Monday, 27 February 2017

త్రికరణ శుద్ధి తో దైవ సానిధ్యం

త్రికరణ శుద్ధి తో దైవ సానిధ్యం 

కాల మానం లో కొన్ని సవంత్సరాలు వెనక్కి వెళితే ఒక రాజ్యం ఆ రాజ్యము లో ఒక గ్రామం అందులో ఒక సద్ బ్రాహ్మణుడు ఆయనకు ఒక కుమారుడు కలడు ఆ గ్రామంలో పౌరోహిత్యం  చేసుకుంటు కాలం గడుపుతుండగా కొంత కాలానికి తన కుమారునికి పెళ్లి చేసాడు తరువాత కొంత కాలానికి బ్రాహ్మణుడు  భార్య కాలం చేయడంతో వంటరిగా కాలం గడుపుతు ఉండగా సద్ బ్రాహ్మణుడు ఒక పొరపాటు చేసాడు దానికి ప్రయత్చితంగా  గంగా నది లో స్థానం ఆచరించాలని తన జ్ఞానముతో తెలుసుకొని తన కుమారుడిని పిలిచి నాయన నావల్ల ఒక పొరపాటు జరిగింది అందుకు ప్రయత్చితంగా గంగా నదిలో స్థానమాచరించాలని బయలు దేరుతున్నాను అని బయలు దేరాడు బ్రాహ్మణుడు  కొంత దూరం ప్రయాణించిన తరువాత ఒక నధి తారసపడింది బ్రాహ్మణుడు  ఆ నది వడ్డున 5 సంవత్సరాలు కాలం జపం చేసుకుంటు ఉండగా అదే దారిన పోతున్న ఒక బ్రాహ్మణుడు  కలిసాడు మాటల మధ్యలో అది గంగా నది కాదు అని తెలుసుకున్న బ్రాహ్మణుడు  మరల బయలుదేరాడు కొంత దూరం ప్రయాణం చేయగా మరల ఒక నది ఒడ్డుకు చేరుకొని మరల 5  సంవత్సరాలు కాలం జపం చేసుకుంటు ఉండగా  దారిన పోయే వారి ద్వారా తాను ఉన్న నది గంగా నది కాదు అని తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు మరల మరొక నది తీరానికి చేరుకొని అక్కడ 5 సంవత్సరాలు కాలం జపం చేసుకుంటు ఉండగా అది గంగా నది కాదు అని తెలుసుకొని మరల ప్రయాణించాడు కనుచూపు మేరలో గల గల పారె ఆ గంగమ్మ ప్రవహిస్తు వుంది దూరం నుంచి చూస్తూనే తన జీవాత్మ విడచి పోయింది  వెంటనే అక్కడకు యమకింకరులు వచ్చి ఆ సద్ బ్రాహ్మణుడు ని తీసుకొని పోయి యమకింకర నాయకుడైన యమధర్మరాజు సభలో ప్రవేశ పెట్టారు యమధర్మరాజు చిత్రగుప్త ఇతని నేరములు తెల్పుము అని చెప్పగా ప్రభు బ్రాహ్మణుడు ఒక తప్పిదము చేసాడు కానీ 15 సవసరాలు గంగా నదిలో మునిగి జపం చేయడం వల్ల ఇతని పాపం పోయింది అని చెప్పగా అటులైన వెంటనే ష్వర్గలోకమునకు పంపుము అని యమధర్మరాజు చెప్పాడు
నిజానికి ఆ బ్రాహ్మణుడు మునిగినిది గంగా నదిలోకాదు,
మానవులు త్రికరణ శుద్ధిగా చేస్తే జీవుడు దేవుడిలో  కలుతాడు , 

నామ మాత్రంగా చేస్తే ఫలితం అనుభవిస్తాడు. 
ఓం నమ శివాయ నమః