Friday 31 March 2017

వ్యాసమహర్షి తపస్సు

వ్యాసమహర్షి  తపస్సు 
ఆ మహాపురుషుడు, మహా తపస్ సంపన్నుడు, వీరి తపస్సు విధానం చాలా  కఠినంగా చేశారు.  ఆ మహాపురుషుడు అలా క్రమక్రమముగా తపస్సు లో తన మనస్సును ఏకం చేసి బయట అనేక విషయాల పై తిరిగే మనస్సును ఏకాగ్రం చేసి మనస్సును తన మంత్రము పై నిమగ్నము చేసాడు.  ఆహారము మరియు నీరు మానేసాడు, ఉచ్వాస నిశ్వాసలు క్రమంగా బంధించాడు.  దానివల్ల మనసును వశం చేసుకున్నాడు.  ప్రాణము కుడా అన్ని అవయవాలలోంచి వచ్చి హృదయములో బంధించాడు.  ఆలా మనస్సు , బుద్ధి , ఇంద్రియాలు అన్ని ఏకమై మనసులోకి ప్రవేశించాయి అనేక బయట విషయాల పై ఆలోచించే మనసు , మనసులోనే బంధించి మనసుతో ,మనసులోనే ధ్యానించసాగాడు.  క్రమేపి ప్రాణము మనసు ఏకమై అంధకారంలో ఉన్న మనసు విస్తరించి విశ్వాత్మకంగ మారి బయటకు విడుదల అయినది.   శరీరము పరిధిని దాటి మనసు క్రమంగా పంచభూతాలను అతిక్రమించి ఈ భూగోళము పై వ్యాపించింది.  ఆ తరువాత గ్రహ నక్షత్ర మండలాలను దాటి ఈ యావద్ విశ్వము తానై వ్యాపించింది.  క్రమక్రమముగా నేనే ఈ శరీరము ,నేనే ఈ మనసు  అనే భావము పోయి నేనే ఈ ఆకాశము  అనే భావము కలుగ సాగింది.  ఆ మహాపురుషుడు తపస్సు  ఎంత కఠినముగా చేసి విశ్వమే తానైనాడు.  సృష్టి రహస్యాన్ని ఛేదించాడు. 

No comments: