Sunday 29 January 2017

పరమపద సోపానం పరమ శివుని పాదమ్

శేక్తి పాదమ్  శివ మూర్తి పాదమ్
అది పాదమ్ అనాది పాదమ్
దివ్య పాపదమనం త పాదమ్
ధరణి నేలు ధర్మ పాదమ్
 బ్రహ్మమురారి సేవిత పాదమ్
రావణదర్పమనచిన పాదమ్
దేవముని ప్రవరార్చిత పాదమ్
మోక్ష మొసగు ముక్తి పాదమ్
సురాసుర దేవగణార్చిత పాదమ్
ముజగములను ఏలేడు  ముకంటి పాదమ్
కరుణాతరంగుని కాంతి పాదమ్
సకల జీవకోటిని సంరక్షించెడి పాదమ్
సాదు సజేనా  దేవమునిజన సేవిత పాదమ్
త్రిపురాంతక  పాదమ్
పంచభూతేశుని పరమ పాదమ్
దక్షసు యజ్ఞ వినాశన పాదమ్
సకలకాలాన్విత నటశేఖర నాట్య పాదమ్
సనకాది ముని ముక్షుల వందిత పాదమ్
మృకండ మణివర పూజిత పాదమ్
మరణ శాశనమును ఎదిరించిన పాదమ్
పునర్జీవనమొసగిన పాదమ్
పాప ప్రక్షాళన గావించిన పాదమ్
అఖిలమును ఎలెడి అర్థనారీశ్వర పాదమ్
ఆర్తి బాపెడి ఆక్షేయ పాదమ్
జ్ఞాన జోతిని కన్నప్ప మదిలో వెలిగించిన  పాదమ్
ఘన ఘనుడీ భవ్య పాదమ్ 

పరమపద సోపానం పరమ శివుని పాదమ్ 


     

No comments: