Sunday 6 September 2020

అగస్య ముణి గుటక నుంచి జాలువారిన ఘటిక సిద్దేశ్వర లింగం

అగస్య ముణి  గుటక నుంచి జాలువారిన  ఘటిక సిద్దేశ్వర లింగం .  

 పుట్టుకలేని పురుషోత్తముడు పుడమిపై వెలసిన పుణ్య క్షేత్రం ,

పున్నమి వెన్నెలలో పురివిప్పు  నాగమ్మ పూజలందుకొను వాని క్షేత్రం,

అరణ్యము  లో ఆధి దంపతులు అంతట నిండి నిబిడీ  కృతమైవున్న క్షేత్రం,

ఉదయగిరి కొండల నడుమ కోటికాంతులతో కొలువైవున్న క్షేత్రం,

పదునాలుగు భువన బాండములను పాలించెడి వాని క్షేత్రం,

త్రిమూర్తులు తిష్టవేసుకొని తీరని కోరికలు తీర్చు క్షేత్రం,

ముజ్జగములకు మూలకారకుడు వెలసిన క్షేత్రం,

అమ్మ  ఇష్టకామేశ్వరి గా  ఇల వెలసిన క్షేత్రం,

అగస్యముని అహోరాత్రులు ఆరాధించిన అద్భుత క్షేత్రం,

అను నిత్యము ఆకలి దప్పికలు తీర్చు ఆదిదంపతులు అవతరించిన క్షేత్రం,

అవధూతలకు ఆలవాలమైన క్షేత్రం,

అలుపెరుగని జలధారలతో నంది వాహనుడు వెలసిన క్షేత్రం,

వీరభోగ వసంతరాయులు విరాజిల్లు క్షేత్రం,

సిద్ధపురుషులు సిద్దులు పొందిన సిద్ధేశ్వరుని క్షేత్రం,

కొండ కొనలలో కోటి సూర్య కాంతులతో కొలువైన క్షేత్రం, 

                              

      ఈ  క్షేత్రం ఘటిక సిద్ధేశ్వరుని క్షేత్రం,

       ఓం  నమః శివాయ 

 

No comments: