Thursday 10 September 2020

సూళ్లురుపేట చెంగాళమ్మ సృష్టి అంతటా ని మాయే కద్దమ్మ

 

సూళ్లురుపేట చెంగాళమ్మ సృష్టి అంతటా ని మాయే కద్దమ్మ 

సుభగిరి పట్టణంలో శుభములనొసగు సృష్టికారిణివి నీవు ,
నిత్య మై సత్యమై నిలువెత్తు నిదర్శనం నీవు , 
కాళింగి నదీతీరాన కోటి కాంతులతో కదిలాడు దైవం నీవు ,
సకల శక్తుల  సమ్మెలనమైన చాంగాలమ్మవు నీవు ,
సుడిమాను చుట్టు తిరగంగా సృష్టిని యేలేవు సూళ్లూరు చెంగవ్వ వు  నీవు , 
కనులార చుచిన చాలు కనువిప్పు గావించు కలియుగ దైవం నీవు ,
ముడుపు కట్టిన చాలు ముందుండి నడిపించు దైవం నీవు ,
మృచివు నీవు మోక్షమార్గము నీవు ముగ్గురమ్మల మూలము నీవు ,
ధరణి నేలగ దక్షణ ముఖముతో దరిశన మిచ్చు దక్షణ కాళికవు నీవు , 
అష్ట శెక్తులతో అష్ట భుజములతో అష్ట దశ పీఠముల స్వరూపము నీవు ,
పులివాహనం పై పుడమినేలు పురుషోత్తముని పట్టపు రాణివి నీవు ,
సకల దేవతల సమ్మెళనం ఐ  సూళూరుపేటలో వెలసిన  చంగాలమ్మవి నీవు ,
నిమ్మ దండలు వేయంగా నిజరూప దర్శన మిచ్చే వు మాయమ్మ వి నీవు ,
దినా  జనులను పాలించగ వెలసిన దివ్య తేజో స్వరూపిణి వి నీవు ,
జగ జనని శ్రీ శ్రీ శ్రీ  చెంగాళ పరమేశ్వరి మాత 
రక్షమాం  రక్షమాం  రక్షమాం 



No comments: