ఈశా
సర్వ సుందర చిదంబర 

నిత్య నర్తన నవయవన తేజో రూప నాట్య స్వరూప నటరాజ