త్రికరణ శుద్ధి తో దైవ సానిధ్యం
మంత్ర , తంత్ర , యంత్రము లతో పూజించు ఆ పరమ పురుషుని అక్షర మాల సాధన నిరంతరం (నా చిన్న ప్రయత్నం )
Monday, 27 February 2017
త్రికరణ శుద్ధి తో దైవ సానిధ్యం
కాల మానం లో కొన్ని సవంత్సరాలు వెనక్కి వెళితే ఒక రాజ్యం ఆ రాజ్యము లో ఒక గ్రామం అందులో ఒక సద్ బ్రాహ్మణుడు ఆయనకు ఒక కుమారుడు కలడు ఆ గ్రామంలో పౌరోహిత్యం చేసుకుంటు కాలం గడుపుతుండగా కొంత కాలానికి తన కుమారునికి పెళ్లి చేసాడు తరువాత కొంత కాలానికి బ్రాహ్మణుడు భార్య కాలం చేయడంతో వంటరిగా కాలం గడుపుతు ఉండగా సద్ బ్రాహ్మణుడు ఒక పొరపాటు చేసాడు దానికి ప్రయత్చితంగా గంగా నది లో స్థానం ఆచరించాలని తన జ్ఞానముతో తెలుసుకొని తన కుమారుడిని పిలిచి నాయన నావల్ల ఒక పొరపాటు జరిగింది అందుకు ప్రయత్చితంగా గంగా నదిలో స్థానమాచరించాలని బయలు దేరుతున్నాను అని బయలు దేరాడు బ్రాహ్మణుడు కొంత దూరం ప్రయాణించిన తరువాత ఒక నధి తారసపడింది బ్రాహ్మణుడు ఆ నది వడ్డున 5 సంవత్సరాలు కాలం జపం చేసుకుంటు ఉండగా అదే దారిన పోతున్న ఒక బ్రాహ్మణుడు కలిసాడు మాటల మధ్యలో అది గంగా నది కాదు అని తెలుసుకున్న బ్రాహ్మణుడు మరల బయలుదేరాడు కొంత దూరం ప్రయాణం చేయగా మరల ఒక నది ఒడ్డుకు చేరుకొని మరల 5 సంవత్సరాలు కాలం జపం చేసుకుంటు ఉండగా దారిన పోయే వారి ద్వారా తాను ఉన్న నది గంగా నది కాదు అని తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు మరల మరొక నది తీరానికి చేరుకొని అక్కడ 5 సంవత్సరాలు కాలం జపం చేసుకుంటు ఉండగా అది గంగా నది కాదు అని తెలుసుకొని మరల ప్రయాణించాడు కనుచూపు మేరలో గల గల పారె ఆ గంగమ్మ ప్రవహిస్తు వుంది దూరం నుంచి చూస్తూనే తన జీవాత్మ విడచి పోయింది వెంటనే అక్కడకు యమకింకరులు వచ్చి ఆ సద్ బ్రాహ్మణుడు ని తీసుకొని పోయి యమకింకర నాయకుడైన యమధర్మరాజు సభలో ప్రవేశ పెట్టారు యమధర్మరాజు చిత్రగుప్త ఇతని నేరములు తెల్పుము అని చెప్పగా ప్రభు బ్రాహ్మణుడు ఒక తప్పిదము చేసాడు కానీ 15 సవసరాలు గంగా నదిలో మునిగి జపం చేయడం వల్ల ఇతని పాపం పోయింది అని చెప్పగా అటులైన వెంటనే ష్వర్గలోకమునకు పంపుము అని యమధర్మరాజు చెప్పాడు
నామ మాత్రంగా చేస్తే ఫలితం అనుభవిస్తాడు.
Saturday, 25 February 2017
Sunday, 19 February 2017
ముక్కోటి దేవతలు ఊపేరు నీకు జయ లాలి
"పాట రాసింది "
చెర్లో హైమావతి గారు ,
"గానం "
సురి శ్రీదేవి గారు ,చలంచర్ల పద్మావతి గారు .
Saturday, 18 February 2017
గురు వాఖ్య కటాక్షమ్
"గురు వాఖ్య కటాక్షమ్ "
పాండవ రాజమ్ లో ఒక మారు ముల ప్రాంతం లో ఒక ఆశ్రమము నందు గురువు గారు సేవ చేసుకుంటు ఒక శిశుడు ఉండేవాడు కొంత కాలం తరువాత వీరిద్దరు ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నారు కొంత సమయం తరువాత గురువు గారికి దాహం వేసింది నాయన నాకు దాహం గా ఉంది నేను నడవ లేను నాకు మంచి నీరు తీసుకొని రా అన్నాడు గురువు అలాగే గురువుగారు అని బయలుదేరాడు శిశుడు చుట్టు ప్రక్కల చుసాడు కనుచుపు మేర ఎక్కడ నీరు కనపడలేదు ఆకాశం వైపు చుట్టు చుసాడు ఒక ప్రక్కన పక్షులు ఎక్కువ గా ఉండడం చుసి ఆ దిక్కు గా నడవసాగాడు ఇంతలో గురువుగారి మంత్ర సాధన వల్ల గురువుగారి అంతిమ సమయం దగ్గర పడిందని గురువుగారికి తెలిసింది ఎటు చుసిన శిశుడు జాడ కానరాలేదు అపుడు గురువుగారు నాకోసం ఎంతో కష్ట పడిన నా శిశుడు కి మంత్రోపదేశం చేయలేదు అని అలోచించి అక్కడకు దగ్గరగా ఉన్న ఒక గాడిదల కాపరి ఇన ఒక స్త్రీ ని చుసి ఆమెను పిలచి అమ్మ నా శిశుడు వస్తాడు వానికి ఇక్కడ మటిమీద రాస్తున్నాను చూపించు అని గురువుగారు కాలం చేసారు ఆమె అది గాలికి మట్టి రేణువులు పడి కనబడదేమొ అని దానిని తన చెవికి తాటి కులతో అలంకరించుకున్న ఆకుమీద గురువుగారు రాసినది ఎలావుందో ఆలా రాసుకుంది ఆమెకి చదవడం రాదు ఇంతలో ఆ శిశుడు కొలను దగ్గరకు పోయి ఒక తమర ఆకులతో నీరు తీసుకొని గురువు ఉన్న చోటికి వచ్చాడు గురువుగారు కాలం చేయడంతో బాధ పడుతుండగా అక్కడే ఉన్న ఆ స్త్రీ శిశుడు దగ్గరకు వచ్చి నిలబడింది అమ్మ మాగురువుగారికి ఏమైనది అంటు గురువు కి శిశుడు కి మధ్య జరిగిన దంత ఆమెకు వివరిస్తాడు దానితో ఆమె ఈ గురువుగారు రాసిన అక్షరాలను ఇస్తే మనకు ఏ\ఏముంటుంది కొద్దీ రోజులు ఇతనితో పని చేయించుకుందాము అని దురుదేశముతో మి గురువు గారు నాకు ఒకటి రాసి ఇచ్చారు అది నీకు ఈయ మనాడు అది నాదగ్గర ఉంది అది కావాలంటే నేను చేపినది చేస్తే ఇస్తాను అని చెపింది దానితో ఆ శిశుడు ఆమె చేపిన విదంగా ఆమె గాడిదలు కాసుకుంటు ఉండగా కొంతకాలానికి అతనికి తిండి పెట్టడం మానేసింధి ఐన ఆ శిశుడు ఆ గ్రామంలో బిక్షం ఎత్తుకొని తింటు ఆమె గాడిదలు మేపుతు ఉండగా ఆ రాజ్యము లో శ్రీ కృష్ట్నుడు ధర్మరాజు కలసి అశ్వ మేధ యాగం జరిపించారు యాగం పూర్తి ఐన తరువాత రాజ్య ప్రజలందరికీ అన్నదానం పెట్టాలి అని రాజ్య ప్రజలందరికీ దండోరా వేయించి ఆహ్వానం చేశాడు గీత సుష్టికర్త ఐన శ్రీ కృష్ట్నుడు ఒక మాయ గంటను కోటలో నిర్మించినాడు ఈ గంట ఒక లక్ష మంది ప్రజలు భోజనం చేస్తే ఒక సారి మొగుతుంది అని ఒక బటుడిని అక్కడ ఉంచి ఎన్ని గంటలు కోడుతుందో రాసుకో అని చేపినాడు ఇంతలో ఆ మాయ గంట గణ గణ ఆగకుండ మొగ సాగింది ధర్మరాజు బావ ఒక లక్షమంది తింటే ఒక సారి మోగుతుంది అని కధ నాకు చెప్పావు కాని ఆగకుండా మోగుతుంది ఏమిటి విచిత్రం అని అడుగగా చుదాము దా అని వచ్చారు మన శిశుడు ఆకలితో అక్కడ అన్నము వండగా పారబోసిన గంజను తాగుతున్నాడు ఎనో లక్షల మందికి వండిన అన్నపు గంజ తగినందువల్ల ఆ మాయ గంట మొగుతు ఉన్నది శ్రీ కృష్ట్నుడు గమనించి ఆ అన్నశాలకు ఆ స్త్రీ కుడ రావడం గమనించిన శ్రీ కృష్ట్నుడు ఆమె కుల వృత్తి దొమ్మరిసాని ఆమెను చుసిన శ్రీ కృష్ట్నుడు నీవు ఆ తీగ ఫై నడవగలవా అని అనడు ఆమె అలాగే స్వామి అని నడవ సాగింది శ్రీ కృష్ట్నుడు ధర్మరాజా నీవు రెండు వజ్రపు కమ్మలు తెపించు అన్నాడు వాటిని తీసుకొని రాగా వాటిని తీసుకొని ఒక కమ్మను గాలిలో కి ఎగరేసాడు శ్రీ కృష్ట్నుడు దానిని చుసిన ఆమె చేత్తో పట్టుకొని ఒక చెవి లో దాచుకుంది శ్రీ కృష్ట్నుడు మరొక కమ్మను విసిరి వేయగా దానిని మరొక చెవి లో ఉన్న ఆ ఆకు ను తీసి ఈ కమ్మను పెట్టు కుంది వెంటనే ఆ శిశుడు దానిని కింద పడ కుండ పట్టుకొని దాని లో వున్న మంత్రాన్ని చదవగా వెంటనే ఆ శిశుడు కి మోక్షం లభించింది
గురు ఉపదేశం ఎంత మహి మహిమానీతమో చుడండి
ఓం గురుదేవాయ నమో నమః
Friday, 17 February 2017
" బ " అక్షర శివ మంత్రం
" బ " అక్షర శివ మంత్రం
ఓం భద్రాయ నమః
ఓం బయంకరాయ నమః
ఓం భగీరథ సేవితాయ నమః
ఓం భజన ప్రియాయ నమః
ఓం భ్రమరాంబ మాలికార్జునయ నమః
ఓం బైరవ సేవితాయ నమః
ఓం భక్త ప్రియాయ నమః
ఓం భస్మ ప్రియాయ నమః
ఓం భ్రమర నాధాయ నమః
ఓం భస్మాసుర సేవితాయ నమః
ఓం బులోక జన సేవితాయ నమః
ఓం భుజగభూషణాయ నమః
ఓం భక్త కన్నప్ప సేవితాయ నమః
ఓం భక్తవ శంకరాయ నమః
ఓం బోళాశంకరాయ నమః
ఓం బిమేశ్వరాయ నమః
ఓం బుమండల అధిపతయ నమః
ఓం భూత గణాధి పతయ నమః
ఓం బాను కోటి సహస్ర తేజో లింగాయ నమః
చెర్లో నరేష్ ,
కావలి ,
సెల్ నెంబరు -9700020339
Tuesday, 14 February 2017
కాలజ్ఞాన బ్రహ్మ
కాలజ్ఞాన బ్రహ్మ
సమస్త లోకమునకు భవిష్య వాణి తెలిపిన శ్రీ కాలజ్ఞాన బ్రహ్మ
సాక్షాత్తు పరమ శివుని అంశతో పుటిన శ్రీ కలియుగ బ్రహ్మ
సర్వ సిద్దులు పొందిన శ్రీ సర్వేశ్వర బ్రహ్మ
మఠంలో మందిరంలో కొలువైన శ్రీ వీర బ్రహ్మ
సర్వము తెలిసిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మ
జీవసమాధి పొంది జనులకు ని జ్ఞానజోతి తో మార్గము చూపేడి దేవా
తిరిగి వచ్చేవు శ్రీ వీర భోగ వసంత రాయ నమో నమః
నిరాకకై ఎదురు చూస్తు మా ఈ జన్మ
చెర్లో నరేష్ ,
కావలి ,
సెల్ నెంబరు -9700020339
Sunday, 12 February 2017
Friday, 10 February 2017
మంత్రం కాదు ఇది మహిమానీతం
" మంత్రం కాదు ఇది మహిమానీతం"
మహిమ గల మంత్రం
మధురానుభూతి కలుగు మంత్రం
మరువలేని మంత్రం
మదిని దోచిన మంత్రం
మోక్ష మార్గపు మంత్రం
సర్వము ఐ ఉన్న మంత్రం
సర్వేశ్వరుని మంత్రం
భజన చేసేడి మంత్రం
బీజాక్షర మీ మంత్రం
కవులు కొనిఅడిన మంత్రం
మునులు సేవించేడి మంత్రం
వేదాంత సారమి మంత్రం
వేదమంత్రం
మంత్రము కాదు ఇది మహిమానీతం
ఓం నమశివాయ అను మంత్రం
చెర్లో నరేష్ ,
కావలి ,
సెల్ నెంబరు -9700020339
Thursday, 9 February 2017
శ్రీ గాయత్రి దేవి నమో నమః
శ్రీ గాయత్రి దేవి నమో నమః
ఆది శక్తివి నీవు శ్రీ గాయత్రి జగదాంబ
సప్త వేదముల సారం శ్రీ గాయత్రి జగదాంబ
వేదములకు మూలం శ్రీ గాయత్రి జగదాంబ
సర్వ దేవతలకు నీవే తల్లివి శ్రీ గాయత్రి జగదాంబ
సృష్టి కె ఆది దేవతవు శ్రీ గాయత్రి జగదాంబ
భవ భయ హారిణివి శ్రీ గాయత్రి జగదాంబ
అమ్మలగన్న అంబవు శ్రీ గాయత్రి జగదాంబ
నీ నామము స్మరించిన నా జన్మ తరించే నా తల్లి గాయత్రి సకల శుభ ధాత్రి
నమో నమః శ్రీ గాయత్రి మాత
Wednesday, 8 February 2017
"గ " అక్షర శివ మంత్రరం
"గ " అక్షర శివ మంత్రరం
ఓం గగన విహారయ నమః
ఓం గరళకంఠాయ నమః
ఓం గంగ నిలయయ నమః
ఓం గజేంద్ర జనకాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం గంబీరయ నమః
ఓం గంట నాధ ప్రియాయ నమః
ఓం గాన ప్రియాయ నమః
ఓం గంధర్వసేవితాయ నమః
ఓం గగణలింగాయ నమః
ఓం గౌరినాదాయ నమః
ఓం గయ నిలయయ నమః
ఓం గణ గణ ఢమరుక నాధాయ నమః
ఓం గిరిజ రామనామ నమః
ఓం గండశిల రూపాయ నమః
ఓం గిరి శిఖర నిలయయ నమః
"స " శివ అక్షర మంత్రం
"స " శివ అక్షర మంత్రం
ఓం సంగమేశ్వరాయ నమః
ఓం సంగమ నిలయయ నమః
ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః
ఓం సమస్తసద్గురువేయ నమః
ఓం సకలయ నమః
ఓం సర్వయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం సాలగ్రామ నివాసయ నమః
ఓం సప్తవర్ణ తేజో రూపాయ నమః
ఓం స్పటిక లింగాయ నమః
ఓం సకల లింగాయ నమః
ఓం సిగ గంగ అలంకారాయ నమః
ఓం సరోవర నివాసాయ నమః
ఓం సర్వ జన పోషకాయ నమః
ఓం సముద్ర సేవితాయ నమః
Monday, 6 February 2017
గురువుకే అది గురువు
భూమండలని భక్తి మార్గం లో నడిపించిన గురువు
అందరికి సమస్త సద్గురువు
దశోపనిసేత్ ను అందించిన గురువు
చిన్న వయసులో సన్యసించిన గురువు
కామకోటి పీఠాధిపతులలో ఒకరైన గురువు
శ్రీచక్రమును నిర్మించిన గురువు
శేక్తి పీఠాలను స్థాపించిన గురువు
శ్రీచక్రోపాసన చేసిన గురువు
పరమ శివుని దర్శించిన గురువు
పరమ శివుని నిలువెత్తు నిదర్శనం ఐన సద్ గురువు
గురువుకే అది గురువు
శ్రీ శ్రీ శ్రీ అది శంకరాచార్యులు నమో నమః
అంజనీపుత్ర
అంజనీపుత్ర
అతులితబలదమా అంజనీపుత్ర
వాయు సంచార అంజనీపుత్ర
శ్రీరామ దుత అంజనీపుత్ర
నిరంతర చిరంజీవ అంజనీపుత్ర
లక్స్మణ ప్రాణదాత అంజనీపుత్ర
లంకాదహన అంజనీపుత్ర
సిందురప్రియ అంజనీపుత్ర
సుగ్రీవ ప్రియా అంజనీపుత్ర
వారధి నిర్మాణ దేవా అంజనీపుత్ర
నిత్యబ్రహ్మచారి అంజనీపుత్ర
అఖిల విద్య సంపన్న అంజనీపుత్ర
నిత్య యవ్వన అంజనీపుత్ర
నిరంతర శ్రీ రామ నామ జప ప్రియా అంజనీపుత్ర
నమోనమః అంజనీపుత్ర
శివాలయ ప్రాంగణం
శివాలయ ప్రాంగణం
సర్వం సాలగ్రామమయం
సర్వం శివ శెక్తి మయం
సకల దేవత నిలయం
సర్వ భూత గణాలు నిలయం
నిత్య అభిషేకం
విబూది మయం
సప్త ఋషుల నిలయం
కాలబైరవ నివాసం
నందీశ్వర దర్శనం
ధ్వజస్తంభ ప్రకాశం
అంబ నిలయం
గాలిగోపుర దర్శనం
నవగ్రహ ఆరాధనం
నెమలివాహనుడి రూపం
గణేశ నిలయం
సర్వదేవతుల సమ్మెళనం
సమస్త పాపములు బాపు సర్వేశ్వరుని నిలయం
Thursday, 2 February 2017
సర్వం నీవమ్మా శ్రీ దుర్గమ్మ
శ్రీ దుర్గంబ నమో నమహ
అమ్మలు గన్న అమ్మ ఇంద్ర కీలాద్రిపై వెలసిన అమ్మ శ్రీ దుర్గంబ,
సింహ వాహనం ఫై ఆసీనురాలై ఉన్న శ్రీ దుర్గంబ,
శత్రు భయంకర సర్వపాప వినాశకర శ్రీ దుర్గంబ ,
ఇంద్రకీలాద్రి ఫై సర్వ శక్తీ రూపిణివి శ్రీ దుర్గంబ,
ముకంటి ప్రియ సకివి ముల్లోకములను యేలు శ్రీ దుర్గంబ,
నిత్యా అలంకార ప్రియా శ్రీ దుర్గంబ,
శ్రీ చక్ర సంచారిణివి అంబ నీవు శ్రీ దుర్గంబ,
ముగురమ్మల ముల శెక్తివి మహిమలెనో చూపు శ్రీ దుర్గంబ,
నవరాత్రి సేవలో నవ శెక్తులుగా కనిపించు శ్రీ దుర్గంబ,
ఆదిశేక్తివి నీవు గాయత్రి నీవు అంబవు నీవు జగదాంబవు నీవు శ్రీ దుర్గంబ,
సర్వం నీవమ్మా శ్రీ దుర్గమ్మ
Wednesday, 1 February 2017
" బ " అక్షరంతో శివ మంత్రం
" బ " అక్షరంతో శివ మంత్రం
ఓం బీజాక్షర సేవితాయ నమః
ఓం భగీరథ సేవితాయ నమః
ఓం భస్మా సుర వరదానాయ నమః
ఓం బిమేశ్వరాయ నమః
ఓం బిల్వాష్టక ప్రియాయ నమః
ఓం బిల్వప్రియాయ నమః
ఓం బీమ శంకరాయ నమః
ఓం బీష్మ సేవితాయ నమః
ఓం బీకర రుపాయ నమః
ఓం భీమ లింగాయ నమః
ఓం భూమండల ఆధిపథాయ నమః
ఓం భ్రమరాంబ ప్రియాయ నమః
ఓం భానుకోటి కాంతి రుపాయ నమః
ఓం భస్మాభి షెక ప్రియాయ నమః
నిరంతరం నినామమే శ్రీ కామాక్షితాయి
నిరంతరం నినామమే శ్రీ కామాక్షితాయి
కమనీయ రూపం నీది తల్లీ శ్రీ కామాక్షితాయి
కష్టములు బాపు శ్రీ కామాక్షితాయి
కలలో కనిపించి చుపేవు నిమహిమ శ్రీ కామాక్షితాయి
జొన్నవాడ క్షత్రములో వెలసిన శ్రీ కామాక్షితాయి
పెన్నమ్మ పులకించే ని నామ శబ్దాల తోటి శ్రీ కామాక్షితాయి
అది గురువు స్థాపించిన అద్భుత రూపం నీవమ్మా శ్రీ కామాక్షితాయి
నిమ్మ దండలు ని కిష్టమే తల్లీ శ్రీ కామాక్షితాయి
పరాశక్తి రూపాన వెలసిన పరం జోతివి శ్రీ కామాక్షితాయి
పదునాల్గు భువనాలను యేలు శ్రీ కామాక్షితాయి
కుంకుమార్చనతో కదలివచ్చేవు శ్రీ కామాక్షితాయి
ముక్కుపుడక తో మహిమ చుపేవు శ్రీ కామాక్షితాయి
పూల అలంకరణతో ప్రకాశించేవు శ్రీ కామాక్షితాయి
నిను నమిన భక్తులను అభయమిచ్చేవు శ్రీ కామాక్షితాయి
నింగినుంచి దిగివచ్చిన దైవం నీవమ్మా శ్రీ కామాక్షితాయి
నీవు నిలచిన నెల తాకిన చాలు పులకించెను మనసు శ్రీ కామాక్షితాయి
నిలువెత్తు శక్తీ తో కొలువున్న శ్రీ కామాక్షితాయి
అమరేశ్వరుని ఇష్ట సకివి శ్రీ కామాక్షితాయి
నవాభరణ పూజ చేసేము నీకు మాయమ్మ శ్రీ కామాక్షితాయి
భూత ,ప్రేతలు నిను చుడ భస్మమై పోయెను శ్రీ కామాక్షితాయి
నిస్తలమున నిదురించిన చాలు జన్మ జన్మ పాపాలు పోయెను శ్రీ కామాక్షితాయి ,
నిరంతరం నినామమే శ్రీ కామాక్షితాయి
Subscribe to:
Posts (Atom)