శివ అక్షర సాధన
మంత్ర , తంత్ర , యంత్రము లతో పూజించు ఆ పరమ పురుషుని అక్షర మాల సాధన నిరంతరం (నా చిన్న ప్రయత్నం )
Thursday, 2 March 2023
Tuesday, 7 September 2021
గురుబోధ
'ఆ'శ ,వ్యామోహం ను అంతము చేయు వారు గురువులు,
'ఇం'ద్రియములను జయించే శేక్తి నిచ్చు వారు గురువులు,
'ఉ'పదేశముతో ఉచ్చస్థితిని అనుగ్రహించు వారు గురువులు,
'ఏ'క కాలమున తనువు మనసు ఏక మయి శేక్తిని అనుగ్రహించు వారు గురువులు,
'ఓ'ర్పు సహనమును అనుగ్రహించు వారు గురువులు,
'కా'మ, క్రోధ, మద , మాచర్యలను మట్టుపెటు వారు గురువులు,
'గ'ర్వమును గెలిచే శేక్తిని ఇచ్చు వారు గురువులు,
'జ'ప తప నియమాలను అనుగ్రహించు వారు గురువులు,
'చ'రా చర జగత్తు గమనమునకు ములం అయిన వారు గురువులు,
అంతటి గురు దేవునకు నిత్యము,అనుక్షణము వారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారములు
నా గురుదేవులు అయిన స్వామికి మనసా ,వాచా , కర్మాణ నా శిరశు వంచి నమస్కరించు మీ దాసుడను
Monday, 6 September 2021
కాశి విశ్వం
శివమ్ కాశి , కాశి శివమ్ , నమః కాశి , కాశి నమః , జపం కాశి, కాశి జపం , తపం కాశి, కాశి తపం ,
స్వరం కాశి, కాశి స్వరం, జగమ్ కాశి, కాశి జగమ్,
అంతయు నీవు అంతిమ న అక్కున చేర్చు అనంత లోకం కాశి క పురాధీశుడవు నీవు కాశి నువు
ఓం నమశ్శివాయ శివాయనమః
న - నలుదిక్కుల నిండి నిబిడీకృతమైన లింగం ఆకాశలింగం ,
మ - మన్వంతరాల నుండి మానవ మనుగడ నీవైఉన్నలింగం భూలింగం,
శి - శిఖరమై శిఖరాగ్రం నీవై వెలుగునిచ్చు లింగం అగ్నిలింగం,
వా - వానవై , వరదవై , వాగువై విశ్వ మంతా నిండివున్న లింగం జలలింగం ,
య - ఎనిమిది దిక్కులు నీవై యావత్తు నీవై నిండివున్న లింగం వాయులింగం ,
'న ' కార , 'మ' కార , 'శి ' కార , 'వ ' కార , 'య ' కార సర్వకార సర్వేశ్వరుడవు సమస్తము నీవే సకలకార నిర్వికార స్వరూపుడవు నీవే ఓం నమశ్శివాయ శివాయనమః
Saturday, 21 August 2021
ముక్తి మార్గం
అరిషద్ వర్గములు అంతరించి న నాడు ఆత్మ ఆ పరమాత్మకు చేరువగు చున్నది ,
అండము లో పిండము వలే ఆత్మ బ్రహ్మాండము లో అంతయు అవరించును,
అది అంతము తానై అజేయుడవు నీవై ఆ చంద్ర తరర్ధము నిలిచెదవు
అది గురువులు నడిచిన దారి ,
మనందరికి ముక్తికి దారి ,
Monday, 19 July 2021
గురుదీవెన
నిర్మల మై నిశ్చల స్థితి లో నిలచిన నాడు నిగూడ మై న సత్యము దొరుకును
Tuesday, 20 April 2021
నమామి శ్రీ రామ భక్త హనుమధీశ్వరం
స్థితి ఖంఠంశజ అజేయం , దైత్యంతక మహావీరమ్ జగత్ కల్యాణ కారకం
సౌమిత్రి ప్రాణ దాతం , సీత శోకనివారిత యశస్వి శ్రీరామ వరణనం
దుష్కర్మ నివారిత మారుతీ నామాంభృత తుల్యం , సంజీవిని ఆయువర్ధనం
సింధూర తిలకాంకిత నాగవల్లి పత్రర్చితం , అబేష్టిత అక్షయ వరప్రదం
భజేహం , భజేహం , శ్రీ రామ భక్త హనుమధీశ్వరం నమామి ప్రణమామ్యహం
Monday, 12 April 2021
గురు పాదం
అది అంతము లేని అది దేవత పాదం,
'ఆ' కార ' ఉ' కార 'మ' కార ఓం కార మునకు మూలం ఈ పాదం,
వేద పురాణ ములకు ముల మైన ముక్తి పాదం,
సద్ గురువులు సమస్తము నివని వేడుకను సచ్చిధానంద పాదం,
గుడి లో ఉంది గుండె గుండె లో కొలువైన పంచ బుతాత్మకుని భవ్య పాదం,
నాయనర్లు నమిన నవ యవ్వన పాదం,
నిర్వి కార సర్వ కార సమస్తము నీవై నిండి నిబిడికృతమై న నిలకంఠుని పాదం,
ఓం నమశివయ హర హర సద్ గురవేన మహా
Sunday, 17 January 2021
త్రిశక్తి అష్టోత్తర స్తోత్ర రత్నములు
1. సర్వసముద్బవకారిణి, శతకోటి సహస్రనామిని సకల గుణాత్మికి సుచ్చరితే ,సర్వసంక్షోభిత శోకనివారిణి, శతత హస్తాభిష్టిత ఫలప్రదాయని కాత్యాయిని గౌరి కామాక్షి , కారణమూర్తివి శివకామిని , తాండవ కేలికవే, భయకంపిత రూపిణి బాహుబలశ్యాలిని సింహపువాహినివె భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని
2. కేధరీశ్వరిఅలంపురి శ్రీ రాజరాజేశ్వరీ , మోక్ష సాగరి ప్రయాగే కాశీపురి, మంగళ గౌరిమాత అన్నపూర్ణేశ్వరి భార్గవి భవ్య భవనానంద దీపాంకురి , బ్రహ్మాండ బాండోదరి నవయవని శుభకరీ చాముండేశ్వరి వైష్ణవి వాసవి కన్యకపరమేశ్వరి , జ్ఞానప్రసూనాంబికేశ్వరి త్రయంబకి కౌమారి , అంబాబగళ జ్వాలాముఖి భైరవి ఉమామహేశ్వరి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని
3. బ్రంహి బ్రాహ్మణి బ్రహ్మతమికి విధాత్రి విశ్వనేత్రిని , సుష్టిస్థితిలయకారిణి సదాభూతేషు సహా ధర్మచారిణి , విశ్వవందేవింధ్య వాసిని, ఓంకారేశ్వరి హిరణ్యేలలితా భవాని యశశ్వి విశ్వేశ్వరి విశ్వరూపిణి సర్వాలంకృత నవరత్న భరణి , శోబాంకిత సర్వమంగళకారిణి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని
4. మృడాణి మహాచంద ప్రచండి హుంకరిణి , త్రిపురాంతకి మహాకాళి రౌద్రరూపిణి , రుద్రాణి , పరాశెక్తి ప్రళయాగ్నిహోతి అగ్నిపుత్రి లోకపావని నిఖిలేశ్వరి సర్వభూతాని , యోగీశ్వరీ యోగమాయి కేశవగ్రజధారిణి , రసఙ్ఞాననాధలోచిత వేదవేదాoగాది వేదజనని త్రికాలే బ్రహ్మజ్ఞాన నేత్రిణి సకల కళసరళి తగుణగణి , వ్యాస వాల్మీకాది మదిపద లావణ్య జ్ఞానతరంగిణి , వాగ్ధయని శ్రీవాణి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని
5. కారుణ్య లహరి శివకామేశ్వరి కళ్యాణి, భువనత్రయమణికుండల మండితమధుస్యలిని , ఇంద్రకీలాద్రిని దుర్గాభవాని కళత్రితేజోవతి మనస్వికలశస్థాపిత స్వరూపిణి , మాణిక్యంబిక త్రిపురసుందరి త్రిశేక్తి మూలకారిణి , పంచాక్షరీబ్రామరీకైవల్య ఫలప్రదాయని సహస్రక్షి బహుముఖకరచరణాయుధాది అభయహస్తిని , ఆశ్రితకల్పకోటి యుగదాయని కరుణాతరంగిణి , దివ్యతేజో విరాజితానందదీప్తిని విశుద్ధచక్రంనివాసిని భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని
6. సతీదక్షయఙ్ఞహుతి హిమసుతి శివ అర్ధనారి , అగ్రపూజాంకితసుత సౌభాగ్య ఫలప్రద ఆర్తరక్షని , నిష్కళంకిత సత్యవాణి నిత్యపారాయణిదారిద్య దుఃఖదాహాని అష్టాదశ శెక్తిరూపిణీ నిత్యానంద సందాయని , వేదమయి యజ్ఞప్రియ మహామంత్రమూర్తిణి , ఓంకారబీజాక్షరీ మహాశేక్తి ఛైతన్యకీర్తివర్దిని కోటిసూర్యసమప్రభావిత స్వయం ప్రకాశిని , లోకోత్తర గర్విణి విశ్వమోహిని , పంచభూత విలక్షణి దైత్యహంత్రీ విజయేశ్వరి మహిషాశురమర్ధిని భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని
7. ఓం , ఐం ,హ్రీ0, శ్రీ0 , మహామంత్రాక్షరి ఆద్యంతరహితేత్రిమాతృకి , త్రికూటే తీపురేశ్వరి మాతజగజననీ శివాని , త్రైలోక్య కుటుంబిని త్రిలోచని మహసాంబ్రాజదాయని నిగమాంత సంచారిణి హరిబ్రహ్మేంద్ర వందిత శ్రీ నారాయణి , సురాసుర దేవగణాధి సేవిత అఖిలాండేశ్వరి కరుణాపూరిణి , లోకానుగ్రహకారిణి మాధవేశ్వరి మీనాక్షి గిరిజాఓడ్వాణి విశ్వతోముఖీపరంజో
తి పంచముఖ గాయత్రి వరదాభయికౌముది ,జ్ఞానవికాశిత వేదాత్మికి జాహ్నవి శత్రువినాశిని శ్యాంబవి భద్రకాళి మహోగ్రరూపిణి దైత్యదమని, భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని
8. కర్మాకర్మ వివర్ధితే ఆత్మ మోక్షాకరీ వారణాసి జలవైభవి , సర్వార్ధసంధార్తి విశాలాక్షి సర్వవ్యాపి మహావిభవి, భవద్ భవ్య భూతగనాదిపతే స్కందసుతే సర్వోన్నత సనుతి యుగేయుగే , మహత్హృష్టాను గ్రహకారిణి గురుమండలవాసిణి కామిని కామదాహాని భవ బంధవిమోచని , వజ్రేశ్వరి వారాహి వైజయంతి ప్రజున్మే శేక్తి పిటెం పురుహితి కావేకవీరే సకలచరాచర జగత్ జగత్ స్థితి శాంకరి సుమనోహారి బక్తగ్రేశ్వరి , చంద్రమౌళి భానుమండలవాసిని లోకశోక నివారిణి , బ్రహ్మాండ రూపిణి విశ్వజనని ప్రణతోష్మీమాత శ్రీ చరణి భగవతి శ్రీచక్ర నిక్షిప్త త్రిశక్తినీ , సకలబిష్టిత సర్వరుపిని రాపుర స్థలవాసిని పర్వతవర్దిని పసుపత్ని
పలస్తుతి
కుంకుమ శోభిత వాచలితే వారసుబితిని బాపుగదే
సతిపతి క్షేమము కోరుగదే , జీవిత నావను నడుపుదువే
జయజయహే శివశంకరి మగువ మనోగ్నివి మంగళగౌరి జయదుర్గే
నమస్తే నమస్తే రామనాథ సమేత శ్రీ పర్వతవర్దిని నమోస్తుతే
Friday, 20 November 2020
శివ పాధాష్టకమ్
శివ పాధాష్టకమ్
జన్మజదుఖనివారిత పాదం
1) త్రిమూర్తత్మకమహా పాదం , అధి భిక్షువుని అనంత పాదం
ముజ్జగములనేలెడిముక్కంటుని పాదం , ఆహారహామెలిగేడిదినకర పాదం
ధరణిదారిద్యదుఖ;నివారిత పాదం , ఘనాఘనుడిదివ్య పాదం
శరణాశ్రీతసంరక్షిత పాదం
2) రౌద్రరూపితరుద్రపాదం , వీరభద్రునిపాదం
కాలాత్మకపాదం , సకలవిపత్ నివారితపాదం
పంచభూతేసునిపవిత్ర పాదం , అజ్యంతరహితునిఅద్భుత పాదం
శరణాశ్రీతసంరక్షిత పాదం
3) మోహినీసమొహితపాదం , అసురభస్మాంతకపాదం
నిష్కళంకితనిత్యసత్యపాదం , పురాణపురుషునిపుణ్యపాదం
అన్నపూర్ణేషునిఅపూర్వపాదం , బష్మభూషితభాగ్యపాదం
శరణాశ్రీతసంరక్షిత పాదం
4) గరళకంఠునిఅమృత పాదం , అర్ధనారీశునిఅభయ పాదం
మహాశేక్తిఛైతన్య పాదం , సర్వసముద్బవసంజీవిని పాదం
కన్నప్పనేలినఅమోఘ పాదం , భక్తవత్సలునిభవబయహర పాదం
శరణాశ్రీతసంరక్షిత పాదం
5) మృత్యంజయేశునిజయవిజయపాదం,ఆర్తినిబాపేడుత్రినేత్రునిఅక్షయ పాదం
శరణాశ్రీతసంరక్షిత పాదం
6) శానికాదిమునిముక్తులవందిత పాదం , సాధుజనసంరక్షిత పాదం
దేవముని ప్రవరార్చిత పాదం, గాండీవికి విజయాస్త్రమొసగిన పాదం
అసురకులాంతక హనుమత్ పాదం , రతీ శోకనివారిత పాదం
శరణాశ్రీతసంరక్షిత పాదం
7) నవ్య నాట్య నటశేఖర పాదం , శేశిదరేశుని కాంతి పాదం
విశ్వజనకుడి సహస్రాక్షునినిర్మల పాదం , జన్మకడతేర్చుధర్మ పాదం
విశ్వనాధునివిలక్షణ పాదం , మోక్షమోసెగెడి ముక్తి పాదం
శరణాశ్రీతసంరక్షిత పాదం
8) త్రివిష్టశునివిశిష్ట పాదం , పుణ్యజలేషునిదుష్ కర్మనివారిత పాదం
పరాశరేశుని పావన పాదం , ధన్వంతరేశుని ధన్య పాదం
శేక్తి పాదం శివ మూర్తి పాదం , కైవల్య మొసగెడి భవుని పాదం
శరణాశ్రీతసంరక్షిత పాదం
పలస్థుతి
శివపాదయుగళార్చిత పటేనీత్యం
పరమ్ త్ కృష్టానుగ్రహిత వరప్రద శ్రీ చరణారవిందం
జగత్ పీతం , శివోహం , శివోహం , శంభో ఉమాపతిo
రచన
చెర్లో హైమావతి
Wednesday, 30 September 2020
Thursday, 10 September 2020
సూళ్లురుపేట చెంగాళమ్మ సృష్టి అంతటా ని మాయే కద్దమ్మ
Sunday, 6 September 2020
అగస్య ముణి గుటక నుంచి జాలువారిన ఘటిక సిద్దేశ్వర లింగం
అగస్య ముణి గుటక నుంచి జాలువారిన ఘటిక సిద్దేశ్వర లింగం .
పున్నమి వెన్నెలలో పురివిప్పు నాగమ్మ పూజలందుకొను వాని క్షేత్రం,
అరణ్యము లో ఆధి దంపతులు అంతట నిండి నిబిడీ కృతమైవున్న క్షేత్రం,
ఉదయగిరి కొండల నడుమ కోటికాంతులతో కొలువైవున్న క్షేత్రం,
పదునాలుగు భువన బాండములను పాలించెడి వాని క్షేత్రం,
త్రిమూర్తులు తిష్టవేసుకొని తీరని కోరికలు తీర్చు క్షేత్రం,
ముజ్జగములకు మూలకారకుడు వెలసిన క్షేత్రం,
అమ్మ ఇష్టకామేశ్వరి గా ఇల వెలసిన క్షేత్రం,
అగస్యముని అహోరాత్రులు ఆరాధించిన అద్భుత క్షేత్రం,
అను నిత్యము ఆకలి దప్పికలు తీర్చు ఆదిదంపతులు అవతరించిన క్షేత్రం,
అవధూతలకు ఆలవాలమైన క్షేత్రం,
అలుపెరుగని జలధారలతో నంది వాహనుడు వెలసిన క్షేత్రం,
వీరభోగ వసంతరాయులు విరాజిల్లు క్షేత్రం,
సిద్ధపురుషులు సిద్దులు పొందిన సిద్ధేశ్వరుని క్షేత్రం,
కొండ కొనలలో కోటి సూర్య కాంతులతో కొలువైన క్షేత్రం,
ఈ క్షేత్రం ఘటిక సిద్ధేశ్వరుని క్షేత్రం,
ఓం నమః శివాయ
Thursday, 16 April 2020
Thursday, 12 March 2020
గురువులకు గురువు జగత్ గురువు
Monday, 24 February 2020
Wednesday, 25 September 2019
ఓం నమశ్శివాయ
ముకోటి దేవతలు అనుక్షణం అనుకొనేడి మంత్రం