Sunday, 2 April 2017

సదాశివ ని మహిమ


సదాశివుని మహిమ 
 నీ సిగనుండి గంగమ్మను ఈ భువికి నొసగిన నీ  మహిమ 
హర హర అన్న వానికి అభయమిచ్చు నీ మహిమ 
హలాహలమును గరళములో దాచి జగత్తును కాచిన నీ మహిమ 
మార్కండేయునికి ముక్తి నొసగిన నీ మహిమ 
గణనాయకునికి గజముఖమును ధరింపజేసిన నీ మహిమ 
ఎందరో ముని జనులకు ముక్తి నొసగిన నీ మహిమ 
జగదాంబను నీలొ సగభాగము ఇచ్చి అర్ధనారీశ్వరునిగా చూపిన నీ మహిమ 
అఖిల లోకములను పాలించు నీ దివ్య మహిమ 
సకల భూత గణములు సేవించెడి నీ మహిమ 
ఎంత పొగిడిన చాలదు నీ దివ్య మహిమ  
ఓం నమః శివాయ అను నామమే ఎంతో మహిమ