Wednesday 8 March 2017

గజదొంగ మోక్షం


గజదొంగ మోక్షం

 రాజులు రాజ్యమేలుతున్న కాలం లో   ఒక రాజ్యం లో ఆ రాజ్యానికి రాజు ఉండేవాడు, ఆయనకి ఒక కుమార్తె కలదు. ఆమెను అపురూపంగా చూసుకుంటు  ఉండేవాడు  ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమె ఒక కోరిక కోరింది , తండ్రి గారు నేను ఒక సన్యాసం తీసుకున్న మహానుభావుడని పెళ్లి చేసుకుంటాను. ఆయన కోరిక ప్రకారం సన్యాసం నుండి  సంసారం లోకి వచ్చిన లేక  ననైన సన్యాసం తీసుకోమన్న  సమ్మతమే., అని చెప్పగా ఆ రాజు  తన రాజ్యం లో ఈ విషయాన్ని చాటింపు వేయించాడు . అదే రాజ్యం లో ఒక గజదొంగ ఎన్నో దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతు  ఉండగా , రాజు గారు చాటింపు వేసిన విషయం ఈ గజదొంగ చెవిన పడింది , అది విన్న గజదొంగ దుర్బుర్దితో ఎలాగైనా ఈ రాజ్యానికి రాజుగా ఉండాలన్న కోరిక తో వేష భాషలను మార్చి రాకుమారి కోరిన విధముగా సన్యాసిగా జీవనం సాగిస్తునట్లుగా నటించ సాగాడు. రాజు గారు ఆ రాజ్యం లో పది మంది సన్యాసులను ఎంచుకున్నాడు , వారిలో ఒకరు మన గజ దొంగ  సన్యాసి . ఒకరోజు వీరంతా స్వయంవరానికి రమ్మని ఆహ్వానించాడు , అందరు వొచ్చారు . రాకుమార్తె కొన్ని పరీక్షలు నిండు సభలో పెట్టగా పది మంది సన్యాసులలో గజ దొంగ ఐన సన్యాసి నెగ్గడు . రాకుమార్తె పూలమాలతో అయన  దెగరకు వచ్చిమీరు నాకు నచ్చారు స్వామి , మీరు సన్యాసము నుండి సంసారం లోకి వచ్చిన లేక నన్ను సన్యాసం తీసుకోమనిన మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. అని చెప్పగా దొంగ సన్యాసి పైకి లేచి ప్రభు నేను మీ రాజ్యం లో ఒక గజదొంగని ఈ రాజ్యానికి రాజుగా ఉండాలన్న కోరిక తో ఈ విధంగా నాటకం ఆడాను , నేను ఎప్పుడైతే ఈ కాషాయ వస్త్రాలు ధరించానో ఈ సన్యాసి జీవితం గడప సాగానో  నాకే తెలియని ఒక అనుభూతి కలిగింది . మీరు అనుమతి  ఇస్తే నా శేష జీవితం అరణ్యం లో తపస్సు చేసుకుంటు  నా జీవితాన్ని గడుపుతాను , అని ఆ రాజుని కోరాడు . ఆ రాజు అనుమతి  ఇవ్వటం తో అరణ్యం వెళ్ళి  నిజమైన సన్యాసంతో అతను మోక్షాన్ని  పొందాడు. 


No comments: