Monday 27 March 2017

జర్మజర్మలఫలము

జన్మ జన్మల ఫలము 
ఒక కాళికాదేవి భక్తుడు అమ్మ వారిని ప్రసన్నము చేసుకోడానికి ఒక గురువు దగ్గర తంత్ర విద్యలో మంత్రోపదేశం తీసుకొని దానిని  ఏవిధంగా చేయాలి, ఆ పూజకు కావలిసిన సామాగ్రిని తెలుసుకొని, ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకొని, ఆ పూజ కు కావలసిన సామాగ్రి కోసము తిరుగుతూ ఉన్నాడు.  కొంత కాలము గడిచింది, కాని అతనికి ఆ పూజ కు సంబంధించిన సామాగ్రి దొరకలేదు.  గురువు చెప్పిన సమయములో అది ఒక శవము మిద కుర్చొని  స్మశానంలో చేయాలి.  కాని ఆ భక్తునికి ఆ పూజకు కావలసిన సామాగ్రి దొరకలేదు.  గురువు చెప్పిన సమయము వచ్చినది, అతను బాధతో ఆరోజు స్మశానానికి ఆ పూజ గడియలలో వెళ్ళాడు.  అక్కడ అనుకోకుండా గురువు గారు చెప్పిన పూజకు సంబంధించిన సామాగ్రి మరియు ఒక శవము చూసి ఆనందముతో వెళ్లి కాళికా దేవి ని ప్రసన్నము చేసుకున్నాడు.  అమ్మ ప్రసన్నురాలై ఆ భక్తుడికి దర్శనము ఇచ్చి వెళ్లి పోయే సమయానికి ఆ భక్తుడికి సందేహము వచ్చి, "అమ్మ నాకు గురువుగారు చెపిన పూజ సామాగ్రి దొరకలేదు కాని పూజ చేసే సమయానికి నాకు అవే కన బడాయి ఎలాగమ్మా" అని అడిగాడు నాయనా దూరముగా ఒక శవము ఉంది చూడు అతడే ఇవ్వన్నీ  ఇక్కడ సమకూర్చుకున్నాడు, కాని ఈ జన్మలో అతని కర్మలు ఇంకా ఉండడముచేత అతను చనిపోయాడు.  నువ్వు ఎన్నోజన్మల నుండి నా పూజకోసము ఒకొక్క సామాగ్రిని సమకూర్చుకొని చనిపోయావు ఈ జన్మలో నీ  కర్మములు పోవడంవల్ల నీకు నన్ను  దర్శించే అవకాశము వచ్చినది నాయన
 ఏజన్మకు ఏది ప్రాప్తమో అది మన కర్మలను బట్టి ప్రాప్తమౌతుంది 

No comments: