మంత్ర , తంత్ర , యంత్రము లతో పూజించు ఆ పరమ పురుషుని అక్షర మాల సాధన నిరంతరం (నా చిన్న ప్రయత్నం )
Wednesday, 30 September 2020
Thursday, 10 September 2020
సూళ్లురుపేట చెంగాళమ్మ సృష్టి అంతటా ని మాయే కద్దమ్మ
Sunday, 6 September 2020
అగస్య ముణి గుటక నుంచి జాలువారిన ఘటిక సిద్దేశ్వర లింగం
అగస్య ముణి గుటక నుంచి జాలువారిన ఘటిక సిద్దేశ్వర లింగం .
పున్నమి వెన్నెలలో పురివిప్పు నాగమ్మ పూజలందుకొను వాని క్షేత్రం,
అరణ్యము లో ఆధి దంపతులు అంతట నిండి నిబిడీ కృతమైవున్న క్షేత్రం,
ఉదయగిరి కొండల నడుమ కోటికాంతులతో కొలువైవున్న క్షేత్రం,
పదునాలుగు భువన బాండములను పాలించెడి వాని క్షేత్రం,
త్రిమూర్తులు తిష్టవేసుకొని తీరని కోరికలు తీర్చు క్షేత్రం,
ముజ్జగములకు మూలకారకుడు వెలసిన క్షేత్రం,
అమ్మ ఇష్టకామేశ్వరి గా ఇల వెలసిన క్షేత్రం,
అగస్యముని అహోరాత్రులు ఆరాధించిన అద్భుత క్షేత్రం,
అను నిత్యము ఆకలి దప్పికలు తీర్చు ఆదిదంపతులు అవతరించిన క్షేత్రం,
అవధూతలకు ఆలవాలమైన క్షేత్రం,
అలుపెరుగని జలధారలతో నంది వాహనుడు వెలసిన క్షేత్రం,
వీరభోగ వసంతరాయులు విరాజిల్లు క్షేత్రం,
సిద్ధపురుషులు సిద్దులు పొందిన సిద్ధేశ్వరుని క్షేత్రం,
కొండ కొనలలో కోటి సూర్య కాంతులతో కొలువైన క్షేత్రం,
ఈ క్షేత్రం ఘటిక సిద్ధేశ్వరుని క్షేత్రం,
ఓం నమః శివాయ