Thursday 23 March 2017

శివపురాణం మహిమ


శివ పురాణం మహిమ 
పూర్వ కాలములో దేవ రాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.  కులము బ్రాహ్మణకులమే ఐన ఆచార వేవహారాలలో ఏ ఒకటి పాటించే వాడు కాదు . డబ్బు సంపాదనే అతని మార్గము.  ఎన్నో రకాల మోసాలుచేస్తు చాలా  డబ్బు సంపాదించాడు.   ఇలా కొంత కాలముతరువాత ఒక నాడు నది తీరానికి స్ననము చేయడానికి వెళ్ళాడు.   అక్కడ శోభావతి అనే వేశ్యను చూసి మనసు పడి ఆమె దగ్గర  సహజీవనము సాగిస్తున్నాడు.  అతను సంపాదించిన ధనమంతా ఎలా వచ్చినదో అలానే ఆమెకు ఇచ్చేసాడు. కొంతకాలానికి అతని ధనమంతా అయిపోయింది.  బ్రాహ్మణుడు ఇంట్లో ఉన్న బంగారం  మొత్తమూ,  కన్న తల్లీ దండ్రులను మరియు భార్యను చంపి తీసుకొని పోయి ఇచ్చేసాడు.  ఆ సొమ్ములన్నీ  అయిపోగానే అతనిని వెల్లగొట్టింది.  అతనికి జ్వరం కమ్మింది.  కాలముకూడా చేరువైంది అతనికి దగ్గరగా ఉన్న శివాలయము లో పడుకున్నాడు.  నోట మాట రావటము లేదు.  అదే రోజు ఆ శివాలయములో శివపురాణము పారాయణము చేసారు.  అది వింటూ శివపురాణము అయిపోగానే ఆ బ్రాహ్మణుడు కాలము చేసాడు.  అదే సమయములో యమ భటులు వచ్చి అతని సూక్ష్మ దేహాన్ని తీసుకొని బయలుదేరారు.  ఇంతలో అక్కడికి శివ దూతలు వచ్చి యమదూతలను  వారించి బ్రాహ్మణుడి సూక్ష్మ దేహాన్ని కైలాసానికి తీసుకొని వెళ్లి పోయారు.  యమభటులు అది  గమనించి అక్కడ జరిగినదంతా యమధర్మ రాజు గారికి చెప్పారు.  ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానమేమిటి అని యముడిని అడిగారు.  అప్పుడు ఆ యముడు, ఎన్ని పాపాలు చేసిన అతను శివపురాణము విన్నందు వల్ల సకల పాపాలు పోయి కైలాస ప్రాప్తి కలిగింది.  అని భటులకు చెప్పాడు
శివపురాణము విన్నా ,చదివిన  సకల పాపములు పోయి శివ సాన్నిధ్యమే కలుగును 
ఓం నమశ్శివాయ 

No comments: