Tuesday, 4 April 2017

అంత యింత కాదు అద్భుతమైనది శ్రీ రామ నామంఅంత ఇంత కాదు అద్భుతమైనది శ్రీ రామ నామం 
 హనుమంతుడు అనుక్షణము స్మరియించు శ్రీ రామ నామం
రావణ బ్రహ్మను రణరంగమున ఎదిరించిన నామం  శ్రీ రామ నామం
భద్ర గిరి పై వెలసిన బలే మంచి నామం శ్రీ రామ నామం
శబరి ఎంగిలి పండ్లు తినిన ఆ సర్వేశ్వరుని నామము శ్రీ రామ నామం
ఒకే మాట ,ఒకే భార్య ,ఒకే బాణం అన్న మహనీయుని నామం శ్రీ రామ నామం
సూర్య వంశ తేజోరూపుడైన వాని నామం శ్రీ రామ నామం
మహిమాన్విత నామం శ్రీ రామ నామం