Wednesday 1 March 2017

యద్ భావం తత్ భవతి


యద్ భావం  తత్ భవతి 

వజ్రాయుధం , వేయి నేత్రాలు కలిగి ఉన్న అమరాధిపతి ఐన అమరేంద్రుడి సభ ప్రాంగణం లో అష్టదిక్పాలకులు ,మహర్షులు ,ఎందరో మహానుభావులు కలరు ఆ సభకు దగ్గరగా అమరేంద్రుడి నందనవనం ఉంది అందులో మహా శెక్తి వంతమైన వృక్షంలు  కలవు పారిజాత వృక్షం, కల్ప వృక్షం ఇంకా ఎనో శేక్తి వంతమైన వృక్షంలు కలవు వీటికి కామరూపం దాల్చే శేక్తి ఉంది  ఆ వృక్షం క్రింద ఉండి  మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇలా కొంత కాలం తరువాత  భూలోకం లో  ఒక అరణ్యములో ఒక బాటసారి ఆకలి , దపిక  మరచి ప్రయాణం సాగిస్తు ఉండగా అతి భయంకరమైన ఆ అరణ్యములో నడవడం కష్టం ఐన ఆ బాటసారి ప్రయాణం సాగిస్తు చాలా దూరం ప్రయాణం చేయగ ఆ అడవిని దాటి ఒక ఎడారిలో ప్రయాణం సాగిస్తు ఉన్నాడు కొంత సమయానికి అతనికి కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది ఎటుచూసినా ఒక్క చెట్టు కుడా కనపడలేదు మరలా కొంత దూరం ప్రయాణం తరువాత ఒక అందమైన ,పెద్దదైన , పచ్చటి ఒక వృక్షం కనపడింది అక్కడకు వెళ్లి ఆ చెట్టుక్రింద కుచున్నాడు కొంతసమయానికి అతనికి ఆకలి వేసింది అపుడు ఆ బాటసారి ఆకలిగా ఉంది మంచి భోజనం దొరికితే బాగుంటుంది అని అనుకోగా అతని ముందు రుచికరమైన భోజనం ప్రత్యక్షము ఐనది అతడు వచ్చినదే తడువుగా దానిని భుజించినాడు తరువాత కొంత సమయానికి హయిగా నిధర పోయేందుకు ఒక తల్పం ఉంటె బాగుండేది అని అనుకున్నాడు అది ప్రత్యక్షము ఐనది అతడు వచ్చినదే తడువుగా దాని మీద పడుకున్నాడు కొంత సమయానికి అతనికి ఆశ్చర్యం వేసి నిదరలోంచి లేచి నేను అనుకున్నది అనుకున్నటుగా నాముందు ఉన్నాయి కదా ఒకవేళ నేను ఉన్న వృక్షం  రాకాసి  వృక్షంమా అనగానే వెంటనే ఆ వృక్షం  రాకాసి రూపం లో కి మారి పోయింది ఒకవేళ నను మింగేస్తుందా అనగానే ఆ వృక్షం  అతనిని మింగేస్తుంది ఆ వృక్షం  మే కల్ప వృక్షం  కామరూపములో అక్కడ ఉంది మనం వృక్షం  క్రిందకు వెళ్లి మనం  కోరిన విధం గా మనకు వరాలను ఇస్తుంది మన బాటసారి ఏవిధంగా అనుకున్నాడో అవి అన్ని నెరవేర్చింది 

No comments: