Wednesday 22 March 2017

గణపతి ఆవిర్భావం


గణపతి ఆవిర్భావం 
ఒక నాడు పార్వతి దేవి స్నానం చేస్తుండగా , శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు. అందువల్ల  అమ్మవారు సిగ్గు పడ్డారు. స్నానాన్ని అర్ధాంతరం గా  ఆపేసి హడావిడిగా  అంతః పురం లోనికి వెళ్లిపోయారు. అనునిత్యం తన చేత  వాంచింపబడే వాడే అయినప్పటికీ  కూడా ఆయన లా హఠాత్తుగా రావడం అమ్మవారికి నచ్చలేదు . ఆ సందర్భాన్ని  పురస్కరించుకొని  అమ్మవారి చెలికత్తెలైన జయ -విజయ లు ఆ తల్లి కి ఒక సలహా ఇచ్చారు.  ఇక్కడ అందరూ శివ ఘనాలే ఉన్నందు వల్ల , మన వ్యక్తి అంటూ  ఒకరు ఉండాలని , ఎవరినైనా నిరోధించగల శక్తి కలవాడై ఉండాలని సలహా ఇచ్చారు.  అప్పుడు అమ్మవారు ఆలోచించి , నా పక్క కూడా ఒక ఘనం ఉండాలని, అది కూడా పురుషాకృతి లో ఉండాలని అనుకున్నది.  తన మెను ను  నలిచినది . ఆ వచ్చిన పదార్ధముతో ఒక పురుషాకృతిని నిర్మించినది . ఆ బొమ్మకు ప్రాణం పోసి, ఆ సర్వాంగ సుందరుణ్ణి ఆశీర్వదించి, తన బిడ్డ గా స్వీకరించి  ఆ సర్వాంగ సుందరుణ్ణి  అమ్మవారి అంతః పుర ద్వారం  దగ్గర నియమించుకుంది.  ఇలా  ఆ భోజ్జ గణపయ్య  ఆవిర్భవించాడు. 

No comments: