Friday 3 March 2017

చక్వ వీణ మహరాజు

చక్వ వీణ మహరాజు 

ఎందరో రారాజులు మన భరత భుమిలో రాజ్యలను పరిపాలించారు వారిలో ఒకరైన ఈ చక్వ వీణ మహరాజు మంచి పరిపాలన మరియు కష్ట జివి ఇతని చేతులతో పండించిన  పంటను మాత్రమే తింటు మిగిలిన సంపదను ప్రజలకు దాన ధర్మాలకు ఉపయోగిస్తు తన రాజ్యాని పరిపాలిస్తు ఉండేవాడు ఇతనికి భార్య ఉంది ఈ రాజ్యము ఎపుడు సిరి సంపదలతో ,పాడి పంటలతో విరాజిలుతు ఉంది ఒకనాడు ఈ రాజ్యం లోని సమంత రాజులను వారి భార్యలను భోజనానికి ఆహ్వానం చేశాడు అందరు పట్టు వస్త్రాలు ,బంగారు నగలు ధరించి వచ్చారు చక్వ వీణ మహరాజు వాని భార్య మాత్రం నార చిరాలు ధరించి ఉండగా సమంత రాజుల భార్యలు వచ్చి మహారాణితో మాటల మధ్యలో ఈ రాజ్యానికి పట్టపు రాణివి కధ నీవు ఈ దుస్తులు ధరించవు ఎందుకు అని అడిగారు విందు కారిక్రమం అయిపొయింధి అందరు వెళిపోయిన తరువాత చక్వ వీణ మహరాజు ని రాణి నను అందరు అవహేళనగా మాట్లాడారు నాకు పట్టు దుస్తులు ,బంగారు ఆభరణాలు ధరించాలి అని ఎంత చేపిన వినకుండా రాజుకు మొరపెట్టుకుంది దానితో చక్వ వీణ మహరాజు సభ ఏర్పాటు చేసి మన చుట్టు పక్కల అందరిలో ఎక్కువగా ఎవరు పాపాలు చేశారో చెప్పండి అని అడుగగా అపుడు ఈ రాజ్యానికి దగ్గరగా ఉన్న లంకా నాధుడు ఐన రావణ బ్రహ్మ పేరు చెప్పారు వెంటనే వారి రాజ్యం లోని దూతను పిలిచి నీవు పోయి రావణ బ్రహ్మ దగ్గర నేను బంగారు మరియు ధనము అడిగి తీసుకొని రా అని ఆ దూతను పంపినాడు ఒకవేళ నేను అడిగినది ఇవ్వక పోతే యుద్ధనికి సిద్ధంగా ఉండమని హెచ్చరించు అని దూతను పంపినాడు ఆ దూత పరమ శివుడు పిలిస్తే పలికే ఆ రావణ బ్రహ్మ నిండు సభలోకి ప్రవేశించాడు అందరి సమక్షంలో చక్వ వీణ మహరాజు చేపిన విధంగా రావణ బ్రహ్మకు చెప్పాడు అది విన రావణుడు పకపక గట్టిగా నవి అష్ట దిక్పాలకులు చక్రవర్తులు , దేవతలు నను ఏమిచేయ లేక నాకు బానిసలుగా ఉంటె నామీద కు యుద్ధనికి వస్తాడా అంటు యెలనగా  మాట్లాడి నువ్వు దూతగా రాకపోతే ని తల నెల మీద పడుండేది అని సభను రేపటికి వాయిదా వేశారు దూతగా వచ్చిన వెక్తి దగ్గరగా ఉన్న సముద్ర వడ్డున పోయి కూర్చున్నాడు సాయంత్రము రాణీవారు రావణాసురుడు కోటపైకి ఎక్కి కూర్చొని ఉండగా సముద్రము వడ్డున కూర్చున దూతను చుచి రావణుని అడిగింది అపుడు రావణుడు సభలో జరిగినది అంత వివరించాడు అపుడు రానివారు ప్రభు నేను చక్వ వీణ మహరాజు గురించి విన్నాను అతనికి అడిగినది ఇచ్చి పంపించండి అని కోరింది రావణుడు కుదరదు అని చెప్పగా రాణి గారి దగ్గరలో ఉన్న బియ్యపు గింజలు తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న పావురాల మధ్యలో కి విసిరి ఈ గింజలమీద అన చక్వ వీణ మహరాజు మీద ఓటు వీటిని తింటే వాటి తల వేయి ముక్కలు అవుతుంది అని చెప్పగా ఆ పావురాలు వాటిని ముట్టలేదు ఒక్క చెవిటి పావురం తినగానే దాని తల వేయి ముక్కలు అయింది మరల గింజలు విసిరి చక్వ వీణ మహరాజు  మీద అన వీటిని తినక పోతే తలలు వేయి ముక్కలు అవుతాయి అనగానే అక్కడ ఉన్న గింజల్ని తేనేస్తాయి మరల గింజలను చలి రావణ బ్రహ్మ మీద అన వీటిని తెంటే మీ తలలు వేయి ముక్కలు అవుతాయి అని చెప్పగా అన్ని పావురాలు అక్కడున్న గింజలను తేనేస్తాయి ఇప్పుడైనా అతను ఎంత గొప్పవాడో చూడు అని చెప్పగా ఐన రావణ నేను వినను అని చెప్పాడు మరుసటి రోజు సభకు ఆ దూతను పిలిచారు ఆ దుతకు నేను ఇవ్వను అని చెప్పడంతో ఆ దూత రాజును ఆ సభలోని వారిని నాతో సముద్రము దగ్గరకు రమని పిలిచాడు అక్కడ రాత్రంతా రావణాసురుడి కోట లాగ ఇసుకతో చిన్నదిగా నిర్మించి ఉన్న దాగరకు అందరిని తీసుకొని పోయాడు అపుడు రావణాసుర ఇస్తావా ఈయవ అని అడిగాడు నేను ఇవ్వను అనగానే చక్వ వీణ మహరాజు మీద అన ఈ గోడ కూలి పోవాలి అని తోయగా అక్కడ కోటాలో ని ఒకగోడ కూలి పోతుంది మరల అడుగుతాడు దూత నేను ఇవ్వను అనగానే మరల చక్వ వీణ మహరాజు  అన అని మరొక గోడను తోయడంతో కోటలోని మరొక గోడ కూలిపోతుంది దానితో రావణుడు ఆ దూతను కోటలోకి ఆహ్వానించి అతను కోరిన సంపదలను ఇచ్చి పంపుతాడు అవని తీసుకొని చక్వ వీణ మహరాజు దగ్గర అప్పగిస్తాడు అపుడు రాణిని పిలిచి దూత రావణ సభలో జరిగినది చేపు అని అంటదు అక్కడ జరిగినది  రాణికి వివరిస్తాడు దానితో నాభర్త ఇంత నిజాయితీ పరుడా అని తెలుసుకొని దూత తెచ్చిన సంపదను తిరిగి ఇచ్చేయమని కోరింది రాజు గారి నిజాయితీ ఎంత గొప్పదో చుడండి 


No comments: